ఏకాదశి రోజు చెయ్యాల్సిన పనులు జ్యోతిషులు చెప్పిన నిజాలు

410

అన్ని ఏకాదశులలో కెల్ల ఉత్తమమైంది. మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది.విష్ణు భగవానుడు అలంకార ప్రియుడు.మహా విష్ణువునకు పూలతో అలంకరణ చేసి విష్ణు సహస్ర నామ పారాయనం చేస్తూ విష్ణువును పూజించే రోజే ఈ ఏకాదశి తొలి ఏకాదశి. ఆషాఢమాసలో వచ్చే ఈ ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు పాలసముద్రంలో విష్ణువు యోగనిద్రలోకి వెలతాడు కనుక ఈ ఏకాదశిని శయనైకాదశి అని అంటారు.యోగ నిద్రకు సిద్ధమైన దేవుని కోసం భక్తులు ఉపవాసం చేస్తారు.అందుకే నిర్జల ఏకాదశి,శయన ఏకాదశి పిలుస్తారు.ఉత్తరదిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణం వైపుకు వాలినట్లుగా కనిపిస్తాడు. శయనైకాదశి ఉపవాస వివరాలను భవిష్యోత్తర పురాణంలో వివరింపబడింది. ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి ఘడియల్లో చేసే అన్న దానానికి అనంతకోటి పుణ్య ఫలాలు వస్తాయని చెప్తారు. శ్రీకృష్ణావతారంలో తాను భక్తితో ఇచ్చే నీటినైనా సంతోషంతో స్వీకరిస్తాను అని చెప్పిన భగవానుని తలుచుకుని అత్యంత అనురాగంతో కూడిన భక్తితో మహావిష్ణువును శోభాయమానంగా అలంకరించి పదకొండు వత్తులతో దీపారాధన చేస్తారు.

Image result for ekadashiఈ ఏకాదశి ఉపవాసం ఏలా చేయాలి అంటే దశమి రోజు రాత్రి వండిన వంటకాలను ఏమి తినకుండా పండ్లు, జ్యూస్ లాంటివి తీసుకోవాలి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి. ద్వాదశి నాడు ఉదయన అన్నం వండి దేవునికి నివేదన చూపించి తినాలి ఇలా ఉపవాసం చేసే శారీరకశక్తి లేని వారు అంటే పిల్లలు,గర్భిణులు,వృద్ధులు,ఆనారోగ్యంతో ఉన్నవారు ప్రతీ రెండు గంటలకు ఒక సారి ఏదో ఒక పండ్ల రసం తీసుకుంటు ఉపవాసం చేయాలి.దైవంనకు నిక్కచ్చుగా చేయకపోతే పాపం తగులుతుంది,మంచిది కాదు అనే అజ్ఞానంతో ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దు.శారీరక పుష్టి ఉన్నవాల్లు కటువైన ఉపవాసం చేస్తారు,వీలు కాని వారలు మనస్సుతో దండం పెట్టుకోండి చాలు.ఉపవాసం చేసేవారు ద్రవ రూపమైన కొబ్బరి నీళ్ళు,జ్యూస్,మంచి నీళ్ళను తీసుకుంటే తప్పులేదు.

Image result for ekadashi

ఉపవాసం చేసి శ్రీ హరికి ఇష్టమైన పేలపిండిని బెల్లంతో కలిపి నైవేద్యంగా అర్పిస్తారు.ప్రతి వైష్ణ దేవాలయంలోను స్వామికి పవళింపు సేవాఉత్సవం జరుపుతారు. సర్వ దేవతా నివాస స్థానమైన గోవును కూడా ఈ ఏకాదశి రోజు పూజిస్తారు. అధర్వణవేదం, బ్రహ్మాండ, పద్మపురాణం,మహాభారతం కూడా గో విశిష్టత తెలుపుతాయి.గోశాలలను శుభ్రం చేసి ముగ్గులు వేసి శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువు ప్రతిమను పద్మాలపై పెట్టి శాస్త్రోకంగా పూజచేస్తారు. మహా విష్ణువునకు అత్యంత ఇష్టమైన తులసి కోట దగ్గర పద్మం ముగ్గువేసి దీపం వెలిగించి పలురకాల పండ్లను నివేదిన చేస్తారు. ఏకాదశి వ్రతాన్ని రుక్మాంగదుడు, అంబరీషుడు కూడా పాటించారు.వాళ్లు పాటించడమే కాక వారి రాజ్యాల్లోని జనులందరి చేతకూడా ఏకాదశి వ్రతాన్ని పాటించేలా చేశారు. ఏకాదశి వ్రతం చేసేవారిపై ఎల్లప్పుడు మహావిష్ణువు తోడునీడగా ఉంటాడు.

ఏకాదశి వ్రతాన్ని రుక్మాంగదుడు, అంబరీషుడు కూడా పాటించారు.వాళ్లు పాటించడమే కాక వారి రాజ్యాల్లోని జనులందరి చేతకూడా ఏకాదశి వ్రతాన్ని పాటించేలా చేశారు. ఏకాదశి వ్రతం చేసేవారిపై ఎల్లప్పుడు మహావిష్ణువు తోడునీడగా ఉంటాడు. మహా విష్ణువు నాలుగు నెలలపాటు క్షీర సముద్రంలో శేషశయ్యపైన పవళిస్తాడని ఋషులు,యోగులు మహావిష్ణువును కీర్తించడంలో తమ జీవితకాలాన్ని గడుపుతుంటారు. దేశ సంచారులైన యతులు ఈ నాలుగు నెలలు ఒక్కచోటనే ఉండి విష్ణుకీర్తనలు చాతుర్మాస వ్రతాన్ని చేస్తుంటారు. ఏకాదశి ఉపవాసవ్రతం చేసుకున్నవారికి అశ్వమేధ యాగం చేసినంత, అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు వివరిస్తున్నాయి.