జులై 2న శక్తివంతమైన సంపూర్ణ సూర్య గ్రహణం…. ఈ 4 రాశులపై తీవ్ర ప్రభావం ఇలా చేస్తే అష్ట ఐశ్వర్యాలు మీసొంతం

1349

సూర్య గ్రహణం అమావాస్య నాడు మాత్రమే వస్తుంది. అయితే అన్నీ అమావాస్యలకు సూర్యగ్రహణం ఏర్పడదు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖపై ఉండి చంద్రుడు రాహువు లేదా కేతువుస్ధానంలో ఉన్నప్పుడు మాత్రమే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. పూర్తి సూర్యగ్రహణ సమయం 8 నిమిషాలకు మించి ఉండదు. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్లనే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ ఏడాదిలో రెండో సూర్యగ్రహణం జులై 2న ఏర్పడుతుంది. భారతీయ కాలమాన ప్రకారం… జులై 2 బుధవారం రాత్రి 10.21 గంటలకు ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి 2.15 నిమిషాలకు సమాప్తమవుతుంది. దాదాపు నాలుగు గంటలపాటు సూర్యగ్రహణం ఉంటుంది.ఇది సంపూర్ణ గ్రహణమే. అయితే ఏ గ్రహణం తర్వాత నాలుగు రాశుల వారి పరిస్థితి పూర్తీగా మారిపోనుంది. మరి ఏ ఏ రాశులకు మారనుందో చూద్దామా.

ఈ క్రింది వీడియో చూడండి

మేషరాశి వారికి పదోన్నతి కలుగుతుంది. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. వీరికి ధనప్రాప్తి చాలా ఎక్కువగా ఉంది. ఇక వృషభరాశి వారిని పరిశీలిస్తే వీరికి ఎప్పటినుంచో ఉన్న ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. మిధునరాశి వారు అకారణంగా వచ్చే నిందల నుంచి బయటపడతారు. తప్పు లేకపోయినా సరే నిందలు పడుతున్నవారు ఆ సమస్య నుంచి బయటపడతారు. కర్కాటకరాశి వారికి ఉండే మనస్పర్థలు తొలిగిపోతాయి. వీరు సుఖ సంతోషాలకు సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది. సిమ్హరాశివారు అప్పుల బాధల నుంచి ఆర్ధిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది.చాలా ఎక్కువగా డబ్బును కూడబెట్టుకునే అవకాశం ఉంది.

Image result for సూర్యగ్రహణం

కన్యారాశి వారిలో ఎవరికైనా సంతానోత్పత్తి లేకుంటే వారికి సంతానోత్పత్తి కలిగే అవకాశం ఉంది. తులారాశి వారికి గృహలాభం జరుగుతుంది. కొత్త ఇల్లు కొనుక్కునే అవకాశం తొందర్లోనే కలుగుతుంది. వృశ్చికరాశి వారికి కోర్ట్ వ్యవహారాలు చక్కబడతాయి. అలాగే వీరికి ధనప్రాప్తి కలిగే అవకాశం మెండుగా ఉంది. ధనస్సు రాశివారు సంతోష అనుభూతులను అనుభవిస్తారు. అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. వీళ్లకు తిరుగుండదని చెప్పుకోవాలి. మకరరాశి వారు అనారోగ్యం నుంచి బయటపడతారు. అయినా కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభరాశి వారు గతంలో పోగొట్టుకున్న ఆస్తులను పొందుతారు. లక్ష్మీదేవి వీళ్ళ మీద చాలా ఎక్కువ ప్రేమను చూపిస్తుంది. మీనరాశి వారిలో ఎవరికైనా అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళతో వైరాలు ఉంటె సమసిపోతాయి. అందరు కలుసుకుని సంతోషంగా ఉండే అవకాశం ఉంది.అంతేకాకుండా వీరికి ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంది.ఇలా ఈ గ్రహణం తర్వాత ఒక్కొక్కరికి జరిగే విషయాలు. మరి ఈ సూర్యగ్రహణం గురించి అలాగే గ్రహణం తర్వాత అన్ని రాశుల వారికీ కలిగే లాభనష్టాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.