రేపే సంపూర్ణ సూర్య గ్రహాణం…. గ్రహణ సమయంలో ఈ ఒక్కనామం జపిస్తే చాలు ధనవంతులు మీరే..

239

సూర్య గ్రహణం అమావాస్య నాడు మాత్రమే వస్తుంది. అయితే అన్నీ అమావాస్యలకు సూర్యగ్రహణం ఏర్పడదు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖపై ఉండి చంద్రుడు రాహువు లేదా కేతువుస్ధానంలో ఉన్నప్పుడు మాత్రమే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. పూర్తి సూర్యగ్రహణ సమయం 8 నిమిషాలకు మించి ఉండదు. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్లనే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ ఏడాదిలో రెండో సూర్యగ్రహణం జులై 2న ఏర్పడుతుంది. భారతీయ కాలమాన ప్రకారం… జులై 2 బుధవారం రాత్రి 10.21 గంటలకు ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి 2.15 నిమిషాలకు సమాప్తమవుతుంది. దాదాపు నాలుగు గంటలపాటు సూర్యగ్రహణం ఉంటుంది.ఇది సంపూర్ణ గ్రహణమే. అయితే గ్రహణ సమయంలో కొన్ని తప్పక పాటించాలి.

Image result for solar eclipse

ఆచారపరులు గ్రహణ సమయాల్లో గ్రహణం పట్టేముందు పట్టు స్నానాన్ని, వీడే ముందు విడుపుస్నానాన్ని ఆచరించాలి. గ్రహణానికి సంబంధించిన అతి నీలలోహిత కిరణాలను నివారించే శక్తి కలిగిన ప్రకృతి ప్రసాదితమైన గరకలను ఇళ్లల్లో ఉంచుకుంటే గ్రహణ ప్రభావం వాటి మీద పడదు. దేవతా గదుల్లో, ఆహార పదార్థాల్లో, నీటిలో వేసి ఉంచుకోవడం ద్వారా గ్రహణ కాంతులను ఈ గరక దరిచేరనియ్యవు. గ్రహణ సమయాల్లో చేసే జపాలు, అనుష్టానాలు కోటి రేట్లు ఫలితాన్నిస్తాయని, ఈ సమయంలో చేసే జపాలు, దానాలకు విశేష ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. గ్రహణ సమయంలో ఇష్ట దైవ నామాన్ని జపించడం మంచిది. గ్రహణ సమయంలో ఏం చేసినా సరే అది వందరెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుంది. గ్రహణ సమయంలో ప్రయాణాలు చెయ్యడం మంచిది కాదు. అందుకే ఇంట్లో ఉండి ఇష్ట దైవాన్ని నామస్మరణ చేస్తే మంచిదని వేద పండితులు చెబుతున్నారు. గ్రహణం విడిచిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత సంప్రదాయ బద్ధంగా తల స్నానం చేయాలి. పూజగదిని శుభ్రం చేసుకొని, జంధ్యం మార్చుకుని దీపం పెట్టాలి.

గ్రహణం విడవగానే స్నానం చేయడం వల్ల శారీరక, మానసిక సమస్యలు దూరం అవుతాయి. దేవతా విగహ్రాలకు జలాభిషేకం చేయాలి. పరమాన్నం వండి దేవుడికి నివేదించాలి. గ్రహణం వల్ల ఏర్పడే దోషాలను తొలగించమని ప్రార్థించాలి. ఉదయం పూట అల్పాహారం తీసుకోవాలి. దిష్టి తగలకుండా ఇంటి ముందు వేలాడదీసిన గుమ్మడి కాయను మార్చేయాలి. ఇంట్లో పూజ చేసే అవకాశం లేనివారు గుడికెళ్లి దైవ దర్శనం చేసుకోవాలి. శక్తి మేర, రాశులను బట్టి దానాలు చేయాలి. పితృ దేవతలకు జల సంతర్పణ చేయాలి.ఇలా చేస్తే మనకు అంతా మంచే జరుగుతుంది.కాబట్టి అందరు వీటిని పాటించి మీ గ్రహ దోషాన్ని తొలగించుకోండి. మరి మేము ఇచ్చిన ఈ సమాచారం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.