జులై 2న సంపూర్ణ సూర్య గ్రహణం…ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండకపోతే ఇక అంతే సంగతి..

246

సూర్య గ్రహణం అమావాస్య నాడు మాత్రమే వస్తుంది. అయితే అన్నీ అమావాస్యలకు సూర్యగ్రహణం ఏర్పడదు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖపై ఉండి చంద్రుడు రాహువు లేదా కేతువుస్ధానంలో ఉన్నప్పుడు మాత్రమే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. పూర్తి సూర్యగ్రహణ సమయం 8 నిమిషాలకు మించి ఉండదు. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్లనే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీంతో భూమిమీద కొంత భాగానికి సూర్యుడు కనిపించకుండా పోతాడు. సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించే సమయంలో స్థానిక ఉష్ణోగ్రత కూడా భారీగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. రాహువు అనే రాక్షసుడు సూర్యుడిని మింగేయడంవల్ల గ్రహణం ఏర్పడుతుందని భారతీయ వేదాంతులు బలంగా నమ్ముతారు. ఈ ఏడాదిలో రెండో సూర్యగ్రహణం జులై 2న ఏర్పడుతుంది.

Image result for solar eclipse

భారతీయ కాలమాన ప్రకారం… జులై 2 బుధవారం రాత్రి 10.21 గంటలకు ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి 2.15 నిమిషాలకు సమాప్తమవుతుంది. దాదాపు నాలుగు గంటలపాటు సూర్యగ్రహణం ఉంటుంది. ఇది సంపూర్ణ గ్రహణమే. అయితే, మన దేశంలో కనిపించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి గ్రహణాన్ని పాటించాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు. కానీ, చైనాతోపాటు అర్జెంటీనా, ఉత్తరమెరికాలోని దక్షిణ ప్రాంతంలో దర్శనమిస్తుందని నాసా తెలిపింది. ఐరోపాలో దీనిని చూడలేమని తెలిపారు. అయితే డిసెంబరు 26 ఏర్పడే సూర్యగ్రహణం మాత్రం దేశంలో కనిపిస్తుంది. ఆధ్యాత్మికంగా గ్రహణం సమయానికి చాలా విశేషముంది. గ్రహణం పట్టగానే నదీ స్నానం చేసి, నదీ తీరాన జపం చేసుకుంటే ఆ ఫలితం ఇంకా ఎక్కువ.

ఈ క్రింది వీడియో చూడండి

అయితే ఈ సూర్య గ్రహణం సమయంలో సింహా రాశి,కర్కాటక రాశి వారు శివభిషేకాలు చేయించుకుంటే మంచిది. మన భారత దేశంలో కనిపించకపోయిన మనః కారకుడు సూర్యుడు కాబట్టి మానసిక ఒత్తిడి లేకుండా మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే పరిహారం చేయాలి. గ్రహణ పట్టు స్నానం, విడుపు స్నానం చేయవలసిన అవసరం లేదు. గర్భవతులు కూడా కదలకుండా కూర్చోవాలనే జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం లేదు. కర్కాటక రాశిలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కర్కాటక రాశివారు, ఆ రాశికి ముందు రాశి వెనక రాశి మిధున రాశి, సింహా రాశి వారు కూడా జులై 2 న శివభిషేకం చేయించుకుంటే మంచిది. ఒకవేళ అభిషేకం చేయటం కుదరకపోతే ఓం నమశ్శివాయ మంత్రాన్ని 11 సార్లు లేదా 108 సార్లు పఠిస్తే గ్రహణం ప్రభావం తగ్గుతుంది. ఓం నమశ్శివాయ మంత్రాన్ని గ్రహణ సమయంలో పఠిస్తే వెయ్యి రేట్లు ఫలితం ఉంటుంది. కాబట్టి అందరు పాటించండి. మరి ఈ సూర్యగ్రహణం గురించి అలాగే కొన్ని రాశులవారు పాటించాల్సిన నియమాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.