శివలింగం కోసం రంధ్రంలో నుండి సంవత్సరానికి ఒకసారి వస్తున్న పాము

218

ప్రపంచములో ఎన్నో గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నాయి. వాటన్నింటిని చూసి రావాలంటే ఈ జన్మ చాలదు. మనకు తెలియని విషయాలు, వింతలు వీటిచుట్టూ అప్పటికీ ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాయి. కాలానుగుణంగా ఈ దేవాలయాలు కొంత కాలం స్తబ్దుగానే ఉన్నా సోషల్ మీడియా పుణ్యమా అని వెలుగులోకి వస్తున్నాయి.ఒక్కొక్క గుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది.అయితే ఇప్పుడు నేను చెప్పబోయే గుడికి మాత్రం వింతైన ప్రత్యేకత ఉంది.మరి ఆ ప్రత్యేకత ఏమిటో ఆ ఆలయం విశేషాలు ఏమిటో చూద్దామా.

Related image

సుబ్రహ్మణ్య స్వామి వారి గొప్ప దేవాలయాలలో ఒకటి మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లాలో దివిసీమకు చెందిన మోపిదేవి ప్రాంతంలో ఈ క్షేత్రం వెలసిల్లుతుంది. దేవతలకు సేనాధిపతిగా ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వివిధ నామాలు ఉన్నాయి. ప్రస్తుతం మోపిదేవి అని పిలవబడుతున్న ఈ ఊరుని పూర్వం మోహినిపురం, సర్పక్షేత్రం అని పిలిచేవారు.ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. మహాఋషులలో గొప్పవారైన అగస్త్య మహాముని భూలోకంలో వివిధ పుణ్యక్షేత్రాలను దర్శిస్తు ఉండగా ఒకనాడు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. చుట్టు పచ్చని చెట్లు చల్లని గాలి ప్రశాంతమైన ఈ వాతావరణానికి పరవశించిపోయి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడే ఒక పుట్టలో శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం అగస్త్య మహామునికి జరిగింది. సాక్షాత్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామే ఉన్న క్షేత్రం అని తెలియగానే దేవతలు, మునులు వచ్చి ఆయనకు పూజలు చేసేవారట. ఆ తర్వాతి కాలక్రమంలో విరారపు పర్వతాలు అనే వ్యక్తికి స్వామి వారు కలలో కనిపించి ఆజ్ఞాపిస్తే విగ్రహ ప్రతిష్ట జరిపించారట.

ఈ క్రింది వీడియో చూడండి

దేవరకోట ప్రభువులు, ఇతర ప్రజల సహకారంతో ఈ కోవెల అప్పటి పరిస్థితులకు అనుగూణంగా దేవాలయానికి మార్పులు చేస్తూ వచ్చారు.పూర్వం ఈ ప్రాంతమంతా పాముల పుట్టలతో నిండిపోయిందంట అందువల్ల ఈ స్థలాన్ని “నాగభూమి” అని కూడా పిలుస్తారు. ఈ కోవెలలో కూడా చిన్ని చిన్ని సర్పాల ప్రతిమలు కూడా దర్శనమిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర. స్వామికి మారో రూపుగా వీటిని పరిగణించి భక్తులు దర్శించుకుంటారు. నాగులచవితి, కార్తీకమాసం, మహాశివరాత్రి పర్వదినాలలోఇక్కడ విశేష పూజలు జరుపుతారు.ఇక్కడ ఒక ఆశ్చర్యకర విషయం ఏమిటి అంటే ఆలయంలో స్వామివారి పాలపట్టం వద్ద ఒక రంద్రం ఉంది.ఒక పాము సంవత్సరానికి ఒకసారి వచ్చే సుబ్రమణ్య షష్టి రోజున ఆ రంద్రం నుంచి బయటకు వచ్చి దర్శనం ఇస్తుంది.మిగతా రోజులు ఆ పాము ఎవరికీ కనపడదని అక్కడి పూజారులు చెబుతున్నారు.మరి ఆ రంద్రం ఎక్కడ ఉంది.సొరంగం ఎక్కడివరకు ఉంది అనే అనుమానం అందరికి ఉంది.ఇక ఆలయ పరిశోధకులు చెప్పేదానిని బట్టి చూస్తే కైలాస నాధుడి మెడలో నుంచే సాక్షాత్తు ఈ పాము ఆ రంద్రంలో నుంచి బయటకు వస్తుందని భావిస్తున్నారు.ఆ పాము రంద్రం నుంచి వచ్చి సుబ్రమణ్య స్వామిని చుట్టుకుని కొద్దిసేపు ఉండి మళ్ళి ఆ రంద్రం నుంచే వెళ్ళిపోతుంది.ఇలా ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతుందని ఇక్కడివారు చెబుతున్నారు.ఇదే కోవెలలో ఉన్న నాగమల్లి చెట్టు అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. దీనినే ‘ముడుపుల చెట్టు’ అని కూడా పిలుస్తారు. భక్తులు ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు జరిపి తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఈ చెట్టుకు ముడుపులు కడతారు.విన్నారుగా ఈ ఆలయం ప్రత్యేకత.మరి ఈ ఆలయం గురించి ఆలయంలో ఉన్న విశిష్టత గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.