కార్తీక పౌర్ణమి రోజు ఆవునేతితో అక్కడ దీపమెలిగిస్తే..మీరు పట్టిందల్లా బంగారమే

387

అన్ని మాసాల్లో కన్నా కార్తీక మాసం చాలా పవిత్రమైనది. కార్తీక మాసంలో ప్రతి రోజు ప్రవిత్రమైన రోజే. అయితే కార్తీక పౌర్ణమి అంటే మరింత భక్తిశ్రద్ధలు ఉంటాయి.కార్తీక శుద్ధ పౌర్ణమి కార్తీక మాసములో శుక్ల పక్షము నందు పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీకమాసములో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని ”త్రిపురి పూర్ణిమ”, ”దేవ దీపావళి” అని కూడా అంటారు. ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్ళిన మర్నాడు కార్తీకమాసం ప్రారంభమౌతుంది. ఇక ఆరోజు నుండి కార్తీకమాసం ముగిసేవరకూ ప్రతిరోజూ సాయంవేళ దీపాలు వెలిగించి సంరంభం చేస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు.అయితే ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నవంబర్ 22 వ తేదీ వచ్చింది.ఆ రోజు ఆవునేతితో దీపమెలిగిస్తే ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడు చెబుతా వినండి.

కార్తీక మాసంలో అతి పవిత్రమైన రోజుగా భావించే కార్తీక పౌర్ణమికి శివాలయాలకు వెళ్లి పరమేశ్వరుని దర్శించుకుంటే సకల సంపదలు చేకూరతాయని నమ్మకం. కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే ఐదు గంటలకు లేచి పూజామందిరాన్ని శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలు పెట్టి తోరణాలు, ముగ్గులతో అలంకరించుకోవాలి. తలస్నానం చేసి, తెలుపు దుస్తులను ధరించి శివ పార్వతీదేవీల పటానికి పసుమ కుంకుమపెట్టి తెల్లటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యంగా బూరెలు, గారెలు, అన్ని ఫలాలను సమర్పించుకోవచ్చు. కార్తీక పౌర్ణమి రోజున శివఅష్టోత్తరము, లింగాష్టకం వంటి పారాయణ, అష్టోత్తరాలను పఠించడం వల్ల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం.

దీపారాధనకు మట్టి ప్రమిదలు, 1008 వత్తులు తీసుకోవాలి. నక్షత్రహారతికి ఆవునేతిని దీపారాధనకు నువ్వులనూనె వాడాలి. నుదుట విభూది ధరించి, ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 మార్లు జపించాలి. జపమునకు రుద్రాక్ష మాల వాడాలి. పూజచేసేటప్పుడు పడమర వైపు కూర్చోవాలని పండితులు చెబుతున్నారు. ఆలయాల్లో మహానాస్యక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశరుద్రాభిషేకం వంటి పూజలు నిర్వహించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయి.అదే విధంగా శివ పంచాక్షరీ స్తోత్రము, శివ సహస్ర నామము, శివపురాణములను పారాయణం చేసినట్లైతే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. కార్తీక పౌర్ణమి రోజున శివాలయాలకు వెళ్లి అందులో ముఖ్యంగా శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి క్షేత్రాలను దర్శించుకుంటే పుణ్యఫలములు ప్రాప్తిస్తాయి.కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు ఇలా దీపాలు వెలిగించి పుణ్యం తెచ్చుకొండి.