ఏలినాటి శని ఉన్నవారైనా శనివారం ఈ ఒక్క పని చేస్తే చాలు అదృష్టం మిమల్ని వరిస్తుంది

451

శనీశ్వరుడు మానవులనే కాదు.. దేవతలను సైతం వదిలిపెట్టలేదు. శనిగ్రహ ప్రభావంతో ఎంతటి గొప్ప వ్యక్తైనా కష్టాలు అనుభవించాల్సిందే. సాధారణంగా శనిగ్రహం లోకాన్ని చుట్టేందుకు 30 సంవత్సరాలు పడుతుంది.శని గ్రహము తనకక్ష్యలో పరిభ్రమించేటప్పుడు ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరముల చొప్పున పన్నెండు రాశులలో 30 సంవత్సరాలు పడుతుంది. ఇలా సంచరిస్తున్నప్పుడు 30 సంవత్సరములలో ఏడున్నర సంవత్సరాలు మానవునికి ఇబ్బందులు తప్పవు. ఎవరికైనా జన్మ రాశితో పాటు, జన్మరాశికి ఇరువైపులా ఉన్న రాశులలో శని సంచరించు కాలమును ఏలిన నాటి శని అంటారు.ఈ ఏలినాటి శనిదోషం మనఃకారకుడైన చంద్రుని మీద శని సంచారం వల్ల ఏర్పడుతుంది. చంద్రుడికి వ్యయస్థానము నందు అనగా రాశికి వ్యయ స్థానము నందు సంచరించడం. దీనివల్ల ఖర్చులు అధికమవ్వడం, అశాంతి, సుఖం లేకపోవడం, ఆందోళన వంటివి ఉండగలవు. అలాగే ఆరోగ్యములో అధికమైన సమస్యలు తలెత్తడం, పరస్పర అవగాహనాలోపం, మనిషి క్షీణించడం, చికాకులు వంటివి ఉండగలవు.అయితే ఈ ఏలినాటి శనిని పోగొట్టుకోవాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు చూద్దాం.

శని ప్రభావము ఎవరిని అంత ఈజీగా వదలదు. శని ప్రభావంతో మానవులే కాకుండా దేవతలు కూడా నానా తంటాలు అనుభవించారు.త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు కూడా 14 సంవత్సరములు శనిదోషం వల్ల అరణ్యవాసం చేశాడు. ఈ దోష నివారణానంతరం రావణాశురునిపై జయం పొందాడు. అలాగే ద్వాపర యుగంలో పాండవులు ఈ శనిదోషం వల్ల 14 సంవత్సరములు అజ్ఞాతవాసం చేసి అడవుల వెంట తిరిగి నానా ఇబ్బందులు పడ్డారు. మహాదేవుడైన ఈశ్వరుడు కూడా శనిదోషం వల్ల చెట్టు తొఱ్ఱలో దాక్కున్నాడు. అందుకే శని పడితే కష్టాలు తప్పవంటారు శనిప్రభావ తీవ్రతను తగ్గించుకోవాలంటే.. విష్ణుసహస్రనామం, ఆదిత్య హృదయం, సుందరకాండ పారాయణం చేయాల్సిందేనని పండితులు చెప్తున్నారు. ప్రతిశనివారం శనిదేవునిని ఆరాధించడం, నవగ్రహాల్లో శనీశ్వరుని ముందు నువ్వులనూనెతో దీపం వెలిగించాలి. పక్షులకు ఆహారం వేయడం, పరమేశ్వరుని పంచాక్షరీ మంత్రాన్ని జపించడం ద్వారా శనీశ్వరుడు శుభఫలితాలను ఇస్తాడు.

Image result for శని ప్రభావం

యాచకులకు, వికలాంగులకు పెరుగన్నం పెడితే కూడా శని తీవ్రత తగ్గుముఖం పడుతుంది. శనీశ్వర ప్రభావం తగ్గాలంటే ఈశ్వరాధన, హనుమంతుడి ఆరాధన చేయాలి. ఏలినాటి శని ప్రభావం ఏడున్నర ఏళ్లు వుంటుంది కాబట్టి, శని పాపగ్రహం కావున కష్టాలను ఇస్తాడు. ఈ గ్రహం రాశిలో వున్నప్పుడు ప్రాణభయం, ధనం లేకపోవడం, అధమ స్థానానికి వెళ్ళిపోవడం వంటివి జరుగుతుంటాయి. అయితే శని మన రాశిలో ప్రవేశిస్తే కొన్ని మంచి పనులు కూడా చేస్తాడు. వివాహం, ఇంటి నిర్మాణం, ఉద్యోగం లాంటివి జరిపిస్తాడు. కానీ వాటి వెనక అధిక ఖర్చు వంటి ఇబ్బందులు సృష్టిస్తాడు. అందుకే ఇలాంటి కష్టాల నుంచి గట్టెక్కాలంటే శనివారం శనీశ్వర పూజ చేసి ఆయన్ని శాంతింపజేయాలి. నువ్వులనూనె, శంఖుపువ్వులను సమర్పించి ప్రార్థించాలి. ఇలా చేస్తే శని గ్రహ ప్రభావం తగ్గుతుంది. బాధలు కూడా తొలగిపోతాయి. కాబట్టి చేసి చూడండి. ఏలినాటి శని గురించి అలాగే శని పోవాలంటే చెయ్యాల్సిన కార్యాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.