సంక్రాంతి రోజు రాగి నాణెంతో ఇలా చేస్తే మీరు కుబేరులు అవ్వడం ఖాయం

325

ప్ర‌తీ ఒక్క‌రు డిసెంబ‌రు వెళ్ల‌గానే వ‌చ్చే జ‌న‌వ‌రి పైఎన్నో ఆశ‌లు పెట్టుకుంటారుదీనికి కార‌ణం కొత్త సంవ‌త్సరం మొదలు అవుతుంది అని అంతేకాదు కొత్త కార్య‌క్ర‌మాలు చేయాలి అని అనుకున్నా మంచి జోష్ తో చేయ‌వ‌చ్చు అందుకే జ‌న‌వ‌రితలో ఎంతో హుషారుగా కొత్త పనులు ప్రారంభిస్తారు.ప్రతి ఒక్కరు కొత్త సంవత్సరంలో ఎన్నో ఆశలను పెట్టుకుంటారు. కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగను ధనిక,పేద అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు కుటుంబంతో చాలా ఆనందంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ నాలుగు రోజులు ఇల్లంతా కూతుళ్లు,అల్లుళ్ళు,మనవలతో కళకళ లాడుతూ ఉంటుంది. ఎక్క‌డ ఉన్నా స‌రే సంక్రాంతికి సంద‌డి వ‌స్తుంది అందుకే సంక్రాంతి తెలుగువారికి పెద్ద పండుగ అని చెప్పాలి.

ఇంటిలో కానీ వ్యాపారంలో కానీ ఏమైనా సమస్యలు ఉంటే సంక్రాంతి రోజు ఈ చిన్న పని చేస్తే ఆ సమస్యలు వెంటనే తొలగిపోతాయి. ఈ సమస్య పరిష్కారానికి ఒక రాగి నాణెము అవసరం అవుతుంది. అయితే రాగి నాణెంతో ఏమి చేయాలో వివరంగా తెలుసుకుందాం.సంక్రాంతి రోజున ఉదయం తలస్నానము చేసి దేవుణ్ణి ప్రార్ధించి ఒక రాగి నాణెం తీసుకోని మీ ఇంట్లో గానీ , వ్యాపారంలో గానీ డబ్బులు పెట్టె ప్రదేశంలో ఆ రాగి నాణెంతో మూడు సార్లు దిష్టి తీసి ఆ నాణేన్ని ఎర్రటి వస్త్రంలో పెట్టి మూట కట్టాలి. ఈ మూటను దేవుడి దగ్గర పెట్టి ధూప దీప నైవేద్యాలు సమర్పించి సమస్యలు లేకుండా చూడమని ప్రార్ధన చేయాలి. సాయంత్రం సమయంలో ఆ మూటను నదిలో లేదా పారే నీటిలో నిమ్మజ్జనం చేయాలి. సంక్రాంతి రోజు ఇలా చేస్తే ఆర్థికపరమైన సమస్యలు,కష్టాలు అన్ని తొలగిపోతాయి. ఇలా పండుగ స‌మ‌యంలో చేయ‌డం వ‌ల్ల ఇంటికి ఇంటి య‌జ‌మానికి చాలా మంచిది అనిపండితులు తెలియ‌చేస్తున్నారు. మరి చూశారుగా దీనిపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.