అర్ధరాత్రి చంద్రుడు పై సాయి బాబా ప్రతిరూపం

851

షిర్డీలోనే దాదాపు 65 ఏళ్ల పాటు పాడుబడిన మసీదులో నివసించి తన అవతార వైశిష్ట్యాన్ని చాటుకున్న సాయిబాబా 1918 అక్టోబర్ 15న సమాధి చెందారు. ఆయన సమాధి చెంది ఈ ఏడాది అక్టోబర్ 15 నాటికి వందేళ్లు అవుతున్నాయి. దేశవ్యాప్తంగా సెంటినరీ సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. పిలిస్తే పలుకుతానని, సమాధి నుండే సర్వకార్యాలు నిర్వహిస్తానని ఏకాదశ సూత్రాల రూపంలో సాయి అభయమిచ్చారు. అందుకు అనుగుణంగానే సాయి…

Image result for sai baba in moon

ఈసారి హైదరాబాద్ ప్రజలకు సాయిబాబా దివ్యస్వరూపాన్ని ప్రత్యక్షంగా చూసే భాగ్యం కలిగిందని తెలుస్తోంది. గత రాత్రి హైదరాబాద్ లోని చాలా ప్రదేశాల్లో చందమామను చూసిన ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారట. ఎందుకంటే నిండు చంద్రుడిపై సాయినాధుని రూపం దర్శనమిచ్చిందట.చిరునవ్వులు కురిపిస్తున్న సాయిబాబా కళ్లతోనే దీవెనలు అందిస్తున్నట్టుగా భావించిన భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారట. రాత్రి 11 గంటల ప్రాంతంలో కనిపించిన ఈ వింత కొద్ది సమయంలోనే హైదరాబాద్ అంతా పాకిపోయింది. నగరంలోని చాలా కాలనీల్లో ఈ అద్భుతాన్ని వీక్షించిన ప్రజానీకం జై సాయిరామ్ మహరాజ్ కీ జై అంటూ నినాదాలతో హోరెత్తించింది. దీనికి సంబంధించిన పిక్స్ కూడా సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.

భారతదేశంలో సాయిబాబా అంటే ఓ మతానికి చెందినవాడిగా కాకుండా అన్ని మతాలకు ఆరాధ్యుడిగా పేరుగాంచాడు. పిలిచిన పలికే దైవంగా సాయికి పేరుంది