యాగంటి ఆలయంలో ఏముందో చూసి శాస్త్రవేత్తలే షాకయ్యారు

561

ఈ జ‌గ‌త్తు మనిషి న‌డుపుతున్నాడా, ప్ర‌కృతి న‌డుపుతుందా, క‌నిపించ‌ని దేవుడు న‌డుపుతున్నాడా అంటే వెంట‌నే మ‌నం ప్రకృతిచేత దేవుడు న‌డిపిస్తున్నాడ‌ని … మ‌నిషి దానికి అనుగుణంగా న‌డుచుకుంటున్నాడ అంటాం …ఈ సృష్టిలోని చిన్న జీవరాశి నుండి కాలాన్ని గణించే యుగాల వరకు అన్ని అతీతులని మన ధర్మాలు తెలుపుతున్నాయి.. . ఈ సృష్టిలో మొదలైన ప్రతి యుగం కూడా ఎదో ఒక రోజు అంతం కాక తప్పదు అని తెలుస్తుంది . అలాగే అంతం అయిన ప్రతిసారి మరో కొత్త యుగానికి పునాది పడ్డట్టే అని అర్థం మనం చేసుకోవాలి. ఇదే మన సృష్టి ధర్మం అని వేదాలు చెప్తున్నాయి.

Image result for kerala flood

ఈ సృష్టిలో ఏది జరగాలన్న దానికి ఒక కారణం కావాలి . అలాగే ఈ కలియుగం అంతంకావడానికి కూడా ఒక కారణం ఉంది . ఆకారణాలే ఒక మహా వ్యక్తి ఎప్పుడో కాలజ్ఞానం రూపం లో చెప్పేసాడు , ఆయనే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి .ఆయన ఈ కలియుగం అంతంకావడానికి ఎన్నో కారణాలు చెప్పారు , అందులో ఒకటి యాగంటి మహాశివుడి ఆలయం . ఈసృష్టిలో ప్రతి పుట్టుకకి , చావుకి కారణం ఆయనే .ఇప్పుడు అయన వాహనమైన నందీశ్వరుడు కలియుగానికి అంతం పలకనున్నాడు . ఈ కలియుగాంతం జరగబోయే మహా పుణ్య ప్రదేశమే యాగంటి.Image result for kerala flood

అసలు కలియుగాంతానికి , ఈ ఆలయానికి ఏమిటి సంభంధం , ఆ ఆలయం ఎక్కడ ఉంది , ఆ ఆలయ రహస్యం ఏమిటో , వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈ ఆలయం గురించి ఏమి చెప్పారు ఇప్పుడు తెలుసుకుందాం ..యాగంటి గా ప్రసిద్ధి చెందిన పవిత్రమైన ఈ పుణ్యక్షేత్రం కర్నూల్ జిల్లా బనగానపల్లె నుండి 12 km దూరంలో , దట్టమైన నల్లమల్ల అడవుల్లో ఉంది . ఈ ఆలయానికి గల మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ శివుడు లింగ రూపం లో కాకుండా స్వయంభూగా దర్శనం ఇస్తాడు . ఇక్కడ స్థల పురాణం గురించి ఒకసారి తెలుసుకుంటే.

Image result for kerala flood

ఈ స్థలం లో పూర్వం అగస్త మహా ముని నివసిస్తూ ఉండేవాడట , అయన అక్కడ ఒక గుడి ని నిర్మించాల‌ని భావించార‌ట‌ గుడి నిర్మాణం ప్రారంభించాడట , అందులో మూలవిరాట్ గా వెంకటేశ్వర స్వామి ని ప్రతిష్ట చేద్దాం అనుకోని , తనే స్వయంగా విగ్రహం ను రెడీ చేస్తుండగా ఆ మహాముని వేలు ఒకటి తెగిపోయిందని , దానితో ఆయన నా సంకల్పం లో ఎదో తప్పు ఉంది అని అక్కడితో ఆపేసాడని  అప్పటికే గుడి నిర్మాణం పూర్తికావడం తో ఈ ఆల‌యానికి కొంచెం దూరం లో స్వయంభుగా వెలసిన శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ట చేశారట , వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆ ఆలయం పక్కన ఒక గృహ లో ప్రతిష్ట చేశారట. ఈ ఆలయం లో మరో ముఖ్యమైనది ఆలయ కోనేరు  ఈ కోనేరులోకి నీరుఒక నంది నోటి నుండి వస్తాయి.

Image result for kerala flood

ఈ కోనేరు లో నీరు ఈ కాలంలో అయిన ఒకే మట్టం తో ఉండడం ఇక్కడ మరో విశేషం . ఇక మరో విశేషం ఏమిటంటే ప్రధాన ఆలయంలో ఉండే నందీశ్వరుడు , ఇక్కడ ఉండే నంది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది  ఆలా ఆ నంది పెరుగుతూ ఉంటూ ఒకరోజు రంకె వేస్తుందని , ఆ రంకె ప్రపంచం నలుదిశలా వినిపిస్తుందని, దానితో కలియుగం అంతమౌతుందని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది . ఇక్కడ విగ్రహ రూపంలో ఉన్న నంది రోజు రోజుకి పెరగటాన్ని భారత్ సైన్స్ నిపుణులుకూడా చెక్ చేసి నిర్ధారించారు . ఇదే కలియుగానికి అంతం అని చెప్తున్నారు .

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ప్రస్తుతం కేరళలో భారీ వర్షాలతో రాష్ట్రము మొత్తం సముద్రాన్ని తలపిస్తుంది . కేరళ ఉన్న నదులు , డ్యామ్ లు పొంగి పొర్లు తున్నాయి , ప్రజలు ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు , ఇది చూస్తున్న కొంతమంది మునులు ఇదే కలియుగానికి ప్రారంభం అని చెప్తున్నారు. ఇక కేర‌ళ‌లో జ‌రిగిన విప‌త్తు చూస్తుంటే యాగంటిలో త్వ‌ర‌లో నంది రంకెలు వేయ‌డం ఖాయం అంటున్నారు.. మ‌రో ప‌క్క శాస్త్ర‌వేత్త‌లు ఈ నంది ఎందుకు ఇలా పెరుగుతుంది అనేది మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ చేధించ‌లేక‌పోయారు. చూశారుగా.. యుగాంతానికి ఇవ‌న్నీ సూచిక‌లు అని మీరు భావిస్తున్నారా ? మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.