ఆ ఆలయంలో పూజ పూర్తి అయ్యి బయటకి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగిచూస్తే ఇక అంతే

608

మన భారతదేశంలో శనీశ్వర ఆలయాలు అతి తక్కువగా ఉన్నాయి. వాటిలో  మందేశ్వర స్వామి దేవాలయం ఒకటి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,తూర్పుగోదావరిజిల్లారాజమండ్రికి 38 కిలోమీటర్ల దూరంలోరావులపాలెంకి 9కిలోమీటర్ల దూరంలో మందపల్లి అనే గ్రామం ఉంటుంది. ఈ  గ్రామంలో ప్రసిద్ధి చెందిన శివాలయం ఒకటి ఉంది.కానీ ఆ ఆలయాన్ని శివాలయంగా ఎవ్వరూ పిలవరు.ఆ ఆలయాన్ని మందేశ్వరాలయం అంటే శనీశ్వరాలయంగానే  పిలుస్తారు.ఇలా పిలవడానికి ఒక పురాణ కథ అక్కడ ప్రచారంలో ఉంది.ఈ మందపల్లి    పూర్వం అటవీ ప్రాంతం.ఈ అటవీ ప్రాంతంలోనే  కైటభుడనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి   అశ్వర్థుడుపిప్పలుడు అని ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్దరు మారు రూపాల్లో ఈ అటవీ ప్రాంతంలో సంచరిస్తూ, ఇక్కడ  తపస్సు  చేయడానికి వచ్చే మునులనూ వేదాలను నేర్చుకోవడానికి వచ్చే బ్రాహ్మణులనూ చంపి తింటూ ఉండేవారు.

Image result for మందేశ్వర స్వామి

ఇలా జరుగుతూ ఉండగాదక్షిణ దేశ యాత్రలో భాగంగా అగస్త్య మహర్షి ఒకసారి  ఈ మందపల్లి ప్రాంతానికి వస్తాడు. అక్కడ ఉన్న మునులు అగస్త్యమహర్షికి ఆ ప్రాంతంలో  జరుగుతున్న విషయాలన్నీ చెప్పి తమను ఆ రాక్షసుల బారి నుంచి కాపాడాల్సిందిగా వేడుకొంటారు.దాంతో  అగస్త్య మహాముని బాగా ఆలోచించి ఆ మునులని తీసుకొని అక్కడికి దగ్గరలో  గోదావరి తీరంలో శివుడి గురించి తపస్సు చేస్తున్న శనేశ్వరుడి దగ్గరకు వెళ్లగా, మునులు శనేశ్వరుడితో తమ గోడుని వెళ్లబోసుకొని,ఆ రాక్షసులను సంహరించి తమను కాపాడాల్సిందిగా  వేడుకొంటారు. అయితే  వారి అభ్యర్థనను   శనీశ్వరుడు సున్నితంగా తిరస్కరించితాను ప్రస్తుతం శివుడి గురించి తపస్సు చేస్తున్నాననీ,ప్రస్తుతం తాను ఏమీ చెయ్యలేననీ,తపస్సు పూర్తి అయిన తర్వాత,ఆ తపస్సు  వల్ల వచ్చిన శక్తితోనే ఆ రాక్షసులను సంహరించగలనని చెబుతాడు.దాంతో మునులు బాగా ఆలోచించి తమ తపోశక్తిని శనీశ్వరుడికి ధారపోయగాఅతను  అశ్వర్థుడుపిప్పలుడనే రాక్షసుల్ని సంహరించడానికి అంగీకరిస్తాడు.  

Image may contain: outdoor

తర్వాత ప్రథకం ప్రకారం మొదట శనీశ్వరుడుఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో రావి చెట్టు రూపంలో ఉన్న అశ్వర్థుడి దగ్గరకు  వెళ్తాడు. అక్కడికి వచ్చినవాడు   సాధారణ బ్రాహ్మణుడేనని భ్రమించిన అశ్వర్థుడు,ఆ  శనీశ్వరుడిని అమాంతంగా మింగేస్తాడు .ఆ అశ్వర్థుడి కడుపులోకి వెళ్లిన ఆ శనేశ్వరుడు  అతని ప్రేగులను తెంపేయగా,  అశ్వర్థుడు విలవిలాడుతూ కొట్టుకొని  ప్రాణాలు వదిలేస్తాడు. తర్వాత శనేశ్వరుడు   బ్రాహ్మణ యువకుడి వేషంలో పిప్పలుడి దగ్గరకి వెళ్లి తనకు వేదాలు నేర్పించాల్సిందిగా కోరతాడు. పిప్పలుడు కూడా వచ్చినవాడు సాధారణ బ్రాహ్మణుడే అని భావించి శనీశ్వరుడిని మింగేస్తాడు.   శనీశ్వరుడు పిప్పలుడిని  కూడా   ప్రేగులను తెంపి సంహరిస్తాడు. 

Image result for మందేశ్వర స్వామి

  తర్వాత రాక్షస సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాతకాన్ని నివారించుకోవడానికి శనీశ్వరుడుమందపల్లిలో  ఒక శివ లింగాన్ని ప్రతిష్టించి,దానికి పూజలుచేసి,ఆ దోషాన్ని పోగొట్తుకుంటాడు. ఈ శివలింగాన్ని  శనీశ్వరుడు ప్రతిష్టించడం వల్ల ఈ క్షేత్రం శివాలయంగా కాకుండా  శనేశ్వరాలయంగానే  ప్రసిద్ధి చెందింది.   ఈ ఆలయ నిర్మాణంతో పాటు ఇక్కడి పూజా విధానాలు కూడా కొంత విభిన్నంగా ఉంటాయి. శత్రురోగరుణ బాధల నుంచి విముక్తి కోసం వేలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. వీరిలో జాతక చక్రంలో శని సమస్యలున్నవారే ఎక్కువగా వచ్చి ఇక్కడ పూజలు చేయించుకొంటూ ఉంటారు.ఈ క్షేత్రంలో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే,   శనివారం వచ్చే శని త్రయోదశిమహాశివరాత్రిశనివారం రోజున వచ్చే అమావాస్య రోజుల్లో  ఈ క్షేత్రంలో శనీశ్వరుడికి తైలంతో అభిషేకం చేయించి,విశేష పూజలు చేస్తారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అలాంటి ప్రత్యేక  రోజుల్లో ఇక్కడకు వచ్చే భక్తుల సంఖ్యల లక్షల సంఖ్యలో ఉంటుంది.   ఈ సమయాల్లో పూజకు ఉపయోగించే వస్తువులన్నీ దేవాలయం ప్రాంగణంలోనే దొరుకుతాయి. పూజ పూర్తి అయిన తర్వాత నల్లటి వస్త్రాలను బ్రాహ్మణుడికి  దానం చేస్తారు. ఇక పూజలో మిగిలిపోయిన వస్తువులను ఇంటికి తీసుకువెళ్ల కూడదని చెబుతారు. పూజ పూర్తి అయిన తర్వాతఆలయం నుంచి బయటికి వెలుతూ వెనక్కి  తిరిగి చూడకూడదని ఇక్కడి పూజారులు హెచ్చరిస్తూ ఉంటారు. ఇందుకు విరుద్ధంగా నడుచుకొంటే శని దోషం మళ్లీ వారిని చుట్టుకుంటుందని వారు చెబుతుంటారు