నాగ లోకానికి దారి దొరికింది మ‌న దేశంలో ఎక్క‌డ ఉందో తెలుసా.?

1171

మ‌నం నాగ‌లోకం అనే పేరు చాలా సార్లు వినే ఉంటాం.. ఇంద్ర‌లోకం నాగ‌లోకం, భూలోకం, పాతాళ‌లోకం ఇలా పురాణాల ప్ర‌కారం లోకాల గురించి ప‌లుక‌థ‌లు చ‌దువుకున్నాం.. ఇక నాగ‌లోకంలో అత్యంత పెద్ద స‌ర్పాలు రెండు.. ఒక‌టి శేష‌నాగు, రెండు వాసుకి.. ఇక ఈ రెండు స‌ర్పాల జాడ‌లు నిజంగా ఉన్నాయి అని తాజాగా తెలుస్తోంది.. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్షీర‌సాగ‌ర మ‌ధ‌నంలో వాసుకిని ఉప‌యోగించిన జాడ‌లు ఓ ప్రాంతంలో ఇప్ప‌టికీ ఉన్నాయి .. హిందూ పురాణాల ప్ర‌కారం నాగ‌లోకానికి భూలోకానికి ఉన్న బంధానికి సంబంధించి అనేక సాక్ష్యాలు దొరికాయ‌ట‌.. ఇంత‌కీ నాగ‌లోకం ఎక్క‌డ ఉంది దాని గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

నాగుపాముల‌కు ఓ లోకం ఉంది.. అదే నాగ‌లోకం.. ఆదిశేషు వాసుకిలు అత్యంత శ్రేష్టమైన పాములుగా చెబుతారు.. వీటిని న‌మ్ముతారు.. ఉత్త‌రాఖాండ్ ఫిరోడ్ గ‌ర్ జిల్లాలో గుహ‌ల‌ను సాక్ష్యాలుగా చూపిస్తున్నారు..ఫిరోడ్ గ‌ర్ నుంచి 80 కిలోమీట‌ర్ల దూరంలో పాత‌ళ భువ‌నేశ్వ‌ర్ అనే గుహాలు ఉన్నాయి.. ఇక్క‌డే నాగ‌లోక‌పు మిస్ట‌రీ దాగి ఉంది….భూమి ఉప‌రిత‌లం నుంచి 90 అడుగుల లోతులో పెద్ద గుహ ఉంది… ఆ గుహ‌లో క్షీర‌సాగ‌ర మ‌ధ‌నానికి ఉప‌యోగించిన వాసుకి స‌ర్పం జాడలు ఉన్నాయి.. ఇందులోకి వెళ్ల‌డం చాలా క‌ష్టం.. చిన్న‌ద్వారాం నుంచి ఇనుప గొలుసులు ప‌ట్టుకుని ఆగుహ‌లోకి వెళ్లాలి… ఇక్క‌డ కింద‌కు దిగ‌గానే ఓ గుహ క‌నిపిస్తుంది.. గుహ మొద‌టి అంచులో శేష నాగు స‌ర్పంలా ఓ ఆకృతి క‌నిపిస్తుంది… దానిపై అర్ధ వృత్తాకారంలో ఓ స‌హ‌జ నిర్మాణం ఉంది.. ఇక్క‌డ శేష‌నాగు కోర‌లు దాని విష‌గ్రంధులు చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తాయి.. ఇక ఈ ప్రాంతంలో పూర్వం కొన్ని ల‌క్ష‌ల పాములు త‌మ నివాసంగా చేసుకుని ఉండేవ‌ట.. ఈ గుహ అంతా పాముల‌తో ఉండేద‌ని చెబుతారు చ‌రిత్ర కారులు.

అర్జునుడి ముని మ‌న‌వ‌డు అయిన జ‌న్మ‌జేయుడు త‌న తండ్రి ప‌రీక్షిత్ రాజు, త‌క్ష‌కుడు అనే పాము కాటుకు చ‌నిపోయాడ‌ని ఎంతో కోపంతో ఊగిపోయాడు.. ఇక్క‌డ జ‌ర‌గ‌డంతో ఈ గుహ‌లో మ‌హాసర్ప‌యాగం చేశాడు.. ఆ స‌మ‌యంలో ఇక్క‌డ ల‌క్ష‌ల‌పాములు మ‌ర‌ణించాయి.. దీనికి సాక్ష్యంగా ఇక్క‌డ స‌ర్ప‌యాగం గుండం క‌నిపిస్తుంది… ఇది ఆకు ఆకృతిలో ఉంది.. ఇక్క‌డ ఉండే పాములు మ‌నిషి రూపంలో కూడా మారేవ‌ట‌.. అంటే య‌క్షారూప శ‌క్తి క‌లిగిన పాములు అని అర్ధం… వాసుకి స‌ర్పం శివుడ్నిఎంతో ప్రితిప్ర‌దంగా పూజించేది.. వాసుకి స‌ర్పం ఓ శివ‌ లింగం ప్ర‌తిష్టించిం ఇక్క‌డ నిత్యం పూజ‌లు చేసేది.. అలాగే మిగిలిన స‌ర్పాలు కూడా శివున్ని కొలిచేవారు..

ఇప్ప‌టికీ ఆ గుహ‌లో ఆనాటి శివ‌లింగం ఉంది… దీనిగురించి స్కంద పురాణంలో మాన‌స‌ఖండంలో 103వ అధ్యాయంలో విపులంగా వివ‌రించారు.. అందులో తెలియ‌చేసిన‌ నాగ‌లోక‌పు గుహ‌తో ఈ గుహ స‌రిపోతుంది అని తెలియ‌చేశారు… ఇక త్రేతా యుగంలో సూర్యవంశ‌పు రాజు రుతుప‌ర్ణ మొద‌టిసారి ఈప్రాంతాన్ని క‌నుగొన్నారు అని స్కంద పురాణం తెలియ‌చేస్తోంది.ద్వాప‌ర యుగంలో పాండ‌వులు వారి అవ‌తార స‌మాప్తి చేయ‌డానికి హిమాలయాల‌కు వెళ్లిన స‌మ‌యంలో, ఇక్క‌డ చివ‌రిసారి ధ్యానం చేశార‌ట‌.
క‌లియుగంలో ఆదిశంక‌రాచార్యులు ఇక్క‌డ శివునికి పూజ‌లు చేసేవార‌ట‌.. ఇక ఈ గుహ నుంచి ర‌హ‌స్య మార్గం ఉంది… ఇక్క‌డ నుంచి కైలాసానికి నేరుగా వెళ్లవ‌చ్చని చెబుతున్నాయి పురాణాలు..