సీతా దేవి లక్ష్మణుడిని మింగేసిందా ? ఎందుకు ? అసలు కథ ఇదే

386

రామాయణం అనేది హిందువుల పవిత్ర గ్రంథం. అన్నదమ్ములు ఎలా ఉండాలో భార్యాభర్త ఎలా ఉండాలో చెప్పే ఒక అద్భుత ఇతిహాసం రామాయణం. రామాయణంలో ఉన్న ప్రతి పాత్ర మనిషికి ఎంతోకొంత జ్ఞానాన్ని అందిస్తుంది. రాముడు లక్ష్మణుడు సీతాదేవి హనుమంతుడు… ఇలా ప్రతి పాత్ర కూడా ఏదో ఒకటి నేర్చుకోమని మనకు చెబుతుంది.అయితే రామాయణంలో సీతాదేవి ఒక సమయంలో లక్ష్మణుడిని మింగుతుంది. అలా ఎందుకు మింగుతుందో తెలుసా.. ఇప్పుడు చెబుతా వినండి.

Image result for sita rama photos

14 సంవత్సరాల వనవాసం ముగించుకుని శ్రీరాముడు, సీతా, లక్ష్మణ హనుమల సమేతంగా తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు జరిగిన కథ ఇది. వారు అయోధ్యను వీడి 14 సంవత్సరాల వనవాసానికి వెళ్తున్నప్పుడు, తిరిగి రాజ్యానికి క్షేమంగా చేరిన ఎడల సరయు నదికి పూజలు చేస్తానని ప్రమాణం చేసింది. ఆ క్రమంలో భాగంగా, వనవాసం పూర్తిచేసుకుని అయోధ్యకు క్షేమంగా చేరిన నేపథ్యంలో భాగంగా సరయు నదీ తీరానికి వెళ్లాలని నిర్ణయించుకుంది.లక్ష్మణుని తనకు తోడుగా రావాలని కోరింది సీతా దేవి. లక్ష్మణుడు తోడుగా రాగా, సీతా దేవి సరయు నదికి చేరుకుంది. హనుమంతుడు కూడా తోడుగా వస్తానని చెప్పగా, సీతా దేవి వారించడంతో సీతా దేవికి అనుమానం రాకుండా రహస్యంగా కాపాడుతూ వీరిని అనుసరిస్తూ వెళ్ళాడు హనుమంతుడు. సీతా లక్ష్మణులు ఆ స్థలానికి చేరుకున్న పక్షంలో, హనుమంతుడు నదికి సమీపంలోని ఒక చెట్టు వెనుకగా ఇరువురికి కనపడకుండా దాక్కుని పర్యవేక్షిస్తూ ఉన్నాడు. సీతా దేవీ, లక్ష్మణులు సైతం ఈ విషయాన్ని గమనించలేదు. సీతా దేవి పూజ కోసం సిద్ధమైన సమయంలో, కాలాష్ నదిలోని నీటిని తీసుకుని రావలసినదిగా లక్ష్మణుడిని ఆజ్ఞాపించగా, లక్ష్మణుడు అక్కడికి వెళ్తాడు.. హనుమంతుడు మాత్రం చెట్టు వెనుక నుండి కాపలా కాస్తూనే ఉన్నాడు.

Image result for sita rama photos

కాలాష్ నదిలో నీటిని తీసుకుంటున్న లక్ష్మణుడి మీదకు, భయంకరంగా నవ్వుతూ నది నుండి ఒక రాక్షసుడు ముందుకు దూకాడు. తపస్సు ఫలితంగా శివుని వర ప్రసాదాన్ని పొందిన ఆ రాక్షసుడు, తనను చంపడం వీలు కాదన్న గర్వంతో లక్ష్మణుడిని లక్ష్యంగా చేసుకుని, అతన్ని మింగివేయాలని ప్రయత్నించాడు. అతనే అఘాసురుడు. అఘాసురుడు చాలా కాలంగా అదే నదిలో ఉంటూ చుట్టు పక్కల ప్రజలను వేధిస్తూ ఉండేవాడు. అదే క్రమంలో లక్ష్మణుడిని కూడా మింగాలని ప్రయత్నించాడు. ఈ సంఘటనను దూరం నుండి గమనించిన సీతా దేవి, పరుగున వచ్చి అఘాసురుడు లక్ష్మణుడిని మింగబోయే సమయానికి, తన దైవిక శక్తులతో తానే లక్ష్మణుడిని మింగేసింది. హనుమంతుడు సైతం ఆశ్చర్యపోయేలా, ఒక వెలుగులు విరజిమ్మే దైవిక వస్తువుగా రూపాన్ని సంతరించుకుని నిలబడింది సీతా దేవి. ఆ దైవిక వస్తువును సైతం మింగబోయిన అఘాసురుడి నుండి కాపాడే ప్రయత్నంలో భాగంగా, హనుమంతుడు ఆ వస్తువును కాలాష్ నది నీటితో గుండ్రటి బంతి వలె మార్చి రాక్షసుని నుండి తప్పించాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆ తర్వాత జరిగిన తంతునంతా, రామునికి పూర్తిగా వివరించిన హనుమంతుడు, వారిరువురిని తిరిగి మానవ రూపం దాల్చేలా వరమివ్వమని ప్రార్ధిస్తాడు. సీతా లక్ష్మణులు కేవలం మనుషులు మాత్రమే కాదని, దైవిక అవతారాలు అని హనుమంతునికి వివరించాడు రాముడు. అందువలన కాలాష్ నది నీటిని తిరిగి నదిలో పోయాలని సూచించాడు. రాముని ఆదేశాల ప్రకారం, హనుమంతుడు ఆ కాలాష్ నదిలోకి నీటిని తిరిగి కురిపించగా, ఆ దైవిక వస్తువు ఒక భారీ నిప్పు బంతి వలె మారి, ఆ మంటలతో అఘాసురుని అంతమొందించడం జరిగింది. క్రమంగా రాక్షసుని పీడ వదిలి, మరలా ఈ నది సురక్షితమైన ప్రాంతంగా మారడంతో పాటు, సీతా దేవి, లక్ష్మణులు వారి వారి అసలు రూపాలను తిరిగి పొందడం జరుగుతుంది. సీతాదేవి లక్ష్మణుడిని మింగడం వెనుక ఉన్న కథ ఇదే. మరి రామాయణం గురించి అలాగే సీతదేవి లక్ష్మణుడిని మింగడం వెనుక ఉన్న ఈ కథ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.