సంతానం లేదా ఈ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయాన్ని సందర్శించండి..

584

చాలా మంది సంతానం లేక ఇబ్బంది ప‌డుతు ఉంటారు అయితే శ‌రీరంలో స‌మ‌స్య ఉన్నా దేవుని అనుగ్ర‌హం ఉంటే క‌చ్చితంగా మ‌న‌కు పిల్లలు పుడ‌తారు అని పూజ‌లు వ్ర‌తాలు చేస్తారు.. ఎక్కువ‌గా సంతానం కోసం సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామిని కొలుస్తారు. మ‌రి సంతానం కోసం చూసేవారికి ఓ ప్ర‌ముఖ దేవాల‌యం గురించి చెప్పాలి .మ‌రి ఆ దేవాల‌యంలో పూజ‌లు చేస్తే సంతానం క‌లుగుతారు అని చెబుతున్నారు. ఇంత‌కీ ఆ దేవాల‌యం ఎక్క‌డ ఉంది. దాని గురించి ప‌లు కీల‌క విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.తమిళనాడుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మురుగన్‌కు వేల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాకూడా ఈ దేవాలయం అత్యంత విశిష్టమైనది. అరుపడైవీడులో ఈ దేవాలయం చివరిది. తమిళ సాహిత్యంలో అనేక చోట్ల ఈ దేవాలయం ప్రస్తావన మీకు కనిపిస్తుంది. ఇక్కడ వెలిసిన సుబ్రహ్మణ్యస్వామి భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు. ముఖ్యంగా సంతానంలేనివారు ఈ దేవాలయాన్ని సందర్శిస్తే వెంటనే సంతానం కలుగుతుందని స్థానికులు చెబుతూ ఉంటారు.

పూజ్ముడిర్కోలై మురుగన్ హిందూ దేవాలయంలో ప్రధానదైవం సుబ్రహ్మణ్యస్వామి. ఈ దేవాలయం మదురైకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయం చిన్న గుట్ట పై ఉండగా చుట్టూ దట్టమైన అడవులు ఉన్నాయి..మురుగన్ యొక్క ఆరు ముఖ్యమైన దేవాలయాల్లోఇది ఒకటి. దీనినే తమిళంలో అరుపడైవీడు అని అంటారు. ఈ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం ప్రముఖ విష్ణు దేవాయం అజఘర్ కోవిల్‌కు అత్యంత సమీపంలో ఉంటుంది…పూజ్ముడిర్కోలైలోని ప్రధాన విగ్రహం అజఘర్ దేవాలయంలో ఉండేదని అయితే తిరుమలై నాయక్ కాలయంలో ప్రస్తుతం ఉన్న చోటికి మార్చబడిందని చెబుతారు. మధురై నుంచి పూజ్ముడిర్కోలైకు నిత్యం బస్సు సర్వీసులు ఉన్నాయి.మధురైలో రూట్ నెంబర్ 44 బస్సులు ఈ దేవాలయం వద్దకు వెళ‌తాయి. అదే విధంగా గుట్ట పై ఉన్న ఈ దేవాలయం చేరుకోవడానికి గుట్ట కింద నుంచి పైకు ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. ఈ గుట్ట చాలా ఫలవంతమైనది. ఇక్కడ అనేక రకాల పండ్లు, కూరగాయల చెట్లు ఉంటాయి. అందువల్లే గుట్ట పైకి ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

పూజ్ముడిర్కోలై మురుగన్ హిందూ దేవాలయం

ఇక్కడ మురుగన్‌కు వళ్లి, దేవయానికి వేర్వేరుగా విగ్రహాలు ఉన్నాయి. ఈ దేవాలయానికి కొంత పై భాగంలో స్థానిక గిరిజన తెగలు నివశిస్తూ ఉంటాయి. తమిళనాడుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మురుగన్‌కు వేల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాకూడా ఈ దేవాలయం అత్యంత విశిష్టమైనది.తమిళ సాహిత్యంలో అనేక చోట్ల ఈ దేవాలయం ప్రస్తావన మీకు కనిపిస్తుంది. ఇక్కడ మురుగన్ తన భక్తురాలైన అవ్వయార్‌కు పరీక్ష్ పెట్టిన చోటు ఇదేనని చెబుతారు.ఇందుకు సంబందించిన కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఒకసారి అవ్వయార్ ఎండలో నడచుకొంటూ ప్రస్తుతం దేవాలయం ఉన్న చోటుకు వస్తుంది.. ఎక్కువ సేపు ప్రయాణం వల్ల అక్కడ ఉన్న ఓ చెట్టు కింద కూర్చొంటుంది….అక్కడే ఉన్న బాలుడు మీకు ఆకలిగా ఉన్నట్లు ఉంది పండ్లు తింటారా? అని అవ్వయార్‌ను అడిగాడు. ఇందుకు అవ్వయార్ అవునని సమాధానం ఇస్తుంది. దీంతో గోవుల కాపరి వేషంలో ఉన్న ఆ మురుగన్ వేయించిన పండ్లు కావాలా? పచ్చిగా ఉండ్లు పండ్లు కావాలా? అని అడుగుతాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

దీనికి అవ్వయార్ నవ్వుతారు. పండ్లు ఎవరూ వేయించరు కదా? ఈ బాలుడుకి పిచ్చి కావచ్చు అని నవ్వుకొని మామూలు పండ్లు ఇవ్వమని అడుతారు. దీంతో ఆ బాలుడు చెట్ల పై ఉన్న పండ్లకు కిందికి పడేలా చేస్తాడు. అప్పుడు ఆ అవ్వయార్ పండ్ల పై ఉన్న మట్టిని తొలగించడానికి ఊదుతుంది. దీంతో బాలుడు అవి మాములు పండ్లే వేడిగా లేవు. చల్లగా చేయడానికి ఎందుకు ఊదుతున్నావు అని అంటాడు. దీంతో ఈ బాలుడు సామాన్య బాలుడు కాదని అవ్వయార్ భావిస్తుంది.వెంటనే తనకు నిజరూపంలో దర్శనమివ్వాల్సిందిగా వేడుకొంటుంది. దీంతో బాలుడు సుబ్రహ్మణ్యస్వామి రూపంలో అవ్వయార్‌కు కనిపిస్తాడు. అటు పై ఆమె కోరిక మేరకు ఇక్కడ వెలిసి భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు. ముఖ్యంగా సంతానంలేనివారు ఈ దేవాలయాన్ని సందర్శిస్తే వెంటనే సంతానం కలుగుతుందని స్థానికులు చెబుతూ ఉంటారు. మరిచూశారుగా ఈ దేవాల‌యం ద‌ర్శించి ఈ స‌మ‌స్య ఉంటే స్వామిఅనుగ్రహం పొందండి. మ‌రి ఈ వీడియోపై మీ అభిప్రాయంతెలియ‌చేయండి.