72 ఏళ్ల తర్వాత పాకిస్ధాన్ లో తెరుచుకున్న దేవాలయం

263

దేవాలయాలు అంటే ఎంతో చరిత్ర ప్రాశస్యం కలిగి ఉంటాయి.. కొన్ని దేవాలయాలు వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటి దేవాలయాలకు మహిమ ఉంటుందని అలాంటి దేవాలయాలలో పూజలు అందుకునే స్వామి లేదా అమ్మవారు ఎంతో మహిమలు కలిగి ఉంటారు అని అంటారు.. వంద నుంచి వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయాలను కూడా ప్రభుత్వం తన అధీనంలో అన్ని కార్యక్రమాలు పూజలు దూప దీప నైవేథ్యాలు స్వామికి కైంకర్యాలు చేస్తూ ఉంటుంది. మన నమ్మకాలకు మన విశ్వాసాలకు మిగిలిన వారు కూడా గౌరవం ఇస్తారు, ఇలాంటి ఓ పురాతన దేవాలయం గురించి ఇప్పుడు చెప్పుకోవాలి, ఇంతకీ ఆ దేవాలయం విశిష్టత ఏమిటి అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం.

after 72 years hindu temple to be opened in pakistan

సియాల్‌కోట్‌లో వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఓ హిందూ దేవాలయాన్ని మళ్లీ తెరిచారు. ఈ ఆలయం దాదాపు 72 ఏళ్ల క్రితం మూసివేశారు. భారత్-పాక్ విభజన సమయంలో మూతపడిన ఆలయం మళ్లీ ఇప్పుడు తెరిచారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశాల ప్రకారం ఈ ఆలయాన్ని తెరుస్తున్నట్లు పాక్ మీడియా వెల్లడించింది. అయితే ఈ దేవాలయానికి ఓ చరిత్ర ఉంది, కాని దేవాలయం తెరుచుకునే సమయానికి అక్కడకు వేలాది సంఖ్యలో జనం తరలి వచ్చారు.

ఈ క్రింద వీడియో చూడండి

సుమారు 1000 ఏళ్ల కిందల సర్దార్ తేజా సింగ్ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెప్తోంది. భారత్‌లోని బాబ్రీ మసీదును కూల్చివేసిన అనంతరం.. 1992లో ఓ గుంపు ఈ ఆలయంపై దాడి ధ్వంసం చేసింది. ఆ తర్వాత ఈ ఆలయం వద్దకు హిందువులు రావడం మానేశారు. అయితే.. పాక్ తాజా నిర్ణయంతో 72 ఏళ్ల క్రితం మూతపడిన ఆలయం మళ్లీ భక్తులకు అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా.. ఆలయంలో దెబ్బతిన్న భాగాలను కూడా పునరుద్ధరించాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆలయాన్ని పరిరక్షించే పనులు కూడా ప్రారంభం అయ్యాయి.

after 72 years hindu temple to be opened in pakistan

అయితే లోపల మాత్రం ఆలయంలోకి తెరచి చూసిన వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు, ఎందుకు అంటే ఎప్పుడో 72 ఏళ్ల కిందట ఈ దేవాలయం మూసేశారు ..కాని ఈ దేవాలయం మూసివేసిన తర్వాత దూప దీప నైవేధ్యాలు మాత్రం జరగలేదు, అయితే అనూహ్యంగా ఆలయం తెరచి చూస్తే అక్కడ స్వామి ముందు మాత్రం దీపం వెలుగుతూనే ఉంది. అలాగే దేవాలయం కాంతిలీనుతూ ఉంది. దీంతో అది చూసిన వారు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇదంతా స్వామి మహిమ అని అంటున్నారు, మన చేత స్వామి పూజలు సేవలు అందుకుంటారుచ అలాగే భక్తులు ఎవరూ పూజలు చేయకపోయినా అక్కడ మాత్రం దీపం వెలగడం నిజంగా ఇది మహిమ అని చెప్పాలి. దీంతో ఈ దేవాలయం మరింత చర్చల్లోకి వచ్చింది.. మరి మీరేమంటారు దీని వెనుక కారణం పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.