మ‌హాశివరాత్రి రోజున అద్బుతం శివుని విగ్రహం ఫై పడగెత్తిన నాగుపాము

359

శివుని మెడ‌లో ఆభ‌ర‌ణంగా ఉండే నాగేంద్రుడ్ని భ‌క్తులు పూజిస్తారు.. ముఖ్యంగా హైంద‌వులు అంద‌రూ శివుడ్ని ఎంత భ‌క్తితో కొలుస్తారో అలాగే ఆయ‌న మెడ‌లో ఉండే నాగేంద్రుడ్ని భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో కొలుస్తారు. కాలం అనే మాట‌కు స‌ర్పం అని అంటారు, కాలుడు అనే పేరుతో శివుడ్ని పిలుస్తూ ఉంటారు. అందుకే శివుడు నాగుపాముని మెడ‌లో ధ‌రించి క‌నిపిస్తూ ఉంటారు. ఇక శివుని విగ్ర‌హం ఎక్క‌డ క‌నిపించినా శివాల‌యాల్లో అలాగే శివుని చిత్ర‌ప‌టాలు ఉత్స‌వ మూర్తుల విగ్ర‌హాలు, ఎక్క‌డ శివ‌య్య‌ను చూసినా క‌చ్చితంగా నాగేంద్రుడు రూపం కూడా క‌నిపిస్తుంది. మ‌నం ఏదైనా గుడికి వెళితే అక్క‌డ పాములు విగ్ర‌హాల ప‌క్క‌న చెక్క‌బ‌డి కూడా ఉంటాయి. పెద్ద పెద్ద స‌ర్పాల పేర్ల‌తో అక్ష‌ర‌మాల‌లా రాసి కూడా ఉంటాయి. శివుడు అంత‌టి వాడే పాముని త‌నమెడ‌లో ధ‌రించాడు, అందుకే పాముని ఎక్క‌డైనా చూసినా దానికి ఎటువంటి హాని చెయ్యం. ఇక నాగుపాముని శివుని మెడ‌లో చూసిన వారు ఎవ‌రైనా ఇది స్వామి మెడ‌లోనే ఉంటుంది అని పురాణాల నుంచి చెబుతున్నారు.

Image result for snake with sivalingam

అయితే ఒక్కోసారి శివ‌లింగం చుట్టుకుని నాగుపాములు క‌నిపిస్తాయి. అంతేకాదు పాల‌తో స్వామికి అభిషేకం చేసే స‌మ‌యంలో కూడా శివుని ప‌క్క‌న అవి త‌చ్చాడుతూ క‌నిపిస్తాయి. ఆ లింగం చుట్టుకుని అభిషేకంలో అవి పాలుపంచుకుంటాయి, ఈ స‌మ‌యంలో నాగేంద్రుడికి కూడా ఇలా అభిషేకం చేస్తారు. ఇక శివ‌రాత్రి ప‌ర్వ‌దినం రోజున ఓ నాగుపాము శివుని మెడ‌ని చుట్టుకుని ఉంది. ఇది చూసిన వారు అంద‌రూ ఆ శంక‌రుడి లీలావిశిష్ట‌త ఇలా క‌నిపించింది అని అంటున్నారు…స్వామి వారి ద‌ర్శ‌నం ఇలా అయిందా అని, ఆయ‌న కృప‌ని కోరుకున్నారు. ఇది ఓ గొప్ప రోజుగా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం కావ‌డంతో ఇలా విశిష్టంగా జ‌రిగింది అని భావించారు. పెద్ద‌ప‌ల్లిలో ఇలా జ‌ర‌గ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు.

ఈ క్రింది వీడియో చూడండి 

ఇది స్వామిలీలామృతం అని అన్నారు, శివుని ఆశీస్సులు ఈ గ్రామానికి ఉంటాయి అని తెలియ‌చేశారు. ఇక్క‌డ ముందుగా కొంద‌రు విగ్ర‌హం చూస్తున్న స‌మ‌యంలో ఎత్తైన విగ్ర‌హం ద‌గ్గ‌ర శివుని మెడ‌లో ఉన్న నాగుపాము కాకుండా మ‌రో నాగుపాము క‌నిపించింది. అయితే దానిని కొంద‌రు ఏమిటి అని నిశితంగా చూస్తే అది ప‌డ‌గ‌విప్పి క‌నిపించింది.. దీంతో అక్క‌డ వంద‌లాది మంది జ‌నం త‌ర‌లివ‌చ్చారు, ఈరోజు మ‌హాశివ‌రాత్రి కావ‌డంతో ఇంకెంతో విశిష్ట‌త‌గా ఈ దృశ్యం క‌నిపించింది అని తెలియ‌చేశారు భక్తులు అంద‌రూ..ఇక శివునికి పాలాభిషేకం చేశారు, ఈ స‌మ‌యంలో కూడా ఆ నాగుపాము శివుని చేతి ద‌గ్గ‌ర మాత్ర‌మే ఉంది. కాని అది కింద‌కి దిగలేదు, దీంతో ఇది శివ‌య్య లీల అని భ‌క్తిపార‌వ‌శ్యంలో అంద‌రూ మునిగిపోయారు, మ‌రి నేడు జ‌రిగిన ఈ మ‌హ‌త్యం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.