కార్తీక పౌర్ణమి రోజు ఏమి చేసిన చేయకపోయినా పర్లేదు ఈ ఒక్క పని చేస్తే చాలు..కోటేశ్వరులు అవుతారు

399

అన్ని మాసాల్లో కన్నా కార్తీక మాసం చాలా పవిత్రమైనది. కార్తీక మాసంలో ప్రతి రోజు ప్రవిత్రమైన రోజే. అయితే కార్తీక పౌర్ణమి అంటే మరింత భక్తిశ్రద్ధలు ఉంటాయి.కార్తీక శుద్ధ పౌర్ణమి కార్తీక మాసములో శుక్ల పక్షము నందు పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీకమాసములో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని ”త్రిపురి పూర్ణిమ”, ”దేవ దీపావళి” అని కూడా అంటారు. ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్ళిన మర్నాడు కార్తీకమాసం ప్రారంభమౌతుంది. ఇక ఆరోజు నుండి కార్తీకమాసం ముగిసేవరకూ ప్రతిరోజూ సాయంవేళ దీపాలు వెలిగించి సంరంభం చేస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు.అయితే ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నవంబర్ 22 వ తేదీ వచ్చింది.ఆ రోజు ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలగడం పక్కా.మరి ఎన్ చెయ్యాలో చూద్దామా.

కార్తీక మాసంలో శివుణ్ణి,విష్ణువుని పూజిస్తారు. అంటే ఈ కార్తీక మాసంలో శివ కేశవులు ఇద్దరిని పూజిస్తారు. కార్తీక మాసంలో సోమవారాలు,పౌర్ణమి రోజుల్లో చేసే పూజలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. కార్తీక పౌర్ణమి రోజున శివుణ్ణి పూజించి ఉపవాసం ఉండి ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్త్తే కోరుకున్న కోరికలు నెరవేరటమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి. కార్తీకమాసంలో శివునికి ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాధాన్యత విష్ణువుకు కూడా ఉన్నది. శైవులు కార్తీక మాసం అంటే వైష్ణవులు దామోదర మాసం అని పిలుస్తారు.ఎనిమిదొవ మాసం అయినా కార్తీక మాసంలో తెల్లవారుజామున స్నానం చేసి దీపాలను వెలిగిస్తాం . కార్తీక పౌర్ణమి రోజు తులసి కళ్యాణం జరిపిస్తే కోరుకున్న కోరికలు నెరవేరతాయి. కార్తీక పౌర్ణమి రోజు కుదరని వారు ఏకాదశి రోజు కూడా తులసి కళ్యాణం జరిపించవచ్చు. ఈ కళ్యాణం తులసి,విష్ణు మూర్తికి చేస్తారు. వైష్ణవ సంప్రదాయం గలవారు కార్తీక ఏకాదశి రోజున భీష్మ పంచక వ్రతాన్ని ప్రారంభించి కార్తీక పౌర్ణమితో ముగిస్తారు. కొంతమంది వైష్ణవులు భీష్మ పంచక వ్రతాన్ని కార్తీక మాసం చివరి ఐదు రోజుల్లో కూడా చేస్తూ ఉంటారు.

కార్తీక మాసంలో చతుర్దశి తిది రోజున వైకుంఠ చతుర్దశి వ్రతం ఆచరిస్తారు. పౌర్ణమి ముందు రోజు చతుర్దశి తిది వస్తుంది. ఈ చతుర్దశి తిధి రోజున శ్రీ మహావిష్ణువు శివుణ్ణి ఆరాదించినట్టు పురాణాల్లో ఉంది. త్రిపురాసురుడుని సంహరించిన ఈ కార్తీక పౌర్ణమి రోజున దేవతలు కూడా పూజలు చేస్తారు. అలాగే కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగించి గంగానదిలో వదులుతారు. కార్తీక మాసంలో శివ కేశవులను పూజించి కార్తీకపౌర్ణమి రోజు తులసి కళ్యాణం జరిపిస్తే అష్ట ఐశ్వర్యాలు కలగటమే కాకుండా కోటి జన్మల పుణ్యం కూడా దక్కుతుంది.కాబట్టి పౌర్ణమి రోజు ఇలా చేసి మీ పాపాలను తొలగించుకోవడమే కాకుండా అష్టైశ్వర్యాలు పొందేలా చేసుకోండి.