డిసెంబర్ 31న నైట్ కి కొబ్బరికయతో ఇలా చేస్తేతెల్లవారిన తరువాత నుంచి ధనవర్షమే

780

పూజైనా, పేరంటమైనా,యజ్ఞమైనా, యాగమైనా,జపమైనా, తపమైనా,అన్ని శుభ సందర్భాలలోనూ తప్పక దర్శనమిస్తుంది కొబ్బరికాయ. కొబ్బరికాయను కొట్టిన తర్వాతే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు మన పెద్దలు. కొబ్బరికాయను కొట్టడం… శాంతి కారకం, అరిష్టనాశకం. భారతదేశపు దేవాలయాలలో చేసే అత్యంత సామాన్య నివేదన ఈ కొబ్బరికాయ. హోమము చేసే సమయములో ఇది హోమాగ్నికి ఆహుతిగా అర్పించబడుతుంది. భగవంతుని ప్రసన్నం చేసుకుని తమ కోరికలను తీర్చుకోవడానికి కొబ్బరికాయను కొట్టి స్వామికి నివేదిస్తారు. తరువాత ప్రసాదముగా అందరికీ పంచిపెడతారు.

కావాలంటే ఈ వీడియో చూడండి

అయితే కొంద‌రు డ‌బ్బు సంపాదించ‌డంలో అంద‌రిక‌న్నా ముందు వ‌రుస‌లో దూసుకుపోతుంటారు. వారు ప‌ట్టింద‌ల్లా బంగార‌మ‌వుతుంటుంది. కానీ కొంద‌రు మాత్రం ఎంత సంపాదించినా అది ఏదో ఒక రూపంలో ఖ‌ర్చు అయిపోతుంటుంది. ఆర్థిక స్థిర‌త్వం అనేది వారికి ఉండ‌దు. వీరితోపాటు అధిక శాతం మంది డ‌బ్బు సంపాదించేందుకు బాగా క‌ష్ట‌ప‌డుతుంటారు.

సమస్యలేని మనుషులు అంటూ ఎవ్వరూ ఉండరు. ఎంత డబ్బు ఉన్నవారైనా, డబ్బు లేనివారికైనా ఎవ్వరికైనా కూడా సమస్యలు ఉండక తప్పదు. ఆ సమస్యలను ఎదుర్కోవడం, జీవతంతో ఫైట్ చేసి గెలవడం అదే మానవ జీవితం. సమస్యలను ఎదుర్కునేటప్పుడు తెలుసుకునే కొన్ని నిజాలే జీవత సత్యాలు అవుతాయి. ఆ సత్యాలు వలన మనకి, మన తరవాత తరానికి కూడా మంచి జరుగుతుంది.

సమస్యలు అందరికి ఉంటాయి గాని, డబ్బు ఉంటె అన్నీ కాకపోయినా చాలా వరకు సమస్యలను తీర్చుకోవచ్చు. ధనం అవసరం లేని దశమంతుడు ఈ భూమి మీద ఎవ్వరు ఉండరు. అందరికి ఆ ధనం కావలి దాని కోసం పోరాటం చెయ్యాలి. అయితే ఈ ధనం సంపాదించే పనిలో ఉన్నప్పుడు, అనేక ఆటంకాలను ఎదుర్కోవలసి వస్తుంది.

ఆర్ధిక ఇబ్బందులు నిరాశకు లోను చేస్తాయి, మనిషిని కృంగదీస్తుంది…మొత్తానికి ఈ సంవత్సరం ఎలాగోలా ముగిసిపోయింది, వచ్చే ఏడాది అయినా అంతా మంచే జరగాలని కోరుకునే వారు, ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోవాలనుకునేవారు, డిసెంబర్ 31 రాత్రి సుమారు పది గంటల తరవాత ఒక కొబ్బరి కాయను తీసుకొని దాన్ని ఇంట్లో ప్రతీ మూలన చూపించి, ఇంటి బయటకి

వచ్చి ప్రధాన ద్వారం దగ్గర ముందు నుంచొని దాని మీద కర్పూరం వెలిగించి కుడివైపు ఎడమవైపు మూడు మూడు సార్లు తిప్పి కాస్త దూరంగా వెళ్లి ఒక్కసారిగా పగిలేలా దాన్ని కొట్టాలి, ఆతరువాత కాళ్ళు చేతులు బాగా కడుక్కొని ఇంట్లోకి ప్రవేశించాలి…

ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి, వాస్తు దోషాలు ఏమైనా ఉంటె తోలగోపోవడానికి అవకాసం ఉంది అని చెబుతున్నారు నిపుణులు…