చంద్రగ్రహణం విడిచిన తరువాత అంటే జులై 28న పొద్దున్నే ఇలా చేస్తే మీరు ధనవంతులు అవ్వడం ఖాయం

761

జూలై 27 అర్థరాత్రి 11 గంటల 54 నిమిషాలకు శతాబ్దంలోనే అరుదైన చంద్రగ్రహణం రాబోతోంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. దాదాపు 103 నిమిషాలపాటు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. శనివారం వేకువ జామున 3.49 గంటల వరకు గ్రహణం కొనసాగుతుంది. 4.58 గంటలకు గ్రహణ ప్రభావం పూర్తిగా తొలుగుతుంది.అయితే గ్రహణ సమయంలో మరియు ఈ గ్రహణం తర్వాత మరుసటి రోజు అంటే జులై 28 వ తేది మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రహణ సమయంలో చెయ్యాల్సిన పనులు
గ్రహణ సమయం లో సూర్యుని నేరుగా చూసే ప్రయత్నం చేయకూడదు.ఆ సమయం లో బైటికి వెళ్ళడం శ్రేయస్కరం కాదు.అతినీల లోహిత కిరణాలవలన తీవ్రమైన ఆరోగ్య హాని కలుగుతుంది.గ్రహణ సమయం లో భోజనం నిషిద్ధం.ముందురోజు వండిన పదార్థాలను ఉంచరాదు.ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బైటికి రాకూడదు.గర్భస్త శిశువుపై అతి నీలలోహిత కిరణాల విష ప్రభావం పడే అవకాశాలు ఎక్కువ.గ్రహణ సమయం లో రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీవ్యవస్థ, ఆలోచనలు భిన్నంగా ఉంటాయి.కనుక ఆ సమయం లో ముఖ్యమైన పనులు తలపెట్టరాదు. ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోరాదు.గ్రహణ కాలం లో చేసే జప, హోమ, దానాలన్నీ అత్యధిక ఫలితాన్నిస్తాయి.గ్రహణ సమయం లో మహామృత్యుంజయ మంత్రం పఠించడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి.గాయత్రిని ధ్యానించడం వలన వాక్కు కు బలం ఏర్పడుతుంది.తాంత్రికులు ఈ గ్రహణ కాలాన్ని ఎంతో ముఖ్యమైనది.ఈ సమయం లో వశీకరణాది విద్యలను సాధన చేస్తే అవి సులభంగా పట్టుబడతాయి.వైదికులు, సాత్వికులు ఈ గ్రహణ కాలం లో జపాలనూ, హోమాలను చేస్తారు.గ్రహణ కాలం లో చేసే దానాల వలన జాతక దోషాలు తొలగుతాయి. ఐశ్వర్యం సిద్ధిస్తుంది.

గ్రహణం విడిచిన తర్వాత చెయ్యాల్సిన పనులు
గ్రహణం విడిచిన తరువాత పుణ్యనదుల్లో స్నానమాచాలి.పుణ్యనదుల్లో కుదరకపోతే ఇష్టదైవాన్ని స్మరిస్తూ స్నానమాచరించాలి.శివాలయానికి వెళ్లి ఆవు నేతితో దేవుడికి దీపం పెట్టి ప్రదక్షిణ చెయ్యాలి.ఆవుకి బెల్లం పెడితే, గ్రహదోషం తగ్గుతుంది.పెళ్లికాని అమ్మాయిలు గ్రహణం తరవాత రోజు, చంద్రబింబం దానం చేస్తే కోరుకున్న వరుడు లభించమే కాకుండా పండంటి కాపురం వారి సొంతం అవుతుందంట. గర్భిణీ స్త్రీలు గర్భరక్షా స్తోత్రం పఠించాలి.క్లిష్టమైన మంత్రాలను పఠించలేనివారు ‘ఓం నమః శివాయ’ అంటే చాలు.‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరిని పఠించాలి.గ్రహణ కాలం ముగిసిన తరువాత ఇంటిని శుద్ధి చేయాలి.