జూలై 27న చంద్ర‌గ్ర‌హ‌ణం పెళ్లికాని వారు గ్ర‌హ‌ణం చూడ‌చ్చా చూస్తే ఏమౌతుందో చూడండి

635

జూలై 27 అర్థరాత్రి 11 గంటల 54 నిమిషాలకు శతాబ్దంలోనే అరుదైన చంద్రగ్రహణం రాబోతోంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. దాదాపు 103 నిమిషాలపాటు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. శనివారం వేకువ జామున 3.49 గంటల వరకు గ్రహణం కొనసాగుతుంది. 4.58 గంటలకు గ్రహణ ప్రభావం పూర్తిగా తొలుగుతుంది.గ్రహగణాలు, వాటి స్థితిగతులను బాగా నమ్మే దేశం మనది. మనుషుల జీవితాలకు, గ్రహాల కదలికలకు సంబంధం వుందని అవే జీవితాల్ని శాసిస్తాయని చెబుతారు. అలాంటి దేశంలో గ్రహణాలపై శ్రద్ధ కాస్త ఎక్కువే.అందుకే ఇప్పుడు మీకొక ముఖ్య విషయం గురించి చెప్పబోతున్నాను.పెళ్లికానీ వారు ఈ గ్రహణాన్ని చూస్తే ఏమౌతుంది.మంచి కలుగుతుందా చెడు కలుగుతుందా..ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 చంద్ర గ్రహణం :

ఈ చంద్ర గ్రహణ ప్రభావం కొన్ని రాశి చక్రాల మీద అధికంగా ఉండనుందని తెలుస్తోంది. ముఖ్యంగా మేష రాశి, సింహ రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారు సానుకూల ఫలితాలను పొందుతుండగా మకర రాశి, మిధున రాశి, కన్యా రాశి, ధనుస్సు రాశుల వారు ప్రతికూల ప్రభావాలను పొందే అవకాశాలున్నాయి. మరియు కుంభ రాశి, తులా రాశి, కర్కాటక రాశి, వృషభ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.ముఖ్యంగా శతాబ్దంలోని అత్యంత పొడవైన చంద్ర గ్రహణం రోజున, పెళ్లి కాని వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

పెళ్లి కాని వారు గ్రహణాన్ని చూడవచ్చా?

ఆరోజున అందంగా కనిపించే చంద్రుడు పెళ్లి కాని వారికి ప్రతికూల ప్రభావాలను కలుగచేస్తాడని, క్రమంగా మానసిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని ముఖ్యంగా వారి వారి సంబంధాల మీద మరియు పెళ్లి జరిగే అంశాల మీద ఉండనుందని హెచ్చరిస్తున్నారు.నిజానికి చంద్రుడు రాశి చక్రాలకు సంబంధించినంత వరకు భావోద్వేగాలను మరియు ప్రేమ వంటి అంశాల మీద సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంటాడు. కానీ గ్రహణం సమయంలో కొన్ని ప్రతికూల ప్రభావాలకు భావోద్వేగాలు గురికావడం జరుగుతుంది.రాహువు చంద్రుని మింగడాన్ని చంద్రగ్రహణంగా మాత్రమే కాకుండా చంద్రదోషంగా‌ కూడా పరిగణిస్తుంటారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

రాశి చక్రాలకు సంబంధించిన జన్మకుండలిలో నీచ స్థానంలో చంద్రుడు ఉన్న‌ ఎడల ఈ ప్రభావాలు అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి. భావోద్వేగాలకు ఉద్రేకాలకు వ్యక్తులు లోనయ్యే పరిస్థితులు దాపురిస్తాయని హెచ్చరించడమైనది.కావున వీలైనంత మేర పెళ్లి కాని వారు చంద్ర గ్రహణాన్ని చూడకుండా ఉండడమే మేలని సూచించడమైనది. మరియు పెళ్లి కాని వారు మాత్రమే కాకుండా గర్భవతులకు, మరియు జన్మ కుండలిలో నీచ స్థానంలో చంద్రుడు ఉన్న పెళ్లయిన వారికి కూడా ప్రతికూల సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని తెలియజేయడమైనది.కాబట్టి పెల్లికానీ వారు ఎట్టిపరిస్థితిలో ఈ గ్రహణాన్ని చూడకండి.మరి ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో మాకు చెప్పండి.అలాగే ఈ గ్రహణం రోజు గ్రహణ దోషం ఉన్న వాళ్ళు ఏమేమి చేస్తే మంచిది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.