పెళ్లి ప‌త్రిక‌ను శ్రీవారికి పంపిస్తే త‌లంబ్రాలు నేరుగా మీ ఇంటికి వ‌స్తాయి ఎలాగో తప్ప‌క తెలుసుకోండి

769

దేవ దేవుని స‌న్నిది తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం అంటే ఆధ్యాత్మిక భావంతో పుల‌కించుకుపోతుంది….. స‌ప్త గిరులు శ్రీవారి నామ‌స్మ‌ర‌ణ‌తో మార్మోగిపోతాయి… ఇక ఆయ‌న ద‌ర్శ‌నం కోసం రోజూ వేలాది మంది బారులు తీరే విష‌యం తెలిసిందే.. ఆయ‌న ఆశిస్సుల కోసం నిత్యం వేలాది మంది తిరుమ‌ల‌కు చేరుకుంటారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులకు శ్రీవారికి నిర్వహించే నిత్య కళ్యాణంలో వినియోగించే పవిత్ర తలంబ్రాలను అందజేయాలని నిర్ణయించింది.

ఈ పథకం వివాహం కాగానే కొత్త జంటలు తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందడాన్ని మరింత సులభ సాధ్యం చేస్తోంది. శ్రీవారి ఆశీర్వచనం కావాలనుకునే నూతన దంపతులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ పెళ్లి పత్రికను పోస్టు ద్వారా తమకు పంపిస్తే శ్రీవారి పవిత్ర తలంబ్రాలను వారికి పోస్టు ద్వారా ఉచితంగా అందజేస్తామని టీటీడీ అధికారులు తెలిపారు….శ్రీవారి కల్యాణ తలంబ్రాలు, కుంకుమ, కంకణాలు, కల్యాణ సంస్కృతి పుస్తకాన్ని పోస్టులో పంపనుంది.వధూవరులు కల్యాణంలో తొలి ఘట్టంగా కంకణధారణ చేస్తారు. ఉపద్రవాల నుంచి రక్షాబంధనంగా భావిస్తూ వీటిని ధరింపజేస్తారు. ఇందుకు ప్రతీకగా.. శ్రీపద్మావతి అమ్మవారి ఆశీస్సులతో కూడిన కుంకుమను, కంకణాన్ని పంపుతారు…. నవ దంపతులకు సకల మంగళాలు కలగాలని ఆకాంక్షిస్తూ.. శ్రీవారి ఆశీస్సులతో తలంబ్రాలు పంపడం జరుగుతుంది.

అలాగే వివాహ వ్యవస్థ ఔన్నత్యాన్ని తెలిపేందుకు టీటీడీ పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేకాధికారి సముద్రాల లక్ష్మణయ్య రచించిన కల్యాణ సంస్కృతి పేరిట ఓ పుస్తకాన్ని, టీటీడీ ఈవో పేరిట వేద ఆశీర్వచనం పత్రికను కొత్త జంటలకు పంపుతారు.ఇవి కనీసం ఒక పది వేల మందికి పంపించాలి అని టీటీడీ నిర్ణయించుకుంది. అంతేకగా, భక్తులు ఈ పూర్తి చిరునామాకి శుభలేఖ పంపితే చాలు, మీకు శ్రీవారి కల్యాణ తలంబ్రాలు ఇంటికి వస్తాయి అని చెబుతోంది …మ‌రి మీకు ఆ అడ్ర‌స్ ను ఇప్పుడు తెలియ‌చేస్తున్నాం

ఎగ్జిక్యూటివ్ అధికారి,
తిరుమల తిరుపతి దేవస్థానం ( టీ.టీ.డీ ),
కేటీ రోడ్,
తిరుపతి,
పిన్ కోడ్ : 517 501
ఆంధ్ర ప్రదేశ్
ఈ అడ్ర‌స్ కు మీ శుభ‌లేక పంపిన త‌ర్వాత మీకు కొంత స‌మ‌యం తీసుకున్నా త‌ప్ప‌క మీ ఇంటికి శ్రీవారి తలంబ్రాలు చేరుతాయి.. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం క‌ల్యాణం చేసుకున్న వారు చేసుకునే వారు ఈ అడ్ర‌స్ ను ప‌క్క‌న రాసుకోండి… శ్రీవారి ఆశీస్సులు పొందండి. ఈ వీడియోని మీ స‌న్నిహితుల‌కు తెలియ‌చేయండి ,అలాగే షేర్ చేయండి. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణ‌యం పై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.