సముద్రపు నురగతో వెలసిన వినాయకుడు..ఎక్కడుందో తెలుసా.?

1139

మ‌నం ఏదైనా ప‌నిని మొద‌లు పెడితే ఏ విఘ్నాలు రాకూడ‌దు అని వినాయ‌కుడిని పూజిస్తాం.. అందుకే తొలిపూజ వినాయ‌కుడికి చేస్తాం… ఆ త‌ర్వాతే ఎవరిని అయినా కొలుస్తాం.. ఏ పూజా కార్య‌క్ర‌మం చేసినా వ్ర‌తాలు ఆచ‌రించినా వినాయ‌కుడికి ఆదిపూజ చేయాల్సిందే.. ఇలా చేయ‌క‌పోతే ఏ కార్యం త‌ల‌పెట్టినా అది నెర‌వేర‌దు అంటారు.. ఇక మొద‌టిపూజ కూడా ఆయ‌న‌కు చేయ‌డం వ‌ల్ల గుడిలో కూడా ఆయ‌న విగ్ర‌హాలు ఉంటాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ దేవాల‌యాల‌లో ఉన్న వినాయ‌క విగ్ర‌హాలు చాలా చూసి ఉంటాం… ఈ విగ్ర‌హాల‌ను రాయి లేదా పాల‌రాయి వెండి బంగారంతో త‌యారు చేసి ఉండ‌వచ్చు.. కాని ఇప్పుడు ఈ చెప్ప‌బోయే వినాయ‌క‌ విగ్ర‌హాం గురించి తెలుసుకుంటే ఆశ్చ‌ర్య‌పోతారు.. ఈ వినాయ‌క విగ్ర‌హాన్ని స‌ముద్ర‌పు నుర‌గ‌తో త‌యారు చేశారు విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజం..

త‌మిళ‌నాడులోని కుంభ‌కోణంలో ఉన్న శ్వేత వినాయ‌కుడి విగ్ర‌హం ఇలా స‌ముద్ర‌పు నుర‌గ‌తో ఉన్న విగ్ర‌హం… ప్ర‌పంచంలో ఇలా నుర‌గ‌తో ఉన్న విగ్ర‌హాం ఇది ఒక‌టే… ఈ విగ్ర‌హం గురించి అలాగే ఆ వినాయ‌కుడి విశిష్ట‌త గురించి ఇప్పుడు తెలుసుకుందాం.కుంభ‌కోణం బ‌స్టాప్ నుంచి ఎనిమిది కిలోమీట‌ర్ల దూరంలో శ్వేత వినాయ‌క‌ర్ దేవాల‌యం ఉంది.. ఇక్క‌డ ఉన్నా విగ్ర‌హం స‌ముద్ర‌పు నుర‌గ‌తో ఏర్ప‌డింది అని చెబుతారు స్ధానికులు… ఈ విగ్ర‌హానికి పూజారులు అభిషేకం చేయ‌రు, అలాగే ఈ విగ్ర‌హం పై నీరు కుంకుమ ప‌సుపు వంటి పూజా వ‌స్తువులు చ‌ల్ల‌రు… ఇక చూడ‌టానికి వ‌చ్చిన భ‌క్తులు అలాగే పూజారులు కూడా ఈవిగ్ర‌హాన్ని తాక‌రు… అలాగే ఎవ‌రూ ఈ విగ్ర‌హానికి వ‌స్త్రాలు కూడా క‌ట్ట‌రు… కేవ‌లం ప‌చ్చ క‌ర్పూర పొడిని మాత్ర‌మే చ‌ల్లుతారు… స‌ముద్ర‌పు నుర‌గ‌తో త‌యారు కావ‌డం వ‌ల‌న ఈ విగ్ర‌హాన్ని ఎవ‌రూ తాక‌క‌డూదు అని చెబుతారు.

అయితే దీని వెనుక కూడా చెప్పే క‌థ ఉంది… అమ‌ర‌త్వం కోసం దేవ‌త‌లకు- రాక్షసుల‌కు మ‌ధ్య జ‌రిగిన క్షీర‌సాగ‌ర మ‌ధ‌నం గురించి మ‌న‌కు తెలిసిందే…ఆ స‌మ‌యంలో క్షీర‌సాగ‌రం నుంచి ముందు హాలాహాలం బ‌య‌ట‌కు వ‌చ్చింది.. అయితే ఇలా ఎందుకు జ‌రిగింది అని దేవ‌త‌లు ఆలోచించారు.. చివ‌ర‌కు వారు మ‌ర్మం గ్ర‌హించారు.. వినాయ‌కుడికి మ‌నం ముందు పూజ చేయ‌కుండా ఈ కార్యం త‌ల‌పెట్టాము అందుకే మ‌నకు ఇటువంటి విఘ్నం త‌గిలింది అని వారు భావించారు. ఆ స‌మ‌యంలో క్షీర‌సాగ‌రంలో నుంచి వ‌చ్చిన నుర‌గ‌తో వినాయ‌కుడి విగ్ర‌హాం ప్ర‌తిష్టించి పూజ‌లు చేసి త‌ర్వాత క్షీర‌సాగ‌ర మ‌ధ‌నం చేశారు..

త‌ర్వాత ఆవిగ్ర‌హాన్ని ఇంధ్రుడు త‌న‌తో తీసుకువెళ్లాడు.. దేవ‌లోకంలో రోజూ నిష్ట‌గా పూజించేవాడు చివ‌ర‌కు అహ‌ల్య శాపంతో ఆ విగ్ర‌హాన్ని భూలోకంలోకి తీసుకువ‌చ్చి రోజుకోచోట ఆ విగ్ర‌హాన్ని పుణ్య‌క్షేత్రాల‌కు తీసుకువెళ్లేవాడు అలాగ ఓరోజు ప్ర‌త్యేక పూజ కోసం కుంభ‌కోణానికి తీసుకువ‌స్తాడు.. ఈ స‌మ‌యంలో వినాయ‌కుడికి ఇక్క‌డ ప్రాంతం ప్ర‌కృతి న‌చ్చుతుంది త‌న తండ్రి అయిన ప‌ర‌మ‌శివునికి ఈ విష‌యం చెప్పి తాను ఇక్క‌డే ఉంటాను అని చెపుతాడు దీంతో శివుడు చిన్న‌పిల్ల‌వాని రూపంలో అక్క‌డకు వ‌స్తాడు ఆ స‌మయంలో ఇంద్రుడు తాను శివార్చ‌న చేసుకువ‌స్తాను అని ఈ విగ్ర‌హాన్ని చేత్తో ప‌ట్టుకోమ‌ని ఆ చిన్న‌పిల్ల‌వాడికి చెబుతాడు..

దీంతో ఆ పిల్ల‌వాడి రూపంలో ఉన్న శివుడు ఆ వినాయ‌క విగ్ర‌హాన్ని బ‌లిపీఠం పై ప్ర‌తిష్టించి వెళ‌తాడు.. చివ‌ర‌కు ఇంధ్రుడు వ‌చ్చి చూసేస‌రికి ఆ వినాయ‌కుడి విగ్ర‌హాం బ‌లిపీఠం పై ఉంటుంది.. దీంతో ఎంత తీద్దాము అని అనుకున్నా విగ్ర‌హం బ‌య‌ట‌కు రాదు ఈ స‌మ‌యంలో దేవ‌శిల్పి స‌హాయంతో విగ్ర‌హాన్ని ర‌థంతో తీసుకువెళ్ల‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు… ఈ స‌మ‌యంలో ఆ విగ్ర‌హం అనువైంత అయినా క‌ద‌ల‌ను.. ఇక దైవ‌వాణి ఇంధ్రునితో ఓ విష‌యం చెబుతుంది వినాయ‌కుడు ఇక్క‌డ ఉండాలి అని అనుకున్నాడు అందుకే ఆయ‌న‌ని తీసుకువెళ్ల‌వ‌ద్దు అని చెబుతుంది రోజూ వ‌చ్చి పూజాధి కార్య‌క్ర‌మాలు చేసుకోవ‌చ్చు అని చెబుతుంది… దీంతో ఇంధ్రుడు ఈ వినాయ‌క విగ్ర‌హాన్ని ఇక్క‌డే ఉంచి పూజ‌లు చేసేవాడు.. ఇక ప్ర‌తీ వినాయ‌క చ‌వితికి ఇక్క‌డ పెద్ద ఎత్తున పూజ‌లు జ‌రుగుతాయి ఆ స‌మ‌యంలో వినాయ‌కుడిని పూజించేందుకు ఇంధ్ర‌డు వ‌స్తాడు అని ఇక్క‌డ న‌మ్ముతారు.. చూశారుగా అవిఘ్ననాయ‌కుని విశిష్ట‌త ఈ వీడియోపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.