దేవి నవరాత్రులలో అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలో తెలుసుకోండి

332

నవ అవతారాలను అత్యంత భక్తితో పూజించే పర్వదినాలు శరన్నవరాత్రులు. శక్తిస్వరూపిణి అయిన మాతకు దేవీ భాగవతంలో బ్రహ్మ ,విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తుల కన్నా అధిక ప్రాధాన్యత కల్పించారు.త్రిపురార వ్యాసం’లోని మహాత్మ్యఖంఢం శక్తి ఉపాసనా విశిష్టతను స్పష్టంగా వివరించింది. త్రిపురకు వర్తించే సర్వమంగళ నామం ‘సప్తశతీ, లలితాత్రిశతి, లలితా సహస్రనామాల్లోనూ కనపడుతుంది. ఆమే త్రిపురా రహస్యంలో వర్ణితమైన దుర్గామాత. అలాంటి దుర్గామాతకి జరిపే ఉత్సవాలే దేవీ నవరాత్రులు.అయితే ఈనవరాత్రులు అమ్మవారికి ఏ ఏ రోజు ఏమి నైవేద్యంగా పెట్టాలో మీకు తెలుసా..ఇప్పుడు చెబుతా వినండి.

Image result for devi navaratri

వైదిక సంప్రదాయంలో దేవి త్రిమూర్తుల శక్తిగా చెప్పబడింది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిలుగా కొలువుదీరి ఉంటుంది. మహాకాళిని శత్రునిర్మూలనకు, మహాలక్ష్మీని ఐశ్వర్య-సౌభాగ్య సంపదలకు, సరస్వతిని విద్య విజ్ఞానానికి అధిష్టాన దేవతలుగా భావిస్తారు.అలాంటి అమ్మవారికి పెట్టె నైవేద్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి.ఏ రోజు ఏమి పెట్టాలంటే..

Image result for devi navaratri

మొదటి రోజు- అమ్మవారు శైలపుత్రి అలంకారంలో దర్శనమిస్తుంది. దుర్గాదేవికి నైవేద్యంగా కట్టె పొంగలి సమర్పిస్తారు. ఇక శ్రీశైల సంప్రదాయం ప్రకారం.. కదంబం (సాంబారు అన్నం), మినపవడలు, రవ్వ కేసరి, పానకం.
రెండో రోజు- అమ్మ బాలా త్రిపుర సుందరి అంటే బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది. నైవేద్యంగా పులిహోర సమర్పిస్తారు.
మూడో రోజు- చంద్రఘంటా అంటే గాయత్రీదేవి రూపంలో అలంకరిస్తారు. నైవేద్యంగా కొబ్బరి అన్నం, పాయసం సమర్పించుకుంటారు.
నాలుగో రోజు- అన్నపూర్ణదేవిగా అలంకారంలో భక్తులను అనుగ్రహించే పరా శక్తికి మినప గారెలు, మొక్కజొన్న వడలు కూడా నైవేద్యం పెడతారు.
ఐదో రోజు- లలితా దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తుంది. నైవేద్యంగా దద్ద్యోజనం సమర్పించుకుంటారు.

ఆరో రోజు- మహాలక్ష్మీగా అలంకరిస్తారు. నైవేద్యంగా కేసరి నివేదిస్తారు.
ఏడో రోజు- సరస్వతి రూపంలో జగన్మాత దర్శనమిస్తుంది. నైవేద్యంగా పరమాన్నం, అల్లం గారెలు సమర్పిస్తారు.
ఎనిమిదో రోజు- దుర్గాదేవి రూపంలో అలంకరిస్తారు. నైవేద్యంగా శాకాన్నం లేదా కలగూర పులుసు సమర్పిస్తారు.
తొమ్మిదో రోజు- మహిషాసురమర్దినిగా అమ్మవారిని అలంకరిస్తారు. నైవేద్యంగా రవ్వతో చక్రపొంగలి, చక్కర పొంగల్ సమర్పిస్తారు.
పదో రోజు- శ్రీరాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు. నైవేద్యంగా సేమ్య పాయసం, కొబ్బరి పాయసం, కొబ్బరన్నం, పరమాన్నం సమర్పిస్తారు.

ఇలా పది రోజులు నైవేద్యాలను అమ్మవారికి సమర్పించి మీ కష్టాలు పోయేలా చేసుకోండి.మరి ఏ విషయం గురించి మీరేమంటారు.దసరా గురించి దసరా రోజుల్లో అమ్మవారిని పూజించే విధానము గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.