దుర్గ గుడిలో క్షుద్ర పూజల వల్ల వారికి ఎలాంటి శక్తులు వస్తాయో తెలుసా

963

బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో తాంత్రిక పూజలు జరగడం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మ‌రింది. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దేవస్థానంలో అపచారం జరిగినట్టు తెలుస్తోంది. ప్రవిత్రమైన అమ్మవారి ఆలయంలో తాంత్రిక పూజలు నిర్వహించినట్టు ఆరోపణలు రావడంతో అలజడి రేగింది. ఆలయ కార్యనిర్వహణ అధికారి సూర్యకుమారి ఆధ్వర్యంలో గత నెల 26న అర్ధరాత్రి ఈ తంతు జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో దేవస్థానం పాలక మండలి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించ‌గా, డిసెంబర్‌ 26న అమ్మవారి గర్భాలయం వద్ద అర్చకులు బదులు అపరిచిత వ్యక్తి ఉన్నట్టు గుర్తించారు. అర్ధరాత్రి అమ్మవారిని మహిషాసురమర్దనిగా అలంకరించి మరీ పూజలు నిర్వహించిన‌ట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా పూజ లు జరిగిన రోజు రాత్రి 11 గంటలకు ఆల యానికి సంబంధం లేని వ్యక్తి ఎర్రని దుస్తులు ధరించి అంతరాలయంలో తిరుగుతున్నట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా బయట పడటం సంచలనం సృష్టిస్తోంది.

ఈ క్రింది వీడియో చూడండి.

అయితే డిసెంబర్‌ 26న క్షద్ర పూజలు చేసినట్టుగా సృజన్ అనే వ్యక్తి ఒప్పుకున్నారు. ఆరోజు అమ్మవారిని కాళికామాతగా అలంకరించి పూజలు చేసినట్టు అంగీక‌రించాడు. నారా లోకేష్‌కు శక్తులు వచ్చేందుకు ఈ క్షుద్రపూజలు చేసినట్టు సృజన్ తన బంధువులు, సన్నిహితులతో చెప్పినట్టు స‌మాచారం.

Image result for durgamma temple

సీఎం చంద్రబాబు , రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌కు రాజయోగం దక్కడం కోసం కనకదుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజలు చేశామ‌ని సృజన్‌ కొన్ని రోజులుగా మాతో చెబుతున్నాడని అత‌ని బంధువులు చెప్ప‌డం క‌ల‌క‌లం రేపుతుంది.తాంత్రిక పూజలు జరిగిన రోజు రాత్రి 10 నుంచి 10.30 గంటల మధ్య దేవస్థానం ప్రధాన అర్చకుడు బదరీనాథ్‌ బాబు అమ్మవారిని మహిషాసురమర్దనిగా అలంకరించిన‌ట్లు తెలుస్తోంది.

Image result for durgamma temple

ఇక బయట నుంచి వచ్చిన ఓ అర్చకుడు సుమారు అరగంట సేపు తాంత్రిక పూజలు నిర్వహించాడని తెలుస్తోంది. ఈ పూజలు అనంతరం తిరిగి అమ్మవారిని సాధారణ అలంకారంలోకి మార్చి 11.30 గంటలకు ఆలయాన్ని మూసివేసిన‌ట్లు తెలుస్తోంది

Image result for durgamma temple

ఆ త‌ర్వాత మహిషాసురమర్దని దేవికి నివేదన పెట్టేందుకు ప్రత్యేకంగా కదంబం తయారు చేయించారని సమాచారం. అయితే ఈవో శివ‌కుమారి వాద‌న మాత్రం మ‌రోలా ఉంది. ఆలయాన్ని శుద్ధి చేసేందుకే 11.30 గంటల వరకు తెరిచి ఉంచామని, తాంత్రిక పూజలు ఏమీ జరగ లేదని ఈఓ సూర్యకుమారి చెబుతున్నారు. ఆ రోజు డ్యూటీలో ఉన్న ఆలయ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందిని కూడా విచారిస్తున్నామని తెలిపారు.

Image result for durgamma temple

దుర్గమ్మ ఆలయంలో తాంత్రిక పూజల వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. నారా లోకేశ్‌ కోసమే తాంత్రిక పూజలు చేశామని సృజన్‌ చెప్పడం… ఆ తరువాత అతడు కనిపించకుండా పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సృజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దల వ్యూహం ప్రకారమే వారు నడుచుకుంటున్నట్లు తెలుస్తోంది.