కార్తీక పౌర్ణమి రోజు దీప దానం ఈ సమయంలో చేస్తే వద్దన్నా కోట్లు కోట్లు డబ్బు వస్తూనే ఉంటుంది తప్పక చేయండి

326

అన్ని మాసాల్లో కన్నా కార్తీక మాసం చాలా పవిత్రమైనది. కార్తీక మాసంలో ప్రతి రోజు ప్రవిత్రమైన రోజే. అయితే కార్తీక పౌర్ణమి అంటే మరింత భక్తిశ్రద్ధలు ఉంటాయి.కార్తీక శుద్ధ పౌర్ణమి కార్తీక మాసములో శుక్ల పక్షము నందు పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీకమాసములో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని ”త్రిపురి పూర్ణిమ”, ”దేవ దీపావళి” అని కూడా అంటారు. ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్ళిన మర్నాడు కార్తీకమాసం ప్రారంభమౌతుంది. ఇక ఆరోజు నుండి కార్తీకమాసం ముగిసేవరకూ ప్రతిరోజూ సాయంవేళ దీపాలు వెలిగించి సంరంభం చేస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు.అయితే ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నవంబర్ 22 వ తేదీ వచ్చింది.అయితే ఆరోజు దీపదానము చెయ్యాలనుకేవారు ఏ సమయాన చేస్తే మంచిదో ఇప్పుడు చెబుతా వినండి.

మహాశివరాత్రి తర్వాత శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమి. ఇదే రోజున శివుడు త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసుల్ని సంహరించాడు. అందుకే.. కార్తీక పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు. శివుడు త్రిపురాసురులను చంపడం వలన ఈ రోజు దేవాలయాల్లో జ్వాలా తోరణాలను వెలిగిస్తారు.దీని కోసం ద్వారంలాగా ఉన్న కర్రలకు ఎండు గడ్డి కట్టి దానికి నిప్పు పెడతారు. ఆ జ్వాలా తోరణాలు చూస్తే సమస్త పాపాలు కాలిపోతాయని భక్తుల నమ్మకం. ఇక కార్తీక పౌర్ణమి రోజు చేసే దీపారాధన గురించి తప్పకతెలుసుకోవాలి.మన ఇంట్లో ఏడాది పొడువునా దీపారాధన చెయ్యాలనేది ఆచారం. కానీ ఆ ఆచారాన్ని పాటించి తీరడం సాధ్యం కాకపోవచ్చు.ఇలా దేవుడి ముందు దీపారాధన లేకపోవడం అనేక అశుభాలకు దారితీస్తుంది.అందుకు పరిహారంగా కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా దీపాలు వెలిగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. దేవాలయాల్లోనూ, తులసి కోట దగ్గర కార్తీక దీపాలు వెలిగించాలి. ఏడాదికి 365 రోజులు కాబట్టి 365 వత్తుల దీపాలు వెలిగించాలి.ఇది చాలా మంది పాటిస్తారు.అయితే ఏడాదిలో రాత్రి, పగలు కలుపుకొని 730 వత్తులు వెలిగించేవారు కొందరు. ఈ రోజు దీపాలను వెలిగిస్తే.. ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని నమ్మకం.

కొందరు పౌర్ణమి ముందురోజే నేతిలో ఈ వత్తులను నానబెట్టుకుంటారు.అయితే ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ 22 వ తేదీ వస్తుంది.కార్తీక పౌర్ణమి గడియలు 22 వ తేదీ మధ్యాహ్నం నుంచి 23 వ తేదీ మధ్యాహ్నం వరకు ఉన్నాయి.కాబట్టి 22 వ తేదీ సాయంత్రం సమయంలో దీపదానము చెయ్యడం మంచిది.ఉపవాస దీక్షలో ఉండి ఆ రోజు నోముకున్న వాళ్ళు మరియు దేవుడిని అభిషేకం చేసిన వాళ్ళు దీపదానం చెయ్యాలి.మట్టి ప్రమిదలను దానం చెయ్యడం మంచిది కాదు కాబట్టి బియ్యం పిండితో లేదా గోధుమపిండితో చేసిన ప్రమిదలలో దీపం వెలిగించి దానం చెయ్యడం మంచిది.స్థోమత ఉన్నవాళ్లు వెండి దీపాన్ని దానం చేస్తే మరీమంచిది.జ్వాలా తోరణం కూడా 22 వ తేదీన జరిపించాలి.ఈ దీపదానంకు ఆవు నేతిని లేదా నువ్వుల నూనెను మాత్రమే వాడాలి.ఇలా పౌర్ణమి రోజున దీపదానము చెయ్యాలి.ఇలా చేస్తే మీ సకలపాపాలు పోయి మీకు అదృష్టం వస్తుంది.కాబట్టి అందరు తప్పకుండ దీపదానము చెయ్యండి.