జులై 27 సంపూర్ణ చంద్ర గ్రహణం తెల్లారితే యుగాంతం.. సైంటిస్ట్ ల హెచ్చరిక

488

శాస్త్రీయ కోణంలో భూమి, చంద్రుడు, సూర్యుడు ఈ మూడు ఒకే సరళరేఖపైకి వచ్చే అరుదైన కాలాన్నే గ్రహణం అంటారు. భూమికి ఇరువైపులా సూర్యుడు, చంద్రులు సంచరిస్తుంటారు. వీరి మధ్యలో భూమి ఉంటుంది. ప్రతీ నెల వచ్చే పౌర్ణమీలలో గ్రహణాలు ఏర్పడవు.అప్పుడప్పుడు మాత్రమే మనకు గ్రహణం ఏర్పడుతుంది.అయితే ఈ ఏడాది సంపూర్ణ చంద్ర గ్రహనం ఏర్పడుతుంది.దీనినే ఇప్పుడు మనం బ్లడ్ మూన్ గా పిలుస్తున్నాం.ఈ గ్రహనం రోజు మనకు అంగారక గ్రహం కూడా కనపడనుంది.దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ గ్రహం భూమి దగ్గరకు వస్తుంది.అయితే ఈ గ్రహానం ఉండడం వలన కొన్ని పుకార్లు ప్రపంచం మొత్తం వ్యాపిస్తున్నాయి.మరి ఆ పుకార్లు ఏమిటి.అందులో నిజమేంత్ ఉంది.ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చంద్ర గ్రహణ ప్రభావాలు:

జూలై 27 అర్థరాత్రి 11 గంటల 54 నిమిషాలకు శతాబ్దంలోనే అరుదైన చంద్రగ్రహణం రాబోతోంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. దాదాపు 103 నిమిషాలపాటు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. శనివారం వేకువ జామున 3.49 గంటల వరకు గ్రహణం కొనసాగుతుంది. 4.58 గంటలకు గ్రహణ ప్రభావం పూర్తిగా తొలుగుతుంది.గ్రహగణాలు, వాటి స్థితిగతులను బాగా నమ్మే దేశం మనది. మనుషుల జీవితాలకు, గ్రహాల కదలికలకు సంబంధం వుందని అవే జీవితాల్ని శాసిస్తాయని చెబుతారు. అలాంటి దేశంలో గ్రహణాలపై శ్రద్ధ కాస్త ఎక్కువే.అయితే ఈ గ్రహనం ఉండడంతో ఒక పుకారు అందరిని భయపెడుతుంది.

 చంద్ర గ్రహణం :

అదేమిటి అంటే ఈ గ్రహానం తర్వాత భూమి యుగాంతం ఉంటుంది అని అంటున్నారు.క్రైస్తవ మత ప్రచారకుడు పౌల్ బెగ్లె ఈ గ్రహణం గురించి మాట్లాడుతూ..జులై 27 గ్రహణం తర్వాత భూమి అంతం దిశగా అడుగులు వెయ్యనుంది అని తెలిపారు.బైబిల్ లోని బుక్ అఫ్ రివల్యుషణ్ బుక్ అఫ్ యాక్ట్ లో ఈ విషయాన్నీ ముందే చెప్పారని వేగ్లె తెలిపాడు.దీనికి నిదర్శనంగా వారు కొన్నిటిని చూపిస్తున్నారు.ఈ మద్య జరిగిన భూకంపాలు హరికేన్స్ దీనికి సాక్షాలు అని చెబుతున్నారు.చంద్ర గ్రహానం తర్వాత ఎక్కడో ఒకచోట ప్రళయం జరుగుతుందని తెలిపారు.అయితే ఈ విషయాన్నీ సైంటిస్టులు కొట్టివేస్తున్నారు.2003 లో కూడా ఇలాంటి గ్రహణమే ఏర్పడింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అప్పుడు కూడా అంగారక గ్రహం భూమి దగ్గరకు వచ్చింది.అప్పుడు ఎలాంటి ప్రళయం జరగలేదు.మరి ఇప్పుడు ఎలా జరుగుతుందని సైంటిస్టులు ప్రశ్నిస్తున్నారు.ఈ గ్రహానం వలన ఎలాంటి ముప్పు లేదని సైంటిస్టులు చెబుతున్నారు.విన్నారుగా ఎవరో ఏమో చెప్పారని ప్రళయం యుగాంతం లాంటి విషయాల గురించి అస్సలు పట్టించుకోకండి.మరి ఈ గ్రహనం గురించి అలాగే ఈ గ్రహాన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.