జూలై 27న చంద్ర గ్రహణం రోజు ఒక్కడే కొడుకు ఉన్న వాళ్లు ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసా .?

585

జూలై 27 అర్థరాత్రి 11 గంటల 54 నిమిషాలకు శతాబ్దంలోనే అరుదైన చంద్రగ్రహణం రాబోతోంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. దాదాపు 103 నిమిషాలపాటు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. శనివారం వేకువ జామున 3.49 గంటల వరకు గ్రహణం కొనసాగుతుంది. 4.58 గంటలకు గ్రహణ ప్రభావం పూర్తిగా తొలుగుతుంది.గ్రహగణాలు, వాటి స్థితిగతులను బాగా నమ్మే దేశం మనది. మనుషుల జీవితాలకు, గ్రహాల కదలికలకు సంబంధం వుందని అవే జీవితాల్ని శాసిస్తాయని చెబుతారు. అలాంటి దేశంలో గ్రహణాలపై శ్రద్ధ కాస్త ఎక్కువే.అందుకే ఇప్పుడు మీకొక ముఖ్య విషయం గురించి చెప్పబోతున్నాను.అదేమిటి అంటే మీకు కనుక పెళ్లై ఒక కొడుకు ఉంటె మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల అంటూ కొన్ని విషయాలు బయట ప్రచారం జరుగుతుంది.ఆ విషయం గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.విని తెలుసుకోండి.

ఈ చంద్ర గ్రహణ ప్రభావం కొన్ని రాశి చక్రాల మీద అధికంగా ఉండనుందని తెలుస్తోంది. ముఖ్యంగా మేష రాశి, సింహ రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారు సానుకూల ఫలితాలను పొందుతుండగా మకర రాశి, మిధున రాశి, కన్యా రాశి, ధనుస్సు రాశుల వారు ప్రతికూల ప్రభావాలను పొందే అవకాశాలున్నాయి. మరియు కుంభ రాశి, తులా రాశి, కర్కాటక రాశి, వృషభ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

ముఖ్యంగా శతాబ్దంలోని అత్యంత పొడవైన చంద్ర గ్రహణం రోజున, పెళ్లి కాని వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆరోజున అందంగా కనిపించే చంద్రుడు పెళ్లి కాని వారికి ప్రతికూల ప్రభావాలను కలుగచేస్తాడని, క్రమంగా మానసిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని ముఖ్యంగా వారి వారి సంబంధాల మీద మరియు పెళ్లి జరిగే అంశాల మీద ఉండనుందని హెచ్చరిస్తున్నారు.అలాగే పెళ్లై ఒక కొడుకు ఉన్న వారు బట్టలు పెట్టాలని అలాగే కొబ్బరి కాయలు కొట్టాలని,ఎంతమంది కొడుకులు ఉంటె అన్ని కొబ్బరి కాయలు కొట్టాలని లేకుంటే దోషం వస్తుందని చాలా మంది అంటున్నారు.

అయితే వాటిని నమ్మవలసిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు.మీకిష్టం ఉంటె చెయ్యవచ్చు లేకుంటే చెయ్యాల్సిన అవసరం లేదు.కానీ అలా చెయ్యాలని శాస్త్రంలో లేదు.కాబట్టి వీటిని పట్టించుకోకండి.అయితే కొడుకులు ఉన్న వారు అయినా సరే లేని వారు అయినా సరే తెల్లని బియ్యని దానం చెయ్యడం మంచిది.ముఖ్యంగా కొడుకులు కావాలనుకునే వారు ఈ విధంగా దానం చేస్తే వారి కోరిక తీరుతుంది.ముఖ్యంగా గోమాతను పూజించి దానికి ఆహారంగా పెడితే ఇంకా సకల సౌలభ్యం కలుగుతుంది.కాబట్టి ఈ యొక్క పనిని చేసి మీ కోరికలను తీర్చుకోండి.మరి మేము ఇచ్చిన ఈ సమాచారం గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.