బ్రిటిష్ వాళ్లకి చుక్కలుచూపించిన హిందూదేవుడి విగ్రహం ఎక్కడఉందొ తెలుసా..

909

బ్రిటిష్ వాళ్ళు ఎన్నో ఏళ్ళు మనల్ని పాలించి మన సంపద దొంగలించి మనల్ని ఎన్నో చిత్ర హింసలకు గురిచేశారని మనకు తెలుసు.ఎంతో మంది కృషి చేస్తే గానీ మనకు వాళ్ళ నుంచి స్వాతంత్రం రాలేదు.అయితే మీకొక విషయం తెలుసా..మనకు చుక్కల్ని చూపించిన బ్రిటిష్ వాళ్ళకు కూడా చుక్కలు కనపడేలా చేశాడు ఒక హిందుదేవుడు.ఏం చేసి వాళ్ళకు చుక్కలు చూపించాడని అనుకుంటున్నారు కదా..పూర్తీగా చెబుతా వినండి..
Related image
తమిళనాడులోని తిరుచెందూర్ లో కొలువై ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది.తమిళనాడులో ఉన్న ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఇది ఒకటి. అయితే ఇక్కడ స్వామివారు ఓ చిన్నబాలుడి రూపంలో దర్శనమిస్తారు. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే మిగిలిన ఐదు సుబ్రహ్మణ్య క్షేత్రాలు కొండలపై కొలువుంటే తిరుచెందూర్ లో మాత్రం సముద్ర తీరంలో దర్శనమిస్తుంది. దీన్నే మురుగన్ ఆలయం అని కూడా పిలుస్తారు.ఈ ఆలయంపై 1646 ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ సేనలు దాడిచేశాయి.అప్పట్లో భారత్ పై ఆధిపత్యానికి పోర్చుగీసు, డచ్, బ్రిటీష్ వాళ్ల మధ్య పోరాటాలు సాగుతుండేవి. దాంతో ప్రత్యర్థులతో యుద్ధానికి అవసరమైన మందుగుండు సామగ్రిని ఈస్ట్ ఇండియా సైన్యం ఈ ఆలయంలోనే భద్రపరిచేది. అయితే తమకు ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రంలో తెల్లవాళ్లు తిష్ట వేయడాన్ని స్థానికులు భరించలేకపోయారు.

Related image

దాంతో వారిపై దాడులకు దిగేవారు. ఇతర సంస్థానాధీశులు కూడా తమకు సాధ్యమైన రీతిలో ఒత్తిడికి గురిచేసేవాళ్లు. దాంతో కొన్నాళ్లకు అక్కడినుంచి ఈస్ట్ ఇండియా సేనలు నిష్క్రమించాయి. కానీ వెళుతూవెళుతూ తిరుచెందూర్ ఆలయంలో ఉన్న మూల విరాట్టును కూడా తమతో తీసుకుపోయాయి.అయితే ఓడలో స్వామివారి విగ్రహాన్ని ఎక్కించే సమయంలో ఆకాశం అంతా నిర్మలంగా మిలమిల లాడుతూ ఎండ కాసింది.

సముద్రంలో సగందూరం వెళ్లే వరకు ఆ ఎండ అలాగే ఉంది. కానీ ఉన్నట్టుండి సముద్ర గర్భం పెను అలలతో తుపాను వాతావరణాన్ని తలపించింది. ఆకాశం కూడా అప్పటికప్పుడు మబ్బులు పట్టి చిల్లులు పడినట్టు కుంభవృష్టిగా వర్షం కురవడం ప్రారంభించింది. దాంతో భయపడిపోయిన ఆ ఓడ కెప్టెన్ స్వామివారి విగ్రహాన్ని సముద్రంలో వదిలేశాడు.ఎప్పుడైతే విగ్రహం ఆ ఓడలోంచి సముద్ర గర్భంలోకి జారుకుందో తుపాను చేత్తో తీసేసినట్టు ఆగిపోయింది. ఈ ఘటన జరిగిన చాన్నాళ్ల తర్వాత ఓ వ్యక్తికి స్వామివారు కలలో కనిపించి తాను సముద్రంలో ఉన్న ప్రదేశం గురించి చెప్పాడట. దాంతో ఆ వ్యక్తి స్థానికులతో కలిసి స్వామివారు చెప్పిన చోట వెదకగా మూల విరాట్టు విగ్రహం లభ్యమైందట. ఎంతో కష్టపడి ఆ విగ్రహాన్ని తిరిగి తిరుచెందూర్ చేర్చి ఆలయంలో పునఃప్రతిష్ఠాపన చేశారట.విన్నారుగా తన స్థలం నుంచి తనను తీసేశాడని ఆ దేవుడు వాళ్ళతో ఎలా ఆడుకున్నాడో.మరి ఇదంతా ఆ దేవుడి మహిమ వలనే జరిగిందా..లేక ప్రకృతిలో బాగంగా జరిగిందా.మీరేమనుకుంటున్నారు.అలాగే బ్రిటిష్ వాళ్ళకు చుక్కలు చూపించిన సుబ్రహ్మణ్య స్వామీ మహిమ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

పవన్ దూకుడు…జనసేన లోకి లోక్ సత్తా నేతలు