మహాద్భుతం వెంకటేశ్వర స్వామి పాదాల వద్దకు గరుడపక్షి

362

దేవుడు ఉన్నాడా లేడా… ఇది అంతుచిక్కని ప్రశ్న.కొంతమంది ఉంది అని అంటే కొంతమంది లేడు అని అంటారు. ఎవరు ఏం చెప్పిన అప్పుడప్పుడు జరిగే కొన్ని ఘటనలు దేవుడు ఉన్నాడని చెప్తే వాటి వెనుక సైన్స్ ఉందని కొందరు చెప్తారు. జరిగిన ప్రతి ఘటనకు సైన్స్ ప్రకారం సాక్షాలు చూపుతూ దేవుడు లేడని చెప్తారు. ఇక మన పురాణాలలోకి ఒకసారి తొంగిచూస్తే శివుడికి పాము గణేశుడికి ఎలుకమహా విష్ణువుకు గరుడపక్షి… ఇలా చెప్పుకుంటూపోతే ప్రతి దేవుడికి ఒక వాహనం ఉంది. అయితే ఆ పక్షులు జంతువులూ దేవుడి గుడిలోకి వచ్చి సేదతీరితే చాలు దేవుడి కోసమే వచ్చాయని వాటికి పూజలు చేసే భక్తులు ఉన్నారు. ఇప్పుడు అలంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. వేంకటేశ్వరస్వామి పాదాల వద్దకు ఒక గరుడపక్షి వచ్చి చేరింది. మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Related image

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విచిత్ర సంఘటన జరిగింది. స్వామి వారి వాహనమైన గరుడపక్షి సాక్షాత్తు స్వామివారి విగ్రహం వద్దకు వచ్చి వాలిందంటూ భక్తులు పూజలు చేశారు. ఆలయ గోపురం పైన ఉన్న గరుడ పక్షి లోపలికి వచ్చందని భక్తులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు భారీగా ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. స్వామివారి పాదాల చెంత వాలిని గరుడ పక్షిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఆలయ అర్చకులు సైతం స్వామివారితో పాటు గరుడపక్షికి కూడా పూజలు నిర్వహిస్తున్నారు. ఇది స్వామివారి మహత్యమేనంటూ అర్చకులు చెబుతున్నారు. గరుడ పక్షి ఆలయంలో ప్రత్యక్షమవ్వడంతో …సాక్షాత్తు ఆ స్వామిని చూసినట్లు ఉందని భక్తులకు మోక్షం కలుగుతుందని అర్చకులు అంటున్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో కూడా గరుడ సేవకు ఎంతో ప్రాధాన్యత. గరుడపక్షికి, స్వామివారికి విడదీయరాని అనుబంధముంది.అందుకే స్వామివారి గరుడ సేవకు కూడా విశేష ప్రాముఖ్యత ఉంటుంది. గరుడ వాహనంపై ఊరేగిన స్వామివారిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తుంటారు.

Image result for మహాద్భుతం వెంకటేశ్వర స్వామి పాదాల వద్దకు గరుడపక్షి

అయితే స్వామివారి పాదాల చెంత వాలింది గరుడ పక్షి కాదని అది గుడ్ల గూబ అని మరికొందరు చెబుతున్నారు. ఈ గుడ్లగూబను ‘బర్న్ అవుల్’ అంటారని చెప్పారు. ఈ పక్షి రాత్రుల్లో తప్ప పగటి సమయంలో సంచరించదని ఆయన వివరించారు. పగటి వేళ ఏ మాత్రం కదలదు. మీరు దాన్ని పట్టుకొచ్చి ఎక్కడ నిలబెడితే అక్కడే ఉంటుంది. దీన్ని గరుడ పక్షి లేదా గద్ద అనడం సరికాదు” అని రామానుజం వివరించారు.ఈ పక్షి ఆలయంలోకి ఎందుకు వచ్చి ఉంటుందన్న ప్రశ్నకు రామానుజం సమాధానమిస్తూ- అది పెద్ద పక్షి కాదని, ఇప్పుడే ఎగరడం నేర్చుకుంటున్న చిన్న పిల్ల కావొచ్చని తెలిపారు.

 

ఆలయ సమీపంలో ఈ గుడ్లగూబల గూడును ఎవరైనా కదిపితే అది గుడిలో వచ్చి వాలి ఉంటుందని, ఇప్పుడు పగలు కావడంతో ఎక్కడకూ పోవడం లేదని ఆయన ఆదివారం మధ్యాహ్నం చెప్పారు.ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చందమామపై సాయి ముఖం కనిపిస్తున్న ఫొటో వైరల్ అయింది. ఆరా తీస్తే.. అది ఫొటో షాప్డ్ ఇమేజ్ అని తేలింది.అంతేకానీ దేవుడు ఉన్నాడనడానికి ఇలాంటి ఘటనలను సాకుగా చెప్తున్నారు కొందరు అని రామానుజం చెప్పారు. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. అది గరుడపక్షినా లేక గుడ్లగూబనా..ఈ మొత్తం వ్యవహారం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.