రాళ్లగుట్ట రాత్రికి రాత్రే గుడిగా మారిపోయింది, ఈ ఆలయ చరిత్ర చుస్తే ఆశ్చర్యపోతారు

934

గుట్టమీద గుడి కట్టడం సాధారణమే.కాని గుట్టనే గుడిగా మలచడం విచిత్రం. అందులోనూ గుట్టలో భాగమైన రాతినే చెక్కి దేవతావిగ్రహాలను తీర్చిదిద్దడం,దాని నుంచి వెలువడిన రాళ్లనే పేర్చి గుడిని నిర్మించటం ఇంకా అధ్బుతం.దేశంలోనే ప్రత్యేక తరహాలో రూపుదిద్దుకున్న ఈ గుడి కొత్తగా కనుగోన్నదేమీ కాదు.వందలఏళ్లుగా ఉన్న ఈ ఆలయం నిర్మాణంలో ప్రత్యేకత తాజాగా వెలుగులోనికొచ్చింది.మరి వెలుగులోకి వచ్చిన ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for stones in temples

తెలంగాణా రాష్టం భూపాల్ పల్లిజిల్లా చిట్యాల్ మండలం నైన్పాక్ గ్రామశివర్లోని గుట్టమీద వున్న సర్వతోబధ్ర ఆలయం ఉంది.సాధారణంగా ఆలయాల నిర్మాణంలో గర్భాలయాన్ని దానికి ఆనుకొని మంటపాన్ని నిర్మిస్తారు. తర్వాత చుట్టూ గోడతో ఆలయ ఆవరణను ఏర్పాటుచేస్తారు.ఎక్కడో రూపొందించిన విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టాపన చేస్తారు.కాని ఈ ఆలయం దీనికి భిన్నంగా వుంటుంది. గుట్టపై మధ్య భాగంలో ఆలయం వుంటుంది.ఇది కేవలం గర్భాలయం మాత్రమే.దానికే 4వైపులా ఐదున్నర అడుగుల ఎత్తులో ద్వారాలు వుంటాయి. లోపల మధ్యలో నాలుగున్నర అడుగుల ఎత్తుతో విగ్రహం వుంటుంది.ఒకే రాతిపై నాలుగున్నర అడుగుల ఎత్తులో దేవతావిగ్రహాలను చెక్కారు. ఒక్కో ద్వారం నుంచి ఒక్కో వైపున దేవతావిగ్రహాలు కనిపిస్తూవుంటాయి.

Image result for stones in temples

తూర్పు ద్వారం నుంచి ఉగ్రనరసింహస్వామి, దక్షిణద్వారం నుంచి కాళియా మర్దనం భంగిమలో వేణుగోపాల స్వామి,పశ్చిమం వైపున బలరాముడు,వుత్తరభాగంలో సీతారామలక్ష్మణరూపాలు దర్శనమిస్తాయి.దీనిని సర్వతోభద్ర నమూనా ఆలయంగా పిలుచుకుంటారు. సర్వతోభద్రఆలయంలోని విగ్రహాలు మామూలుగా ప్రతిష్టించినవిగానే భావించారు.కానీ కొద్దిరోజుల క్రితం పర్యటనకు వచ్చిన అమెరికన్ ప్రొఫెసర్ ఫిలిప్ బి వ్యాగనర్. పురావస్తుశాఖ రిటైర్ అధికారి రంగాచార్యులతో కలిసి ఈ ఆలయాన్ని పరిశీలించి దాని ప్రత్యేకతను గుర్తించారు.ఆ విగ్రహం ఎక్కడినుండో తెచ్చి ప్రతిష్టించినది కాదని ఆలయం నిలిచివున్న గుట్టభాగాన్నే విగ్రహంగా మలచి వున్నారని తేల్చారు.

Image result for stones in temples

అంటే ఆ గుడి మొత్తం ఒక రాయి అని అర్థం.ఒక విగ్రహం రాతినే సమంగా చెక్కి బల్లపరుపుగా మార్చారు. ఇలా చెక్కగా వచ్చిన రాళ్ళతోనే ఆ విగ్రహంచుట్టూ దాదాపు 25అడుగుల ఎత్తులో గర్భాలయాన్ని నిర్మించారు. తర్వాత దానిపై మరో 30అడుగుల ఎత్తులో ఇటుకులతో గోపురం నిర్మించారు.ఆలయం వుండేది అంతే మండపం అంటూ ఏమీ లేదు.ముందు వైపు విశాలమైన కోనేరును నిర్మించారు. ఇలా గుట్టరాతిలోనే విగ్రహం చెక్కివున్న దేవాలయం ఇప్పటివరకూ రికార్డుకాలేదని పురావస్తుఅధికారులు చెప్తున్నారు.ఇది వైష్ణవ సాంప్రదాయ సర్వతోభద్ర ఆలయంకావటంతో కాకతీయుల కాలం తర్వాత నిర్మించివుంటారని భావిస్తున్నారు.

రాళ్లగుట్ట రాత్రికి రాత్రే గుడిగా మారిపోయింది, ఈ అలయ చరిత్ర చుస్తే ఆశ్చర్యపోతారు

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక్కడి కోనేరు మట్టితో పూడుకుపోయి వుంది.దానిని తవ్వి పరిశీలిస్తే ఆధారాలు దొరకవచ్చని అంటున్నారు.తాజాగా అమెరికన్ ప్రొఫెసర్ ఈ ఆలయాన్ని తాజాగా ఈ ఆలయప్రత్యేకతను గుర్తించిన నేపథ్యంలో దీనిపై కేంద్రపురావస్తు శాఖ ఆసక్తిప్రదర్శిస్తోంది. ఇంజనీరింగ్ నైపుణ్యంపరంగా ఇదోగొప్ప కట్టడం. దీనిని భావితరాలకు అందించాల్సిన అవసరం వుందని అమెరికన్ ప్రొఫెసర్ ఫిలిప్ బి.వ్యాగనర్ తెలిపారు.విన్నారుగా గుట్టనే గుడిగా మారిన విషయం గురించి.మరీ ఈ గుడి గురించి అలాగే ఇలాంటి వింత గుళ్ళ గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.