శ్రావణమాసంలో ఇలా చేస్తే మీ ఇంట ఉన్న దోషాలు చెడు తొల‌గిపోతుంది

473

సౌరమానం ప్రకారం హిందూ కేలండర్‌ను అనుసరించి శ్రావణం ఐదో నెలగా చెబుతారు. ఈ మాసం ఏంతో పవిత్రమైంది. ఆధ్యాత్మికంగా విశిష్టత కలిగిన మాసం శ్రావణం.. ఈ నెల‌లో శివారాధన కూడా శ్రేష్ఠమైంది. ఈ నెలలోనూ సూర్యుడు సింహ రాశిలో ప్రవేశిస్తాడు…హిందువులు ఎంతో పవిత్రంగా ఈ నెలలో వ్రతాలు, నోములు, పూజలు నిర్వహిస్తారు… శ్రావణ సోమవారం వ్రతం సందర్భంగా ఉపవాస దీక్షలు చేపడతారు. మంగళవారం మంగళ గౌరీ వ్రతానికి కూడా విశిష్టత ఉంది.

Related image

శ్రావణం శివుని ఆరాధనకు అనుకూలమైంది. శివుని పూజించడం వల్ల వివాహంలో ఏర్పడిన ఆటంకాలు తొలగి, చేపట్టిన పనిలో విజయం లభిస్తుందని వేదాలు, పురాణాలు పేర్కొన్నాయి….శివపార్వతుల అనుగ్రహం శ్రావణంలో భక్తులకు లభిస్తుంది. భక్తులు తమ తప్పులను మన్నించమని మనస్ఫూర్తిగా వేడుకుంటే జీవితంలో ఎదురయ్యే కష్టాల నుంచి బయటపడతారు… ప్రతికూల వాతావరణం కూడా అనుకూలంగా మారుతుంది.. అదృష్టం కలిసి వస్తుంది.సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి.. శివాలయాలను దర్శించాలి. పాలు, జలంతో శివుడికి అభిషేకం చేసి ఓ నమఃశివాయ పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

శ్రావణ మాసంలో సిద్ధ ప్రద శివలింగాన్ని ఇంట్లో ఉంచి అభిషేకం చేయాలి. చన్నీటితో శుద్ధిచేసి పాలతో అభిషేకించాలి. బిల్వ పత్రాలు, విభూది సమర్పించాలి…దగ్గర్లోని చెరువులు, నదులకు వెళ్లి చేపలకు ఆహారం వేయాలి… గోధుమ పిండితో తయారుచేసిన ఆహారం వాటికి తినిపిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. చేపలకు ఆహారం ఇవ్వడమంటే శివుడికి అందించినట్టే.మహామృత్యుంజయ జపం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. రోజూ 108 సార్లు జపించాలి. మహామృత్యుంజయ హోమం కూడా శ్రావణ సోమవారం నాడు నిర్వహిస్తే మంచి ఫలితం ఉంటుంది… అలాగే వైవాహిక జీవితంలో సమస్యలు, పెళ్లికి ఆటంకాలను ఎదుర్కొంటే కుంకుమపువ్వు కలిపిన పాలతో శివుడికి అభిషేకం చేయాలి. శివపార్వతుల అనుగ్రహం పొంది వ్యక్తిగత బంధాల్లో ఏర్పడిన అడ్డంకులు కూడా తొలగిపోతాయి.

Related image

ఇంట్లో మానసిక ప్రశాంతత, ఐశ్వర్యం ప్రాప్తించాలంటే రోజూ పేదలకు అన్నదానం చేయాలి. దీని వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది.21 బిల్వ పత్రాలపై చందనంతో ఓం నమఃశివాయ అని రాసి శివలింగానికి అభిషేకం చేస్తే మనసులోని కోరికలు నెరవేరతాయి… శ్రావణంలో రోజూ గోమూత్రంతో ఇంటిలో శుద్ధి చేస్తే అనుగ్రహంతోపాటు విజయం దక్కుతుంది…శ్రావణ సోమవారం రోజున శివుడికి రుద్రాభిషేకం లేదా అభిషేకం చేయడం వల్ల కుజదోష ప్రభావం తగ్గిపోతుంది..మాంసాహారం, మద్యానికి దూరంగా ఉండాలి. ఈ నెల రోజులు శాకాహారం తీసుకోవాలి.శ్రావణంలో పాములను చంపితే దోషం చుట్టుకుంటుంది. పాములను శివుడికి ప్రియమైనవిగా భావిస్తారు.. ఇలాంటి పుణ్య‌కార్యాలు చేసి మ‌రింత ఈ శ్రావ‌ణ‌మాసంలో కిర్తిన పుణ్యాన్ని పొందండి.. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.