గడపపై తలపెట్టి పడుకుంటే…ఏం జరుగుతుందో తెలుసా.?

514

మన హిందు సంప్రదాయాలలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి.ఒక్కో ఆచారానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది.అయితే ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఖచ్చితంగా ఉంటుంది.ఇంట్లో ప్రతి గదికి ఒక గడప ఉంటుంది.అయితే మీకు గడప విశేషాలు తెలుసా.కొంతమంది గడప మీద తల పెట్టి పడుకుంటారు.మరికొందరు గడప మీద కాళ్ళు పెట్టి నిల్చుంటారు.అయితే ఇలా చెయ్యడం ఎంతవరకు కరెక్ట్.ఇలా చేస్తే ఏం జరుగుతుంది.ఆ విషయాలు ఇప్పుడు చెబుతా వినండి..

పూర్వం ఒక గ్రామంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయో చెప్పే సందర్భాల్లో ఇన్ని గడపలు ఉన్నాయని లెక్క తేల్చే వాళ్లు. అలాగే ఎవరైనా పేరంటానికి పిలవడానికి వచ్చినప్పుడు ఆ ఇంటి ఇల్లాలు లేకపోతే గడపకి బొట్టు పెట్టేసి వెళుతుంటారు. దీనిని బట్టి గడపకి ఎంతటి ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. గడపని శుభ్రంగా ఉంచుకోవాలి.ఇంట్లో ఏ గదికి, ఆగదికి గడప లేకపోతే… వంట గదికి, పడక గదికి, దేవుడి గదికి తేడా ఉండదు.

ఇంట్లో ప్రధాన గడపకు వారానికి ఒక్కసారి అయినా పసుపు రాసి బొట్టు పెడితే పట్టిందల్లా బంగారమే అని అంటారు. కనీసం పండుగల సమయంలో అయినా గడపకు పసుపు రాసి బొట్టు పెట్టాలి.అలాంటి గడపపై కూర్చున్నా, నుంచున్నా, దానిపై తలపెట్టి పడుకున్నా పెద్దలు తీవ్రమైన అసహానాన్ని వ్యక్తం చేస్తుంటారు. మరోసారి అలా చేయకూడదని మందలిస్తుంటారు. గడపకి అంతటి ప్రాముఖ్యతను ఇవ్వడానికి గల కారణమేమిటో ఈ కాలం పిల్లల్లో చాలామందికి తెలియదు. అందువలనే కొంతమంది గడప మీద కూర్చుని ఇతరులతో కబుర్లు చెబుతుంటారు.

కొంతమంది గడపను దాటకుండా దానిపై కాలుపెట్టి వెళుతుంటారు. ఒక్కోసారి అలా దానిపై నుంచుంటారు. ఇక మరి కొంతమంది గడపపై తలపెట్టి పడుకుని పుస్తకాలు చదువుతూ ఉంటారు. అవసరమైతే అలాగే పడుకుంటారు. ఈ పద్ధతి ఎంతమాత్రం మంచిది కాదని శాస్త్రం చెబుతోంది.గడప శ్రీమన్నారాయణుడి స్థానం. నరసింహస్వామిగా ఆయన అక్కడ కూర్చునే హిరణ్యకశిపుడిని వధించడం జరిగింది.నారాయణుడు ఎక్కడ ఉంటాడో అక్కడే లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది. అందువలన గడప లక్ష్మీదేవి స్థానంగా కూడా చెప్పబడుతోంది. ఈ కారణంగానే గడపను పసుపు కుంకుమలతో అలంకరిస్తుంటారు.లక్ష్మీదేవితో సమానం కాబట్టి తల పెట్టడం కాళ్ళు పెట్టడం లాంటి పిచ్చి పనులు చెయ్యకండి.మరి మేము ఇచ్చిన ఈ సమాచారం గురించి అలాగే గడప యొక్క విశిష్టత మరియు గడపను పుజిస్తే ఎలాంటి లాభాలు ఉన్నాయో అందరికి తెలిసేలా కామెంట్స్ రాసి అందరికి తెలిసేలా చేయండి.