కర్ణుడు ద్రౌపది ల రహస్య ప్రేమకథ గురించి తెలిస్తే షాక్ అవుతారు

1007

ప్రేమించిన వ్యక్తి దూరమైనా, వేరొకరితో వివాహానికి అంగీకరించినా ఆ బాధను మాటల్లో వర్ణించలేం. అయితే ప్రస్తుత కాలంలో ఇవన్నీ సహజం. మహాభారతంలో కర్ణుడికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తన విఫల ప్రేమను కర్ణుడు జీవితాంతం మరచిపోలేకపోయాడు. ఈ వీరుడి ప్రేమించిన స్త్రీ ఓ సామాన్యురాలు కాదు. మహాభారత యుద్ధానికి పరోక్షంగా కారణమైన ద్రౌపది. స్వయంవరం సమయంలోనే కర్ణుడి ప్రేమకథ మొదలైంది.కర్ణుడు ద్రౌపది ప్రేమించుకున్నారు.అయినా కానీ ఇద్దరికీ పెళ్లి జరగలేదు.అసలు వారి ప్రేమకథ ఏమిటి.వారు ఎందుకు పెళ్లి చేసుకోలేదు.ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for కర్ణుడు ద్రౌపది

కర్ణుడికి మహాభారతంలో ఎంతో ప్రాముఖ్యం ఉంది. వసుషేణుడనేదే అతని పేరు. కర్ణుడు కుంతి కుమారుడైనా ఆమె, పాండురాజుకి భార్య కాకముందు ఇతను పుట్టాడు. కొడుకు కనక కవచ కుండలాలతో వెలిగిపోతూ పుట్టినా, భయంకొద్దీ అతన్ని పెట్టెలో పెట్టి, నీళ్లల్లో విడిచిపెట్టింది. ఆమె అలా చేయడాన్ని చాలా మంది తప్పు పట్టారు గానీ కర్ణుడి పుట్టుకకు కారణమైన అతని కర్మను వాళ్లు పట్టించుకోలేదు.దేవత పుత్రుడు కావడంతో నీళ్లలో వదిలేసిన కర్ణుడు బతుకుతాడు. అలా నీళ్లలో వెళ్తున్న కర్ణుడిని అధీరత అనే రథసారధి చూస్తాడు.అతను ఆ బాలుడిని నదినుంచి బయటకు తీసి ఇంటికి తీసుకెళ్తాడు.ఆ దంపతులు ఆ బాలుడ్ని కొడుకుల పెంచుకుంటారు.పెరిగి పెద్దయ్యాకా కర్ణుడు గొప్ప ధనుర్విద్యా పారంగతుడు అవుతాడు. ప్రతి సంవత్సరం వివిధ రాజ్యాలలో నిర్వహించే కార్యక్రమాలలో తన ధనుర్విద్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు కర్ణుడు.ఎక్కడికి వెళ్లిన అందరిని ఆకర్షించే కర్ణుడు ఒకసారి ద్రుపద రాజ్యానికి వెళ్తాడు.తన విద్యను చూసి రాజు కూతురు ద్రౌపది కర్ణుడిని ఇష్టపడుతుంది. కర్ణుడు కూడా ద్రౌపదిని ప్రేమిస్తాడు. వివాహం చేసుకోవాలని అనుకుంటారు వీరిద్దరూ.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మహారాజు ప్రకటించే స్వయంవరం కోసం ఎదురుచూశారు. తన నైపుణ్యం మీద నమ్మకం ఉన్న కర్ణుడు స్వయంవరంలో గెలిచి వివాహం చేసుకుంటా అని అనుకుంటాడు. కింద నూనెలో చూస్తూ పైనా ఉన్న చేప కళ్ళలో బాణాన్ని వదలడం ఆనాటి స్వయంవరంలో పరీక్షా. ఇది కర్ణుడికి సులభతరమైనదే. ఇక తాను విజయం సాధించినట్టే అనుకుని ఆనందపడ్డ కర్ణుడికి స్వయంవర నియమాల రూపంలో నిరాశే ఎదురైంది. కేవలం రాజకుమారుడు క్షత్రియులే స్వయంవరానికి హాజరు కావాలనే నియమం వలన కర్ణుడికి స్వయంవరానికి ప్రవేశం లభించలేదు.ఆ తర్వాత అర్జునుడూ స్వయంవరానికి వెళ్లడం గెలవడం పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి. ఇక చేసేదేమి లేక ద్రౌపది కర్ణుడు తమ విది అనుసారం సాగిపోయారు.ఇలా కర్ణుడి ద్రౌపది ప్రేమకథ విషాదంతో నిండి ఉంది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.కర్ణుడి ద్రౌపది ప్రేమకథ గురించి అలాగే మహాభారతం గురించి అందులో మనకు చెప్పబడిన నీతినియమాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.