జులై 27 చంద్ర గ్రహణం రోజున అన్నంతో ఇలా చేసి కుబేరులు అవ్వండి ఈ అవకాశం అస్సలు వదలొద్దు

773

శాస్త్రీయ కోణంలో భూమి, చంద్రుడు, సూర్యుడు ఈ మూడు ఒకే సరళరేఖపైకి వచ్చే అరుదైన కాలాన్నే గ్రహణం అంటారు. భూమికి ఇరువైపులా సూర్యుడు, చంద్రులు సంచరిస్తుంటారు. వీరి మధ్యలో భూమి ఉంటుంది. ప్రతీ నెల వచ్చే పౌర్ణమీలలో గ్రహణాలు ఏర్పడవు.అప్పుడప్పుడు మాత్రమే మనకు గ్రహణం ఏర్పడుతుంది.మనకు జులై 27 వ తేది శుక్రవారం రాత్రి 11.54 గంటల నుంచి శనివారం తెల్లవారు జామున 3.49 గంటల వరకు గ్రహణ గడియలు ఉంటాయన్నారు.అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహనం రోజు ఏ ఏ దానాలు చేస్తే మంచిదో తెలుసుకుందాం…

Image result for chandra grahan

గ్రహణంరోజు ఏమి దానం చెయ్యాలి? ఏమి దానం చేస్తే వేలరెట్లు పుణ్యఫలితాలను పొందుతామో తెలుసుకుని దానం చెయ్యాలి. ఇది చంద్రగ్రహణం కావున తెలుపు వర్ణానికి సంబంధించిన వస్తువులను దానం చెయ్యాలి. ఆరోజు ప్రతీ ఒక్కరూ అన్న దానం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే అన్నం తెలుపు వర్ణంలో ఉంటుంది. మనిషిని తృప్తి పరిచే దానంలో అన్నదానం చాల మంచి దానం. ఇతర ఏ వస్తువులు దానం చేసినా ఇంకా కావలి అనిపిస్తుంది. అందుకే చంద్రగ్రహణం రోజు ఒక్క మనిషికైనా కడుపు నిండా భోజనం పెడితే సర్వ దోషాలు తొలగి మేలు జరుగుతుంది.

Image result for chandra grahan

అలాగే తెలుపు రంగు వస్తువులను దానం చెయ్యడం మంచిది. బుధగ్రహం లో గ్రహణం ఏర్పడుతుంది కనుక ఆకుపచ్చ రంగులో ఉన్నవి దానం చేస్తే మంచిది. అలాగే వెండి చంద్రుడు ని తయారు చేయించి, లేదా కొని దానం చేస్తే చాలా మంచిది. అలాగే బియ్యం బ్రాహ్మణులకు దానం చేస్తే చాలా మంచిది.అలాగే తెల్లని బట్టను బ్రాహ్మణులకు దానం చేస్తే చాలా మంచిది.గ్రహణం సమయంలో దానం చేస్తే ఇంకా మంచిది.గ్రహణ సమయంలో దానం చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి.ఆ రోజు కుదరని వాళ్ళు మరుసటి రోజు ఉదయానే లేచి స్నానం ఆచరించి ఏమి తినకుండా పరకడుపునే గుడికి వెళ్లి అక్కడ ఉండే బ్రాహ్మణులకు ఇప్పుడు నేను చెప్పిన వాటిని దానం చేసిన మంచే జరుగుతుంది.

అలాగే ఒక సంచిలో బియ్యం మరొక సంచిలో ఉలవలు పెట్టి మూట కట్టి వాటి మీద రెండు తమలపాకులు పెట్టి ఇంకా మీకు వీలైతే ఒక దాని మీద వెండి చంద్ర బింబం మరియు వెండి నాగ ప్రతిమ పెట్టి తోటకూర కూడా పెట్టి దానం చేస్తే మీకు శుభ పరిణామాలు కలుగుతాయి.చంద్ర బింబం ఏమో చంద్రుడికి నాగ ప్రతిమ ఏమో కేతువు కోసం ఇలా పెట్టి దానం చెయ్యాలి.విన్నారుగా చంద్రగ్రహానం రోజు ఈ విదంగా దానం చేసి మీ కష్టాలను తీర్చుకోండి.మరి మేము ఇచ్చిన ఈ సమాచారం గురించి అలాగే రేపు వచ్చే ఈ చంద్ర గ్రహణం గురించి ఏమైనా సందేహాలు ఉన్నా లేక ఏమైనా తెలుసుకోవాలని ఉన్నా మాకు కామెంట్ రూపంలో చెప్పండి.