అయ్యప్ప స్వాములకు ఒక్కరోజు అయినా ఇలా చేస్తే అన్నింటా విజయం

351

మీరు ఏ పని మొదలుపెట్టిన సక్సెస్ కావడం లేదా… అనుకున్నది ఒకటి అయితుంది ఒకటిలా ఉందా మీ పరిస్థితి. అయితే మీ మీద శని ప్రభావం ఉన్నట్టే. శని మీ పనులను అడ్డగిస్తున్నాడు. శని దోషం మనకు ఉంటె మనం ఏ పని చేసిన సక్సెస్ కాలేము.అయితే శని పోవడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇప్పుడు నేను చెప్పే విధంగా ఒక్కసారి చేసి చూడండి మీకు ఉన్న శని ఖచ్చితంగా పోతుంది.ఇప్పుడు అయ్యప్ప స్వామి సీజన్ కాబట్టి అయ్యప్ప మాల వేసుకున్న స్వాములకు ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీకున్న శని పోతుంది.మరి ఏం చెయ్యాలో తెలుసుకుందామా.

Image result for ayyappa swamulu

అయ్యప్ప మాల వేసుకున్న స్వాములకు మీ శక్తిమేర ఎంతమందికి అయితే అంత మందికి లేదా కనీసం ఒక్కరికైనా బిక్ష పెడితే మీకు చాలా మంచి కలుగుతుంది. అయితే బిక్ష అనేది ఎక్కడనో హోటల్లో తెచ్చి పెట్టకూడదు. ఏ ఇంట్లో అయితే మీరు ఉంటున్నారో ఆ ఇంట్లో మీ చేతులతో వండి ఆయనకు విస్తరాకు వేసి మీ చేతులతో ఆయనకు వడ్డించాలి. ఆడవాళ్ళూ అయ్యప్ప స్వాములకు భోజనము పెట్టకూడదు. కాబట్టి ఇంట్లో ఉండే మగవాళ్ళు మాత్రమే భోజనం వడ్డించాలి. అయితే ఇలా బిక్ష పెట్టడం వలన అయ్యప్ప ఎందుకు కరుణిస్తాడంటే..మీరు శనీశ్వరుడి ఫోటో చూసినట్లయితే నల్లగా లేదా కేవలం కళ్ళు మాత్రమే కనిపించేలా లేదా కాళ్ళు వంకరగా ఉన్నట్టు.. ఇలా చాలా రకాలుగా శనీశ్వరుడిని మనం చూస్తాం. అలాగే అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు కూడా పై నుంచి కింది వరకు మొత్తం నల్లగా కనిపిస్తారు. వాళ్ళు వేసుకున్న షర్ట్ ప్యాంట్ లేదా లుంగీ అన్ని నల్లని రంగులో ఉంటాయి. నలుపు అంటే శనీశ్వరుడికి ఇష్టం.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కాబట్టి ఎవరైతే అయ్యప్ప స్వాములకు బిక్ష పెట్టి తోచినంత తాంబూలం ఇస్తారో వాళ్ళను శనీశ్వరుడు కనికరించి మీకు శని పట్టకుండా చేస్తాడు. ఈ విధంగా మీ ఇంట్లో సుఖ శాంతులు ఉండేలా చేస్తాడు. మనం ఏ పని తలపెట్టిన శనీశ్వరుడి కరుణ ఉంటె సునాయాసంగా పనులు కంప్లీట్ అవుతాయి.ఒకవేళ మీరు ఒక్కరికి కూడా బిక్ష పెట్టలేని స్థితిలో ఉంటె ఇరుముడి కట్టుకుని వెళ్తున్న వాళ్లకు మీ చేతనైనంత అంటే 10 రూ లేదా 20 రూ.. మీకు ఎంత చేతనైతే అంత వాళ్లకు ఇచ్చి నమస్కరించుకుంటే మీకు మంచి కలుగుతుంది. అలాగే అయ్యప్ప స్వాములు కట్టుకోడానికి నలుపు రంగు దుస్తులను దానం చేసిన కూడా మనకు మంచి కలుగుతుంది. కాబట్టి ఒక్కసారి అయ్యప్ప స్వాములకు బిక్ష పెట్టి చుడండి తర్వాత మీరే అనుకుంటారు ఎంత మంచి జరిగిందని. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. శని పోవాలంటే అయ్యప్ప స్వాములకు ఏం చెయ్యాలో నేను చెప్పిన విషయాల గురించి అలాగే ఇంకా అయ్యప్ప స్వాములను ఎలా పూజించాలో మాకు కామెంట్ రూపంలో రాసి అందరికి తెలియజేయండి..