ఈ శివాల‌యంలో రోజూ తెల్లవారుజామున 4 గంటలకి జరిగే అద్బుతాన్ని చూస్తేగాని నమ్మలేరు

678

మ‌న దేశంలో ఉండే దేవాల‌యాల‌లో అనేక అద్బుతాలు జ‌రుగుతూ ఉంటాయి… ముఖ్యంగా ఆయా దేవాల‌యాల్లో అక్క‌డ చేసే పూజ‌లు, అక్క‌డ దేవునికి చేసే దూప‌దీప నైవేధ్యాలతో ఆయా దేవాల‌యాల్లో శాస్త్రోత్త‌క పూజ‌లు జ‌రుగుతూ ఉంటాయి… ఇలాంటి కొన్ని దేవాల‌యాల‌లో అద్బుతాలు సూర్యోద‌యానికి ముందు జ‌రిగేవి ఉంటాయి… వీటిని చూసేందుకు అనేక మంది వ‌స్తూ ఉంటారు.. ముఖ్యంగా శివాల‌యాల్లో ఇటువంటి అద్బుతాలు ఎక్కువ‌గా కనువిందుచేస్తూ ఉంటాయి.. దీని వెనుక దైవ లీల ఉంది అని అంటారు.. అలాంటి ఆల‌యాల్లో ఈ ఆల‌యాన్ని ప్ర‌ముఖంగా చెప్ప‌వ‌చ్చు ఈ ఆల‌యంలో రోజూ తెల్ల‌వారు జామున నాలుగు గంట‌ల‌కు జ‌రిగే అద్బుతం గురించి ఈరోజు మ‌నం తెలుసుకుందాం..

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని మ‌రైవా జిల్లాలో, ఈశ్వ‌ర మ‌హాదేవ్ అనే శివాల‌యం ఉంది… ఇది శివుని ఆల‌యంగా ఎంతో ప్ర‌సిద్దికెక్కిన క్షేత్రం..ప్ర‌కృతి అందాల న‌డుమ ఎత్తైన కొండ ప్రాంతంలో ఈ ఆల‌యం ఉంది.. ఇక్క‌డ ఉద‌యం గుడి త‌లుపులు తీయ‌గానే ఆల‌య పూజారికి ఓ అద్బుతం క‌నిపిస్తుంది.. స్వామికి గుడి త‌లుపులు తెరిచే స‌రికి ఇక్క‌డ గుడిలో పూజ‌లు జ‌రిగి ఆయ‌నపై పుష్పాలు అభిషేకం జ‌రిగి ఉంటుంది.. కాని ఈ శివ‌లింగానికి ఎంతో మ‌హ‌త్యం ఉంది.. అయితే ఇక్క‌డ‌కు బ్ర‌హ్మ‌ముహూర్తాన ఓ సిద్ద మ‌హ‌ర్షి రోజూ తెల్ల‌వారు జామున నాలుగు గంట‌ల‌కు ముందే, ఇక్క‌డ వ‌చ్చి శివునికి పూజ‌లు చేస్తూ ఉంటార‌ట‌.

కాని ఆయ‌న ఎవ‌రు? ఎక్క‌డ నుంచి వ‌స్తారు అనేది ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ‌రూ క‌నిపెట్ట‌లేదు .. 365 రోజులు శివ‌లింగం పై నీరుప‌డుతూ ఉంటుంది ఇది ఇక్క‌డ విచిత్రం… ఇక్క‌డ శివునికి తెల్ల‌వారు జామున నాలుగు గంట‌ల‌కు ముందే పూజ‌లు చేసి అందంగా పువ్వులు అలంక‌రించి ఉంటాయి.. బ్ర‌హ్మ‌ముహూర్తానికి పూల‌తో పూజ జ‌రుగుతూ ఉంటుంది.. అయితే ఇక్క‌డ కొంద‌రు గూడాచారాలు గ‌తంలో కాప‌లా ఉండి, ఎవ‌రు ఇది చేస్తున్నారు అని క‌నుగునే ప్ర‌య‌త్నం చేశారు..

కాని ఎవ‌రు వ‌చ్చి పూజ చేస్తున్నారు అనేది మాత్రం తెలియ‌లేదు.. ఇక గూడాచారులు కాప‌లా ఉన్నా ఇక్క‌డ పూజ‌లు జ‌రిగేవి.. ఇలా కాప‌లా ఉన్నా వారు ఉద‌యం స్పృహ త‌ప్పిప‌డిపోయి ఉన్నారట‌.. అలాగే ఇక్క‌డ స్ధానికులు చెప్పేదాని ప్ర‌కారం, రావ‌ణుడి త‌మ్ముడు విభూష‌ణుడు ఇక్క‌డ కొండ పై శివ‌లింగాన్ని ప్ర‌తిష్టించి పూజ‌లు చేసేవాడ‌ట.. అప్ప‌టి నుంచి శివ‌లింగం పై నీటి బింధువులు ప‌డుతున్నాయి అని అంటారు…. గ‌తంలో రామ‌దాస్ స‌న్యాసి ఇక్క‌డ త‌ప‌స్సు చేసేవార‌ట, ఆయ‌న కూడా మ‌ర‌ణించిన త‌ర్వాత అదృశ్య రూపంలో వ‌చ్చి క్రమం త‌ప్ప‌కుండా ఇక్క‌డ పూజ‌లు చేస్తున్నారు అని అంటున్నారు కొంద‌రు స్ధానికులు..ఇక ఎక్క‌డ శివాల‌యాల్లో పూజ‌లు జ‌రిగినా బిల్వ‌ద‌ళాలు సాధార‌ణంగా మూడు స‌ముధాయాలుగా ఉంటాయి.. కాని ఇక్క‌డ ఐదు నుంచి ఏడు స‌ముదాయాలుగా ఉంటాయి.. ఇక కొంద‌రు ఇక్క‌డ శివ‌రాత్రికి వ‌చ్చి జాగారం చేస్తారు, ఈ ప్రాంతంలో శివ‌రాత్రిని ఓ పెద్ద జాత‌రలా చేస్తూ ఉంటారు. చూశారుగా ఇలాంటి అనేక అద్బుత శ‌క్తి మ‌హిమ క‌లిగిన దేవాల‌యాల గురించి మ‌రిన్ని వీడియోల‌తో మీ ముందుకు వ‌స్తాం.. ఈవీడియో పైమీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.