గుడిలో దొంగతనానికి వెళ్లి నిద్రపోయాడు.. పొద్దున్నే ఏమైందో తెలుసా

436

ఎవరైనా దొంగతనం చెయ్యాలంటే వాళ్లకు కొంత గట్స్ ఉండాలి.దొంగతనం చేసేవారు అస్సలు భయపడరు.ఎంత రిస్క్ చేసి అయినా సరే వారు వచ్చిన పని కానిచ్చే వెళ్తారు.కానీ కొందరు తింగరి దొంగలు ఉంటారు.హడావిడిగా రావడం వచ్చిన పని మర్చిపోవడం లేదా విలువైన వాటిని కాకుండా మామూలు వాటిని దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు.ఇలాంటి దొంగలను మనం చాలా మందిని చూసాం.అయితే దొంగతనానికి వెళ్లిన వారు నిద్రపోవడం ఎప్పుడైనా చూశారా.వారు వెళ్లిన పని కానిచ్చి తిరిగి రాకుండా నిద్రపోయారు కొందరు దొంగలు.మరీ ఆ నవ్వు తెప్పించే దొంగతనాల గురించి తెలుసుకుందామా.

Image result for village temple lo night sleeping

ఓ దొంగ కూడా ఒక ఇంట్లో దొంగతనం చేయడానికి మంచి పధకం వేసుకున్నాడు.దొరికినకాడికి దోచుకున్నాడు.. ప్లాన్ సక్సెస్. ఇంకేముంది.పారిపోవాలి. కానీ, అలా చేయకుండా కష్టపడి పని చేసిన వాడిలాగా బాగా అలసిపోయాడు నెమ్మదిగా అక్కడే నిద్ర లోకి జారుకున్నాడు.ఇంకేముంది.ఉదయానే వచ్చినవారు ఆ దొంగ గారిని చూసి, నోరేల్లబెట్టడం, ఆ వెంటనే పోలీసులకు కబురెట్టడం వారు వచ్చి దొంగని అత్తారింటికి తీసుకెళ్లడం వెంటవెంటనే జరిగిపోయాయి.ఈ వింత దొంగ గారి వీరగాథ విశాఖపట్నంలో జరిగింది. ఇంతకీ ఎం జరిగిందంటే వేపగంటలోని పైడిమాంబ ఆలయంలోకి గ్రిల్స్ వంచి మరీ లోనికి ప్రవేశించిన దొంగ.. హుండీలను పగులగొట్టి డబ్బు, నగలు మూటగట్టుకున్నాడు. ఇక అక్కడినుండి నుంచి బయటపడే సమయం రానే వచ్చింది. యుద్ధం ముగించుకుని వస్తున్న వీరసైనికుడిలా తన సామానునంతా భుజాన వేసుకుని పైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఒకసారి కిందపడ్డాడు. మళ్లీ ప్రయత్నించాడు.

Image result for village temple lo night sleeping

లాభం లేకపోయింది. ఇలా కొన్నిసార్లు చేసినా ప్రయోజనం లేకపోవడంతో అలసిసొలసి పాపం ఆ గుడిలోనే నిద్రపోయాడు.ఇక పొద్దున్నే వచ్చిన ఆలయసిబ్బంది విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలిసినవారంతా దొంగ దురదృష్టాన్ని తలుచుకుని తెగ బాధ పడిపోతున్నారు.గతంలో కూడా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది.కాకపోతే కాస్త డిఫరెంట్ గా, మద్యం సేవించి కార్ నడపద్దు అన్నట్టుగానే మద్యం సేవించి దొంగతనం చెయ్యదు అని బోర్డు పెట్టాలి అనిపిస్తుంది దీన్ని చూస్తే. దొంగతనానికి వచ్చిన దొంగ ఏం చెయ్యాలి ? చేతికి అందినది దోచుకుని ఉడాయించాలి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కానీ చెన్నైలో ఇద్దరు దొంగలు ఇతాంబరం లోని హార్డ్ వేర్ షాపులో దొంగతనానికి వచ్చి లోపలి చేరుకొని డబ్బు దొంగతనం కూడా చేసారు, అయితే వాళ్ళిద్దరూ అంతకు ముందే గొప్ప పని చేసారు,ఏమి లేదు, బాగా తాగారు అంతే, ఇంకేముంది నెమ్మదిగా మత్తులోకి జారుకున్నారు. షాపు తాళాలు తీసి ఉండడం తో అలర్ట్ అయిన యజమాని దొరికిన వారిద్దరినీ దొరికినట్టు చితకబాది పోలీసులకు అప్పగించారు. ఇలా దొంగతనానికి వచ్చి నిద్రపోతూ దొరికిపోయిన సంఘటనలు ఎంత విచిత్రంగా ఉన్నాయి కదా…దొంగలు ఇప్పటికైనా కొంచం అప్డేట్ అవ్వండి.ఇలా పట్టుబడి మా పరువు తీయకండి, అంటూ హెచ్చరిస్తున్నారు సాటి దొంగలు.మరీ ఈ ఘటనల గురించి మీరేమంటారు.దొంగతనం చేసేవారి గురించి దొంగతనానికి వారు ఉపయోగించే టెక్నీక్స్ గురించి అలాగే దొంగతనానికి వెళ్లి నిద్రపోయిన ఈ రెండు ఘటనల గురించి మీరేమంటారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.