హనుమంతుడు ఇంకా భూమి మీదే ఉన్నాడు .. ఇవిగో సాక్ష్యాలు

583

హిందువుల పురాణ గాథల్లో రామాయణానికి ఒక ప్రత్యేకత ఉంది. అందులో ఉన్న ప్రతి పాత్ర మనకు ఎంతోకొంత జ్ఞానాన్ని నేర్పిస్తుంది. అయితే అన్నిటికన్నా హనుమంతుడి పాత్ర మనకు ఎంతో నచ్చుతుంది. ఈ విశ్వం ఉన్నంతవరకు రామాయణం గురించి మాట్లాడుకుంటారు అంటారు, అలాగే రామాయణం గురించి జనాలు మాట్లాడుకుంటున్నంతవరకు హనుమంతుడు ఉంటాడంటారు .. మనం ఇంకా రామాయణం గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయితే ఈ పవన పుత్రుడు ఇంకా భూమి మీద నివసిస్తన్నాడా? తన భక్తులకి ఊహించని రూపాల్లో దర్శనమిస్తూ దైవం మీద నమ్మకాన్ని పెంచుతున్నాడా? హనుమంతుడు ఇంకా భూమి మీద ఉన్నట్టేనా? ఉంటే మన కనులకి ఎందుకు కనబడటం లేదు? అసలు ఉన్నాడా లేదా? ఉన్నాడనడానికి కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Related image

* హనుమంతుడుకి ఉన్న మరోపేరు చిరంజీవి. అంటే అర్థం ఎప్పటికీ జీవించి ఉండేవాడు. అక్కడే మనకు అర్థం అవ్వాలి, హనుమంతుడు ఎప్పటికి ఇక్కడే ఉంటాడని. హనుమంతుడు ఉన్నాడని భక్తులను రక్షిస్తున్నాడని భక్తులు నమ్ముతారు.
* రామాయణం పూర్తవగానే రాముడు, సీత అంతా భూమిని విడిచి వెళ్ళిపోయారు .. కాని హనుమంతుడు భూమిని విడిచినట్టుగా ఎక్కడా రాయలేదు. అంటే హనుమంతుడు భూమి మీద ఉన్నాడనే కదా అర్థం..
* హనుమంతుడు సత్య యుగంలో రుద్రుడి రూపంలో ఉండేవాడు. అంటే హనుమంతుడు త్రేతాయుగానికి ముందునుంచే మన పురాణాలకి తెలుసు.అంటే ఈ కలియుగంలో కూడా ఉన్నట్టేగా.
* త్రేతాయుగంలో రుద్రుడు హనుమంతుడిగా జన్మించి, అదే రూపంలో చిరంజీవిగా ఉంటాడని పురాణాలు చెప్పాయి. ఈ యుగంలోనే రామాయణం జరిగింది.అంటే ఏ యుగంలో అయినా హనుమంతుడు ఏదో ఒక రూపంలో ఉంటాడు. అంటే చివరి యుగం అయినా ఈ కలియుగంలో కూడా ఏదో ఒక రూపంలో ఉండి ఉంటాడు.

Image result for shri hanuman
* ద్వాపరయుగంలో కూడా హనుమంతుడు ఉన్నాడు. జెండపై కపిరాజుగా మారి కురుక్షేత్రాన్ని నడిపించాడు కూడా. ఇప్పుడు కలియుగంలో కూడా తమకి దర్శనమిచ్చాడని భక్తులు అంటున్నారు. అన్ని యుగాల్లో ఉన్నాడు, ఇకపై ఉంటాడు కాబట్టే హనుమంతుడు చిరంజీవి.
* హనుమంతుడు విశ్వరూపం దాల్చిన పాదముద్రలు చాలాదేశాల్లో కనిపిస్తాయి. అంత పెద్ద మనిషిని మనం ఎరుగం. ఆ పాదముద్రలు హనుమంతుడివి కాక ఇంకెవరివి?శ్రీలంకలో హనుమంతుడి పాదాల ముద్ర ఇప్పటికి ఉంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

* తాము వానరడైన హనుంతుడిని చూసాం అని ఒకరు కాదు ఇద్దరు కాదు, వందలమంది భక్తులు చెప్పారు. ఆయన అందరికి దర్శనమివ్వడు, ఎవరో ఉంటారు అదృష్టవంతులు.
* హనుమంతుడి గుడిల దగ్గర కోతులు ఉంటాయి. వీటి వెనుక ఏం సైన్సు ఉంటుంది. ఉదాహరణకు కొండగట్టునే తీసుకోండి. వేలకొద్ది కోతులని అక్కడకి ఎవరు రప్పించారు? అవే అక్కడే హనుమంతుడిని ఆరాధిస్తూ ఎందుకు ఉంటున్నాయి?ప్రతి హనుమంతుడి గుడిలో కోతులు ఎందుకు ఉంటాయి. హనుమంతుడు ఉన్నాడనడానికి ఇవే నిదర్శనాలు.ఇప్పటికైనా దేవుడు లేడు అనే వాళ్ళు మనసును మార్చుకుంటారని అనుకుంటున్నాం. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. హనుమంతుడి గురించి ఆలాగే ఆయన ఉన్నాడనడానికి గల ఈ సాక్ష్యాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.