విజయవాడ దుర్గమ్మ గుడిలో మహా అద్భుతం ..చూసి అందరికి షేర్ చేయండి

624

విజయవాడ ఇంద్రకీలాద్రి మీద కొలువై ఉన్న అమ్మవారు ఎంత శక్తివంతమైందో మనం సెపరేట్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.ఆ అమ్మవారికి ఆగ్రహం వస్తే నాశనము తప్పదని చెప్తుంటారు.ఇక్కడికి నిత్యం వేలసంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.ఒక్క తెలుగు రాష్టాల నుంచే కాకుండా కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర లాంటి రాష్టాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.ఇక్కడ అమ్మవారిని కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా చెప్పుకుంటారు.కృష్ణ నది తీరాన కొలువై ఉన్న ఈ అమ్మవారి కోసం ప్రత్యేకంగా దీక్షలు కూడా చేపడతారు.కొన్ని లక్షల మంది జనాలు ఎప్పుడు గుడిలోపల ఉంటారు.అయితే ఇలా ఉండే గుడిలోకి ఈ మధ్య ఒక పాము తరచు వస్తుంటుంది.మరి ఆ పాము సంగతి ఏంటో పూర్తీగా తెలుసుకుందామా.

Image result for vijayawada temple

ఇంద్రకీలాద్రిపై పాము కలకలం సృష్టించింది.మధ్యాహ్నం అమ్మవారి గర్భగుడిలో పాము కనిపించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. పామును సిబ్బంది పట్టుకోవాలనుకున్నప్పటికీ చిక్కకుండా తప్పించుకున్నది.అయితే ఆ పాము మెల్లగా పాకుతూ పాతరాజగోపురం దగ్గర ప్రసాదాల కౌంటర్‌లోకి పాము దూరడంతో.. భక్తులు హడలిపోయారు. భయంతో బయటకి పరుగులు తీశారు.ప్రస్తుతం పామును పట్టుకునే పనిలో పడ్డారు సిబ్బంది. క్యూ లైన్లు తొలగించి సిబ్బంది వెతుకులాట ప్రారంభించారు. ఆలయంలోని బండ సొరుగులోకి పాము వెళ్లటంతో గడ్డపారలతో పామును తరిమేందుకు సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి ప్రాణ హాని జరగకుండా పామును బయటకు పంపేందుకు సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇదిలా ఉంటే ఆలయంలోని ఇటీవల కాలంలో పాములు రావడం పరిపాటిగా మారిందని సిబ్బంది చెబుతున్నారు.గత సెప్టెంబర్‌లోనూ దుర్గమ్మ గుడిలోకి పాము ప్రవేశించి అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. అమ్మవారి గర్భగుడిలో పాము కనిపించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. పామును సిబ్బంది పట్టుకోవాలనుకున్నప్పటికీ చిక్కకుండా తప్పించుకున్నది. ఆలయంలోకి ఇటీవల కాలంలో పాములు రావడం ఎక్కువ అయ్యిందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరోసారి పాము కనిపించడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.విజయవాడ కనకదుర్గమ్మ గురించి అలాగే ఆలయంలోకి చేరి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన పాము గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.