ఉగాది నుండి ఈ 4 రాశులవారికి అదృష్టం డబ్బు వెతుక్కంటూ వస్తుంది

678

ఉగాది ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది మన తెలుగు పండుగ అని. ఉగాది నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఈ రోజు కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు. ఉగాది ప్రాముఖ్యంచైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఒక్కొక్క ఉగాదికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ 2019 ఏప్రిల్ 6 నుంచి స్టార్ట్ అయ్యే తెలుగు సంవత్సరాన్ని శ్రీ వికారి నామ సంవత్సరం అని అంటారు.

Related image

అయితే ఈ ఉగాది నుంచి ఒక 4 రాశుల వారికి రాజయోగం రాబోతుందంట. ఆ రాశులు ఏవి అంటే…

కర్కాటక రాశి…. ఈ రాశుల వారు ఈ ఉగాది నుంచి ఉన్నత స్థాయిలో ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే కీర్తి ప్రతిష్టలు పెరిగి ఆదాయం కూడా పెరుగుతుంది. వీరికి వచ్చే అవకాశాలు కూడా అలాగే ఉంటాయి.వాటిని సరైన సమయంలో ఉపయోగించుకుని సక్సెస్ అవుతారు.
వృశ్చికరాశి…. ఈ రాశివారికి లక్ష్మీదేవి కటాక్షం పుష్కలంగా ఉంది. కాబట్టి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వీరి జాతకం ఎలా ఉంటుంది అంటే ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది.ఏ పని చేసిన విజయవంతం అవుతుంది. వీరు ఏదైనా పని అవ్వాలని అనుకుంటే ఆ పని అయ్యేంతవరకు అసలు వదలరు. అంత పట్టుదల వీరికి ఉంటుంది.

ఈ క్రింది వీడియో చూడండి


మీనరాశి…… ఈ రాశివారు చాలా మంచితనంతో ఉంటారు. ఈ రాశివారికి ధనం సంపాదించే మార్గాలు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే వీరికి తిరుగుండదు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.ఉద్యోగం కోసం ప్రయత్నించేవారికి ఇది అనుకూల సమయం.కుటుంబంలో సంతోషాలు వెల్లువిరుస్తాయి.
సింహరాశి….. ఈ రాశికి అధిపతి సూర్యుడు. గ్రహాలకు అధిపతి అయినా సూర్యుడు ఈ రాశివారికి రాజభోగం కల్పించబోతున్నాడు. 12 రాశులలో శక్తివంతమైన రాశి సింహరాశి. వీరికి ఏదైనా ఒక దారి కనపడితే చాలు ఆ దారిని పట్టుకుని వెళ్ళిపోతారు. అనుకున్నది సాధిస్తారు. కాస్త ప్రోత్సాహం ఇస్తే చాలు ఏదైనా సాధిస్తారు. ఈ ఉగాది నుంచి ఈ రాశివారు ఏ పని చేసిన సరే సక్సెస్ అవుతుంది.ఇంట్లో పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి.

ఈ నాలుగు రాశుల వారికి ఈ ఉగాది నుంచి తిరుగుండదంట. మరి ఉగాది పండుగ గురించి విశిష్ఠత గురించి అలాగే పైన చెప్పిన రాశుల వివరాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.