నాగ‌బంధం గ‌దిని తాకిన వ‌ర‌ద‌నీరు.. ఆ త‌ర్వాత ఏమైందో తెలిస్తే షాక్

558

ప్ర‌కృతి సోయ‌గాల‌కు ఆల‌వాల‌మైన కేర‌ళ భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మైంది. ఇప్పుడిప్పుడే వ‌ర్షాలు కాస్త తెర‌పినిస్తుండ‌టంతో ఇప్పుడిప్పుడే చాలా మంది పున‌రావాసాల నుంచి సొంత ఇళ్ల‌కు చేరుకుంటున్నారు. భారీ వ‌ర్షాల‌ కార‌ణంగా కొన్ని చోట్ల ఇళ్లు కూలిపోయాయి. దీంతో వేలాది మంది నిరాశ్ర‌యుల‌య్యారు. క‌ట్టుబ‌ట్ట‌ల‌తో మిగిలిపోయారు. ఇక అడ‌వులను చూస్తే పెద్ద పెద్ద వృక్షాలు కూడా నేల‌కొరిగాయి.. ప్రకృతి ప్ర‌కోపం కేర‌ళ‌ను విల‌పించేలా చేసింది.. ఓ శ‌తాబ్దంలో ఎన్న‌డు కుర‌వ‌నంత భారీ వ‌ర్షాలు కేర‌ళ‌లో కురిసాయి..ఇంత విప‌త్తులో కూడా తిరువ‌నంత‌పురంలో అనంత పద్మ‌నాభ‌స్వామి ఆల‌యంలో లీలలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

Image result for antha padamanam swamy temple in kerala

వ‌ర‌ద‌లు ముంచెత్త‌డంతో తిరువనంత‌పురం ప్ర‌ధాన ర‌హదారులు అన్నీ చెరువుల‌ను త‌ల‌పించాయి.. దీంతో అనంత‌ప‌ద్మ‌నాభుని ఆల‌యంలో కూడా పెద్ద ఎత్తున వ‌ర‌ద నీరు చేరింది.. ఇక ఈ స‌మ‌యంలో గుడిలో పూజాకార్య‌క్ర‌మాలు చేయేలేదు పూజారులు.. ఇక వ‌ర‌ద త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఆల‌యం బ‌య‌ట నీరు వెల్లిపోవ‌డంతో గ‌ర్బ‌గుడిలోకి వెళ్లారు ప్ర‌ధాన పూజారులు… ఒక్కసారిగా లోప‌ల ప‌రిస్దితిని చూసి ఆశ్చ‌ర్య‌చ‌కితులయ్యారు.గుడిరోజూ లాగా నిర్మ‌లంగా ఉంది అలాగే గ‌ర్బ‌గుడిపై ఒక్క‌చుక్క‌నీరు లేదు… తేమ అనేది లేదు విగ్ర‌హానికి…గ‌ర్బ‌గుడిలో ఒక్క చుక్క‌ వ‌ర‌ద నీరు తాక‌లేదు.. ఇక ధ్వ‌జ‌స్ధంభం పై కూడా వ‌ర‌ద‌నీరు అంట‌లేదు అలాగే తేమ లేకుండా ఉంది… ఇక ధ్వ‌జ‌స్తంభంపై ఎక్క‌డైనా స‌రే దేవాల‌యం ప‌తాకం క‌డ‌తారు.. ఇక్క‌డ కూడా గాలికి విజ‌యోత్స‌వ పందాలో ఎగురుతోంది ఈప‌తాకం.. దీంతో ఇదంతా స్వామి లీల అని భ‌క్తులు పూజారులు ప‌ర‌వ‌శించిపోతున్నారు.

Image result for antha padamanam swamy temple in kerala

ఇక స్వామికి దూప దీప నైవేద్యాల‌తో పాటు, గ‌ర్బ‌గుడిలో అఖండ హార‌త నిత్యం వెలుగుతూ ఉంటుంది… అలాగే మూడు రోజులుగా దేవాల‌యం తెర‌వ‌క‌పోయినా ఆ జ్యోతి దివ్యంగా వెలుగుతూ క‌నిపించింది.. రోజూ స్వామికి సేవ‌లు అయిన త‌ర్వాత గుడిమూసేముందు నెయ్యి పోస్తూ ఉంటారు… కాని మూడు రోజులుగా దీపానికి నెయ్యి పోయ‌లేదు….ఒత్తి మండుతూనే ఉంది లోప‌ల నిర్మ‌లంగా ఉంది అని తెలియ‌చేస్తున్నారు పూజారులు.. అవ‌న్నీ అనంత స్వామిలీల‌లు అని త‌రించిపోయారు… కేర‌ళ‌లో మ‌రింత ప్రాణ న‌ష్టం జ‌రుగ‌కుండా స్వామి కాపాడారుఅని అంటున్నారు ఇక్క‌డ ప్ర‌జ‌లు… ఇక స్వామి ఆశీర్వాదం కేర‌ళ ప్ర‌జ‌ల‌కు మెండుగా ఉంద‌ని అందుకే త‌క్కువ ప్రాణ న‌ష్టం సంభవించింది అని, స్వామి కాపాడార‌ని అంటున్నారు… కేర‌ళ‌ని సుమారు 44 న‌ధులు ఈ వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుల‌తం చేశాయి.. క‌నివిని ఎరుగ‌ని రీతిలో ఘొర విప‌త్తుని మిగిల్చాయి.

ఇక అనంత ప‌ద్మ‌నాభ స్వామి ఆల‌యంలో హుండీలోకి కూడా నీరు వెల్ల‌లేదని ఉప ఆల‌యాలు కూడా అలాగే ఉన్నాయ‌ని చెబుతున్నారు పూజారులు.. అనంప‌ద్మ‌నాభ స్వామికి నేటి నుంచి సేవా కార్య‌క్ర‌మాలు మొద‌లు అవుతాయ‌ని చెబుతున్నారు. ప‌ద్మ‌నాభునికి ప్ర‌పంచంలో ఎవ‌రికి లేని సంప‌ద ఉంది అనేది తాజాగా నేల‌మాలిగ‌ల్లో దొరికిన బంగారంతో బ‌య‌ట‌ప‌డిన విష‌యం తెలిసిందే.. స్వామికి నిత్యం అఖండ జ్యోతి వెలుగుతూ ఉండాల‌ని ఇది ఆరితే క‌చ్చితంగా ప్ర‌ళ‌యం వ‌స్తుంది అని యుగాంతానికి సూచిక అని అంటున్నారు పండితులు….. చూశారుగా ఇది స్వామిలీల అని మీరు కూడా భావిస్తున్నారా దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.