ఫిబ్రవరి 12 మంగళవారం రథ సప్తమి వచ్చేలోపు ఈ చిన్న వస్తువుని కనుక ఇంటికి తెచ్చుకుంటే మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం

434

ఫిబ్రవరి 12 2019 న రథసప్తమి వచ్చింది.ప్రతి సంవత్సరం మాఘమాసం శుద్ధ సప్తమి రోజును హిందువులు రథసప్తమిగా జరుపుకుంటారు. రథసప్తమి సూర్యుడిని పూజించే పండుగ. మాఘశుద్ద సప్తమి నాడే సూర్యభగవానుడు ఆవిర్భవించాడని, ఆ రోజునే ఆయన పుట్టిన తిథిగా పేర్కొంటారు.మాఘశుక్ల సప్తమీ పుణ్యదినంలో సూర్యుడు జన్మించడమే కాకుండా, భూమికి మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చి రథాన్ని అధిరోహించాడని మత్స్యపురాణం చెబుతుంది. అందుకే ఈ రోజుని రథసప్తమి అంటారు. జీవకోటికి చలి తొలగించి, నూతన ఉత్తేజాన్ని నింపే సుర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగే రథసప్తమి.అలాంటి పవిత్రమైన రోజున కొన్ని నియమాలను పాటించాలి. రథసప్తమి వచ్చే ముందు ఇంటికి తెచ్చి పెట్టుకోవాల్సిన కొన్ని వస్తువులు ఉన్నాయి. అవేమిటి అంటే జిల్లేడు పూలు.

Image result for lakshmi devi pooja

రథసప్తమి రోజున జిల్లేడు పూలను నీళ్లలో వేసి స్నానం చేస్తే మంచిదంట. అయితే జిల్లేడు పూలను ముందురోజే ఎందుకు తెచ్చిపెట్టుకోవాలంటే సూర్యోదయం అవ్వకముందే స్నానం చెయ్యాలి కాబట్టి ముందే తెచ్చిపెట్టుకోవడం మంచిది.ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలోను, జన్మాంతరంలోను (రెండు), మానసిక, వాచిక, శారీరకములు (మూడు), తెలిసిచేసేవి, తెలియకచేసేవి (రెండు) కలిసి మొత్తం ఏడు పాపములు నేడు రోగాలకు కారణములు.రోజున అరుణోదయవేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల రెట్ల పుణ్యం వస్తుంది. ఈ సప్తమినాడు ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యటం శ్రేయస్కరమట.

రథ సప్తమినాడు స్త్రీలు గుమ్మం ముందు ‘రథం ముగ్గును’ వేసి మధ్యలో జాజుతొ వర్తులాకారం వేయాలి. ముగ్గు పైన గోమయంతో చేసిన పిడకలు వెలిగించి, దానిపైన మట్టితో చేసిన గురిగిని పెట్టి అందులో ఆవు పాలు పోసి పొంగించాలి. ఆ పాలతో పాయసం చేసి సూర్యుడికి నివేదన చేసి అందరూ స్వీకరించాలి. ఇంట్లో సూర్యుడి పటం ఉంటే ఆ చిత్రపటానికి అలంకరణ చేసి యధాశక్తిగా పూజించాలి. సూర్య అష్టోత్తరం, ఆదిత్య హృదయం. సూర్యాష్టకం పఠించాలి. సూర్యుడికి గోధుమలతో చేసిన పాయసం నివేదన చేసి అందరూ స్వీకరించాలి. ఈ రోజు సూర్య నమస్కారాలు చేస్తే చాలా మంచిది. రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే మంచిదట. చిమ్మిలి దానం ఇస్తే సకలశుభాలు చేకూరుతాయని కొందరి నమ్మకం. ఇలా రథసప్తమి నాడు చెయ్యాల్సిన వాటికి ముందురోజే ఏర్పాట్లు చేసుకుంటే ఆ రోజు శ్రమ లేకుండా చిత్తశుద్ధి తో సూర్యుడిని పూజించి ఆయన అనుగ్రహం పొందవచ్చు. కాబట్టి ఇలా చెయ్యండి. మరి ఈ రథసప్తమి గురించి అలాగే ఆరోజు చెయ్యాల్సిన ముఖ్యపనుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.