ఉద‌యాన్నే గుడికి వెళ్లేప్ర‌తీ ఒక్క‌రూ త‌ప్ప‌క‌చూడాల్సిన వీడియో

412

కొన్ని కొన్ని దేవాల‌యాల్లో అత్యంత ర‌హ‌స్య‌పూర్వ‌క‌మైన విష‌యాలు దాగి ఉంటాయి. గ‌తంలో రాజులు త‌మ ఖ‌జానాల‌ను కింద దాచి వాటిపై దేవాల‌యాలు నిర్మించే వారు. అలా చేయ‌డం వ‌ల్ల అక్క‌డ గుడికి ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు అని వారి ఆలోచ‌న‌. అందుకే కొన్ని గుహాలు దేవాల‌యాలు త‌వ్విచూస్తే కొంద‌రు రాజులు పెట్టిన సంప‌ద‌లు బ‌య‌ట‌ప‌డుతుంటాయి, ఈ దేవాల‌యాల నిర్మాణం కూడా వింత‌గా ఉంటుంది. మ‌రి ఇలాంటి దేవాల‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ క్రింది వీడియో చూడండి

కర్ణి మాత దేవాలయం (లేదా) ఎలుకల దేవాలయం రాజస్ధాన్ లోని ఒంటెల దేశంగా పిలువబడే బికనీర్ జిల్లా లో డెష్నోక్ ఒక చిన్న గ్రామంలో ఈ దేవాల‌యం ఉంది.. గతంలో దీనిని ‘దస్ నోక్’ అంటే ‘పది మూలలు’ అని పిలిచేవారు. అంటే ఈ గ్రామం పది చిన్నగ్రామాల మూలలనుండి భాగాలు తీసుకొని ఏర్పడింది. ఈ ప్రదేశం పాకిస్తాన్ సరిహద్దులో బికనీర్ కు సుమారు 30 కి.మీ. దూరంలో ఉంది. డెష్నోక్ గ్రామం కర్ణి మాత దేవాలయానికి మరియు వివిధ పండుగలకు ప్రసిద్ధి చెందింది.

Related image
ఈ పవిత్ర స్ధలంలో ఎలుకలు పూజించబడుతాయి. ఈ దేవాలయాన్ని ఎలుకల దేవాలయం అని కూడా అంటారు. హిందువుల దేవత దుర్గా మాత మరో అవతారంగా కర్ణి మాతను పూజిస్తారు. ఈ దేవాలయంలో దుర్గా దేవత అవతారమైన కర్ణి మాత పూజించబడుతుంది.. ఇతిహాసాలమేరకు, రావు బికాజీ, అంటే బికనీర్ నగరం నిర్మాతకు కర్ణిమాత అనుగ్రహం దొరుకుతుంది. అప్పటినుండి ఆ మాతను బికనీర్ వంశ పాలకులు కొలుస్తారు. ఈ దేవాలయం 20వ శతాబ్దంలో రాజు గంగా సింగ్ చే నిర్మించబడింది.

కాబాస్ అని పిలువబడుతూ తిరిగే ఇక్కడి ఎలుకలను పూజిస్తారు. వీటిని అమ్మవారి పిల్లల ఆత్మలుగా భావిస్తారు. వీటికి అత్యధిక మతపర ప్రాధాన్యం ఇస్తారు. ఎలుక కనపడిందంటే చాలు శుభ సూచకంగా భావిస్తారు. ఎలుక కనుక తమ కాళ్ళను స్పర్శిస్తే చాలు ఎంతో మంచిదని భావిస్తారు. ఈ కాబాలు భక్తులు అందించే ప్రసాదం తిని జీవిస్తాయి.

Related image

2…దేవి కన్యాకుమారి ఆలయం, కన్యాకుమారి: తమిళనాడులోని కన్యాకుమారి వద్ద కుమారి అమ్మాన్‌ దేవాలయం ఉంది. దుర్గామాత కొలువు దీరిన ఈ ఆలయంలోకి పురుషులకు ప్రవేశం ఉండదు. మహిళలు మాత్రమే పూజిస్తారు. సింహద్వారం వరకు సన్యాసులకు ప్రవేశం ఉంటుంది. పెళ్లైన పురుషులను ఈ గుడి ప్రాంగణంలోకి కూడా రానివ్వరు. ఇక్క‌డ‌కు వెళ్లిన వారు స‌న్ రైజ్ త‌ప్ప‌కుండా చూస్తారు.

Related image

3..మేరూ రిలీజియ‌న్ స్పాట్ ..హిమాల‌య ప‌ర్వాతాల్లో అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఇక్క‌డ భ‌క్తులు శివుడు ఉన్నాడు అని పూజ‌లు చేస్తారు. ఇక్క‌డ శివుడు ఉంటాడు అని ఇక్క‌డ శివుడు తొలిసారిగా పాదాలు మోపాడు అంటారు. ఈ దేవాల‌యానికి శివుని భ‌క్తులు ఏటా కొంద‌రు వ‌చ్చి ద‌ర్శించుకుంటారు, మంచు ఎత్తు అయిన ప్రాంతం కావ‌డంతో ఆ ప‌ర్వ‌తం కింద భాగంలో పూజ‌లు చేస్తారు.

Related image

4.. శ‌నిమందిరం శ‌నిసింగ‌నాపూర్ దేవాల‌యం.. ఈ దేవాల‌యంలో శ‌నీశ్వ‌రుడి బాధ‌లు తొల‌గాలి అని పూజ‌లు చేస్తారు. ఇది మ‌హారాష్ట్రాలో ఉంది. నిత్యం పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు ఇక్క‌డ‌కు వ‌చ్చి శ‌నీశ్వ‌రుడికి అభిషేకాలు చేస్తారు. ఇక శనీశ్వ‌రుడి కొలువై ఇక్క‌డ ఉంటాడు అని వీరు గ‌ట్టిగా న‌మ్ముతారు. అందుకే ఈ ఊరిలో ఏ ఇంటికి కిటికీలు త‌లుపులు ఉండ‌వు.. ఇక్క‌డ దొంగ‌త‌నాలు జ‌ర‌గ‌వు అని న‌మ్ముతారు. ఒక‌వేళ ఇక్క‌డ దొంగ‌త‌నాలు జ‌రిగినా వారిని శ‌నీశ్వ‌రుడు క‌ఠినంగా శిక్షిస్తాడు అని న‌మ్ముతారు.

Image result for ammavari temple

5..సోమ్ నాద్ మందిరం
ఇది ఎంతో మ‌హిమ క‌లిగిన దేవాల‌యం.. ప్రాచీన కాలంలో ఇక్క‌డ ఉండే జ్యోతిర్లింగం గాలిలో ఎగిరేది అని చెబుతారు కాని కొంద‌రు దీనిని ప‌గ‌ల‌కొట్టారు.. ఆ త‌ర్వాత త‌ప్పు తెలుసుకుని 24 శివ‌లింగాల‌ను స్దాపించారు. దానిలోనే సోమ్ నాధ్ శివ‌లింగం కూడా అందుకే ఇది ఎంతో మ‌హిమ కలిగిన దేవాల‌యంగా చెబుతారు. మ‌రి చూశారుగా ఈ ఐదు దేవాల‌యాల గురించి వీటి చ‌రిత్ర గురించి . ఈ వీడియో పై మీ అభి ప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.