గ్రహనం మరియు గురు పౌర్ణమి కలిసి వచ్చాయి.ఈరోజు ఇలా చేస్తే మీరు అపర కుభేరులు అవుతారు..

633

జూలై 27 అర్థరాత్రి 11 గంటల 54 నిమిషాలకు శతాబ్దంలోనే అరుదైన చంద్రగ్రహణం రాబోతోంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. దాదాపు 103 నిమిషాలపాటు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. శనివారం వేకువ జామున 3.49 గంటల వరకు గ్రహణం కొనసాగుతుంది. 4.58 గంటలకు గ్రహణ ప్రభావం పూర్తిగా తొలుగుతుంది.అయితే ఇదే రోజు గురు పౌర్ణమి కూడా రావడం విశేషం.ఈ రెండు కలిసి వచ్చాయి కాబట్టి.ఈరోజు ఇలా చేస్తే మీ సకల పాపాలు పోతాయి.మరి ఏం చెయ్యాలో తెలుసుకుందామా.

Image result for chandra grahan

 

బియ్యం, కొత్త వస్త్రం అనేవి లక్ష్మీదేవి చిహ్నాలని, నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచకాలని పురోహితులు అంటున్నారు. అందుచేత గురుపౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు కుంకుమ మరియు విభూతి నుదుటన పెట్టి దేవతా స్తుతి చేయాలి గురుపౌర్ణమి రోజున నుదుట బొట్టు పెట్టకుండా దేవతా స్తుతి చేయకూడదని పురోహితులు సూచిస్తున్నారు. ఇంకా ఆ రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆలయాల్లో ఆవునేతితో దీపమెలిగించే వారికి సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం.అలాగే ఆలయాల్లో జరిగే పూజలను కళ్లారా వీక్షించేవారికి లేదా పూజలు జరిపేంచేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. గురుపౌర్ణమి రోజున వస్త్రదానము చేసే వారికి సకల సంతోషాలు చేకూరుతాయని వ్యాసమహర్షి పేర్కొన్నట్లు పురాణాలు చెబుతున్నాయి.

Related image

అలాగే వస్త్ర, ఆభరణ, గోదానములతో పాటు అర్ఘ్య పాదాల తోటి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.వ్యాస పూర్ణిమ అని పిలుపబడే గురుపౌర్ణమి రోజున ఉదయం ఐదు గంటలకే లేచి, శుచిగాస్నానమాచరించాలి. ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. పూజామందిరము, ఇంటి గడపకు పసుపు కుంకుమలు, పువ్వులతో అలంకరించుకోవాలి. పూజకు దత్తాత్రేయుడు లేదా దక్షిణమూర్తి బొమ్మను లేదా ప్రతిమను సిద్ధం చేసుకోవాలి.పూజకు పసుపు రంగు అక్షితలు, చామంతిపువ్వులు నైవేద్యానికి కేసరిబాత్‌, పాలకోవా, అరటిపండు వంటివి తీసుకోవాలి. గురుపౌర్ణమి రోజున ఉదయం 11 నుంచి 12గంటల లోపు పూజచేయాలి. తులసిమాల ధరించి ఉత్తరం వైపు తిరిగి కంచు దీపంలో ఐదు దూది వత్తులతో పంచహారతులిచ్చుకోవాలి. పూజకుముందు సాయిబాబా, దత్త స్తోత్రములు, గురుదత్త శ్రీసాయిసచ్చరిత్రలతో ధ్యానించాలి.

 

లేదా మీ సద్గురువు యొక్క నామాన్ని అన్నిటికంటే దత్తనామాన్ని స్మరించాలి అలాగే గురుపౌర్ణమి రోజున శ్రీసాయి, శ్రీదత్త పుణ్యక్షేత్రములు అంటే షిరిడి, గాణాగాపూర్‌ల సందర్శనం మంచి ఫలితాలనిస్తుంది.అలాగే వ్యాసపూర్ణిమ రోజున దేవాలయాల్లో పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేయించే వారికి కోటి జన్మల పుణ్యఫలం చేకూరుతుంది. గురుపౌర్ణమి మహోత్సవాలు, సామూహికంగా శ్రీసాయిసత్యవ్రతం వంటి పూజలు చేయించాలి. అలాగే సన్నిహితులకు శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిచ్చరిత్ర వంటి పుస్త్తకాలతోసహా… ఉడకబెట్టిన శెనగలను వాయనమిస్తే ఈతి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.విన్నారుగా ఈ గురు పౌర్ణమి రోజు ఏం చెయ్యాలో.ఇలా చేసి మీ సకల దోషాలను పోగొట్టుకుని మంచి ఫలితాలను పొందండి.