మంత్రాలన్నీ “ఓం” తోనే ప్రారంభం అవుతాయి ఎందుకో తెలుసా?

385

ఓం అనేది హిందూమతంలో చాలా ప్రాముఖ్యం కలిగి ఉంది.అనేక మంది హిందువులు దేవుని పూజించే సమయంలో, తమ మంత్రోచ్చారణ “ఓం” తో ప్రారంభించి “స్వాహా” తో ముగిస్తారు.దీనిని మనం చాలాసార్లు గమనించే ఉంటాం. అయితే ఓం తోనే ఎందుకు ప్రారంభం అవుతుంది. దానికి గల కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for om

పురాతన హిందూ ప్రకారం, “ఓం” ప్రధానంగా మూడు శబ్దాలను కలిగి ఉంటుంది. అవి వరుసగా అ, ఉ, మ గా ఉన్నాయి. హిందూ మతం నమ్మకాల ప్రకారం ఈ మూడు అక్షరాలూ, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తాయి. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం, విశ్వం మూడు రకాల ప్రాథమిక శక్తులను కలిగి ఉంటుంది. అవి సత్వ, రజో మరియు తమో గుణాలు. ఇక్కడ సత్వ గుణం, భగవంతుని లేదా మంచి లక్షణాలను ప్రతిబింబిస్తుంది. రజో గుణం మనిషి లేదా రాజు యొక్క సహజ లక్షణాలకు నిదర్శనం. ఇక తమో గుణం చెడు లేదా రాక్షస లక్షణాలకు సంబంధించినది. ప్రతి ఒక్క మూలకం కూడా, వివిధ నిష్పత్తులలో ఈ మూడు గుణాలను కలిగి ఉంటుంది. “ఓం” అనే పదం ఈ మూడు గుణాల కలయికగా ఉంటుంది. అందుకే, అంత ప్రాధాన్యతను సంతరించుకుంది. హిందూ గ్రంథాల ప్రకారం, ఓం అనే పదం శివుడిని మరియు వినాయకుడిని కూడా సూచిస్తుంది. అందుకే వినాయకుడిని కొన్ని సందర్భాలలో “ఓం” రూపంలో పూజిస్తారు. ఎటువంటి దైవ కార్యాన్ని మొదలుపెట్టాలన్నా మొట్టమొదటగా వినాయకుని పూజిస్తారు. అందుకే వినాయకుని, ఆది గణపతి అని కూడా పిలవడం జరుగుతుంది. క్రమంగా మంత్రోచ్చారణ ప్రారంభం నందు ఓం అనే పదాన్ని ఉచ్చరించడం ద్వారా వినాయకుని స్మరించినట్లుగా కూడా చెప్పబడుతుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

విశ్వం ఆవిర్భావం జరిగినప్పుడు, ఓం అనే ధ్వని వినిపించిందన్నది పురాతన కాలం నుండి వస్తున్న ప్రధాన నమ్మకం. విశ్వం ముగింపునకు వచ్చినప్పుడు కూడా అదే ధ్వని వినిపిస్తుందని నమ్మకం. ఇంత గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది కాబట్టే ఆ శబ్దంతోనే మంత్రోచ్చారణ ప్రారంభించడం కూడా ఆనవాయితీగా వస్తున్నది. మూడు రకాల శక్తులను క్రమబద్దీకరిస్తూ, మానసిక ఒత్తిడిని తగ్గించి ఉపశమనం అందిస్తూ ఏకాగ్రతను మెరుగుపరచడంలో అత్యంత ప్రభావాన్ని కలిగి ఉంటుందని చెప్పబడింది. క్రమంగా మంత్రాల ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందేందుకు, ఏకాగ్రత కీలకపాత్రను పోషిస్తుంది. అందుకే రాజ యోగ, హాత్ యోగా వ్యాయామాలను అనుసరించే సమయంలో తరచుగా ఈ మంత్రం జపించడం జరుగుతుంది. ఓంకారోచ్చరణ మానసికంగానే కాకుండా, శ్వాసకోశ, ఉదర సంబంధిత ఆరోగ్యాల ప్రకారం శారీరికంగా కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటుందని చెప్పబడింది. ఇలా ఓం అనే శబ్దానికి చాలా చరిత్ర ఉంది. మరి ఓం అనే శబ్దం గురించి అలాగే ఓం అనే శబ్దానికి గల చరిత్ర గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.