AP లో ఆలయాలపై జగన్ సంచలన నిర్ణయం

777

ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని పేరు చెప్పగానే వెంటనే వినిపించేది సంచలన నిర్ణయం. అవును సంచలన నిర్ణయానికి మరో పేరు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గత 9 ఏళ్ళల్లో ఏ ముఖ్యమంత్రి తీసుకొని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.. పుట్టిన పసికందు నుంచి అవ్వ, తాతల వరుకు ప్రతి ఒక్కరికి పథకాల లాభాలు అందేలా, సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నాడు జగన్ అన్న. ఈ నేపథ్యంలోనే ఆలయాల విషయంలోనూ, నిరుద్యోగం విషయంలో ఒక కీలక నిర్ణయాన్ని వైఎస్ జగన్ తీసుకున్నాడు. వాటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.

Image result for temples

రాష్ట్రంలోని అన్ని ఆలయాలు, ట్రస్టులకు సంబంధించి వాటన్నింటికి పెద్దపీట వేయాలని జగన్ మెహన్ రెడ్డి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా రాష్ట్రంలోని అన్ని ఆలయాలు, ట్రస్టుల పాలక మండళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు సరైన ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కాగా వాటి పాలక మండలాల్లో 50 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తూ వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టి బిల్లును నేడు శాసన సభ ఆమోదించింది. అంతేకాకుండా మొత్తం పదవుల్లో 50శాతం మహిళలకే కేటాయించేలా సవరించినటువంటి బిల్లుకు కూడా శాసన సభ ఆమోదించింది. కాగా ఆలయాలకు సంబందించిన ట్రస్టుల పాలక మండళ్ల సభ్యులు ఎవరైనా సరే అక్రమాలకూ, దోపిడీలకు, అన్యాయానికి పాల్పడితే వారందరిని కూడా పదవీకాలంకంటే ముందుగానే వారి వారి పదవి నుండి తొలగించేలా ఈ బిల్లును రూపొందించారు. ఆలయాల పరిరక్షణ, పవిత్రత కాపాడేందుకు ప్రభుత్వానికి మొత్తం అధికారం ఉంటుందని, ఎవరైనా సరే అక్రమాలకూ పాల్పడితే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని జగన్ స్పష్టం చేశారు. కాగా ఆలయాల పాలక మండళ్లలో సామాజిక న్యాయం చేసేందుకే ఈ బిల్లును తీసుకువచ్చినట్టు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అసెంబ్లీలో ప్రకటించారు. అంతేకాకుండా ఈ బిల్లు ద్వారా సభ్యుడు ఎవరైనా తప్పు చేస్తే వారిని తొలగించే అవకాశం ఉందని వైసీపీ సభ్యుడు మల్లాది విష్ణు అన్నారు.

ఈ క్రింద వీడియోని చూడండి

ఇక నిరుద్యోగ సమస్య మీద కూడా జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగాన్ని తగ్గించేందుకు.. పారిశ్రామిక ఉద్యోగాల్లో 75 శాతం కోటా స్థానిక యువతకే ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ఇప్పటికే జగన్ కేబినెట్ ఆమోదించింది. దీనికి సంబంధించిన బిల్లును రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. బిల్లు ఆమోదం పొందితే ఈ కోటాను రాబోయే మూడేళ్లకు అమలు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. అయితే, జగన్ నిర్ణయానికి పరిశ్రమలు ఒప్పుకుంటాయో, లేదో తెలియాల్సి ఉంది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న పలు కంపెనీలను బుజ్జగించేందుకు జగన్ పలువురు అధికారులను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. పాదయాత్రలో భాగంగా స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఆయన ఈ ప్రతిపాదనలకు ముందడుగు వేశారు.

Image result for temples

కాగా, ఇప్పటికే నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు 1.33 లక్షల గ్రామీణ వాలంటీర్ ఉద్యోగాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు 75 శాతం కోటాతో మరింత మంది నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది.మరి జగన్ తీసుకున్న ఈ నిర్ణయాల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చెయ్యండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానెల్ ను సబ్ స్కైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చెయ్యండి.