చంద్రగ్రహణం రోజు ఈ రాశుల వారు ఇలా చేస్తే కుభేరులవుతారు

772

జూలై 27 అర్థరాత్రి 11 గంటల 54 నిమిషాలకు శతాబ్దంలోనే అరుదైన చంద్రగ్రహణం రాబోతోంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. దాదాపు 103 నిమిషాలపాటు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. శనివారం వేకువ జామున 3.49 గంటల వరకు గ్రహణం కొనసాగుతుంది. 4.58 గంటలకు గ్రహణ ప్రభావం పూర్తిగా తొలుగుతుంది.గ్రహగణాలు, వాటి స్థితిగతులను బాగా నమ్మే దేశం మనది. మనుషుల జీవితాలకు, గ్రహాల కదలికలకు సంబంధం వుందని.. అవే జీవితాల్ని శాసిస్తాయని చెబుతారు. అలాంటి దేశంలో గ్రహణాలపై శ్రద్ధ కాస్త ఎక్కువే.అందుకే ఈ గ్రహనం వలన గ్రహ దోషం ఉన్న వాళ్ళు ఏమేమి చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇక ఈసారి చంద్రగ్రహణం సయమంలో గర్భిణులు, కంటి సంబంధిత వ్యాధులు ఉన్నవారు గ్రహణాన్ని వీక్షించకపోవడం మంచిదని చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు రాత్రి 7.30 గంటల్లోగా భోజనం ముగించడం మంచిదని త్వరగా జీర్ణం కావడానికి టిఫిన్ చేయడం మరీ ఉత్తమం అని చెబుతున్నారు పండితులు.మిథున, తుల, కుంభ రాశుల వారు ఆరు నెలలపాటు జాగ్రత్తగా ఉండాలని గ్రహణం వీడిన 11 రోజుల్లోగా నవగ్రహ పూజ, శివుడికి అభిషేకం చేయించుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు. ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాలకు చెందిన గ్రహణానికి నాలుగు గంటల ముందే భోజనం చేయాలని.. గ్రహణం విడిచిన తర్వాత స్నానం ఆచరించి.. దీపారాధన చేసి భగవంతుణ్ని స్మరించాలని చెబుతున్నారు.మరోవైపు మేషం, సింహం, వృశ్చికం, మీన రాశుల వారికి ఈ గ్రహణ ప్రభావం అనుకూలంగా ఉంటుందని వీరి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని ధనయోగం, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయని వీరు గ్రహణ సమయంలో ఇష్టదైవాన్ని స్మరించాలని పండితులు సూచిస్తున్నారు.

గ్రహణం సమయంలో అందరు నిద్ర పోతుంటారు కాబట్టి ఆ సమయంలో పట్టు స్నానం చెయ్యల్సిన అవసరం లేదు.కానీ గ్రహణ ప్రభావిత రాశి వారు మీ వీలును బట్టి స్నానం ఆచరిస్తే మంచిది.ఆ తర్వాత రోజు అంటే శనివారం రోజు మాత్రం అభ్యంగన స్నానం చెయ్యాలి.దీనిని విడుపు స్నానం అంటారు.స్నానం ఆచరించిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసి సంకల్పం చెప్పుకోవాలి.తర్వాత గ్రహణానికి సంబందించిన దాన ధర్మాలు చెయ్యాలి.ఇలా చేయడం వలన గ్రహణ దోషం పోతుంది.దాన ధర్మాలు చెయ్యలేని వారు ఈ కేతు ధర్మాన్ని పటించాలి.
పలాశ పుష్ప సంకాశం….తారకాగ్రహ మస్తకం….రౌద్రం రౌద్రాత్మకం ఘోరం…..తం కేతుం ప్రణమామ్యాహం…ఈ మంత్రాన్ని ఏడుసార్లు పారాయణ చెయ్యాలి.

ఓం చంద్రగ్రహాయ నమో నమః అని పది సార్లు ,ఓం కేతుగానాయ నమో నమః అని అని ఏడూ సార్లు అని పారాయణ చేసి మీకు దగ్గరలో ఉన్న ఐదు చెట్లకు ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క చెంబుతో నీళ్ళు పోయాలి. వీలైతే రావి ఉసిరి జమ్మి చెట్లను దర్శించుకోవాలి.ఇలా చేయడం వలన గ్రహణ దోషాలన్నీ తొలగిపోతాయి.మీకు గ్రహణ దోషం ఉంటె పైన చెప్పిన పరిహారాలు చేసి మీ దోషాన్ని తొలగించుకోండి.మరి మేము చెప్పిన ఈ సమాచారం గురించి అలాగే గ్రహణ దోషం ఉన్న వాళ్ళు ఇంకా ఏమేమి చేస్తే మంచిదో మాకు కామెంట్ రూపంలో రాసిం అందరికి తెలిసేలా చెయ్యండి.