షాకింగ్: శబరిమల గుడిలోకి వెళ్ళిన ఇద్దరు మహిళలు.. తరువాత ఏమైందో తెలుసా?

368

ఈ మధ్య శబరిమల ఆలయం తరచు వార్తల్లో నిలుస్తుంది. ఆలయంలోకి మహిళలు వెళ్లొచ్చు అని సాక్షాత్తు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో గత కొన్నిరోజులుగా దీని మీద రగడ నడుస్తుంది.శబరిమలలో రణ నినాదాలు మార్మోగుతూనే ఉన్నాయి. అయ్యప్ప దర్శనానికి వచ్చే మహిళలను భక్తులు అడ్డుకుంటూనే ఉన్నారు. ఈనేపథ్యంలో ఇద్దరు మహిళా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారనే వీడియో వైరల్ గా మారింది. మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా..

Image result for sabarimala temple

సుప్రీంకోర్టు తీర్పుతో శబరిమల ఆలయంలోకి ప్రవేశించాలన్న మహిళల ప్రయత్నం ఎట్టకేలకు ఫలించింది. బుధవారం తెల్లవారుజామున ఇద్దరు మహిళలు అయ్యప్ప సన్నిధానంలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించారు. బిందు, కనకదుర్గ అనే 50 ఏళ్లలోపు మహిళలు పోలీసులు అండతో శబరిమల ఆలయానికి చేరుకున్నారు. నల్ల రంగు దుస్తులు ధరించి అత్యంత రహస్యంగా కట్టుదిట్టమైన భద్రత నడుమ పంబ నుంచి శబరిమలకు చేరారు. ఈ మహిళల రాకను గమనించిన భక్తులు ఆందోళన చేపట్టారు. పంబా బేస్ క్యాంప్‌నకు అర్ధరాత్రి చేరుకున్న ఈ మహిళలు, తెల్లవారుజామున 3.45 గంటలకు సన్నిధానంలో ప్రవేశించి, స్వామిని పూజించినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ సమయంలో భక్తులు కూడా పరిమితంగా ఉన్నారని, మీడియా ప్రతినిధులు కూడా లేరని అంటున్నాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ప్రస్తుతం ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలూ గత డిసెంబరు చివరిశబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడానికి కేరళ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా గతంలో ఎన్నడూ లేని విధంగా శబరిమలలో పటిష్ట భదత్ర కల్పించింది. కొందరు శబరిమల వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, భక్తులు వీరిని అడ్డుకోవడంతో వెనుదిరిగారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం శబరిమలలోకి 10 నుంచి 50 ఏళ్ల మహిళలను రాకుండా భక్తలు అడ్డుకుంటూ ఆందోళనలు, నిరసనలు నిర్వహిస్తున్నారు. అయినా సరే వీరి కళ్లుగప్పి ఇద్దరు మహిళలు సన్నిధానంలోకి ప్రవేశించడం విశేషం. దీనిపై అయ్యప్ప ధర్మసేన నేత రాహుల్ ఈశ్వరన్ మాట్లాడుతూ.. ఇది నమ్మశక్యంగా లేదని, అత్యంత రహస్యంగా మహిళలను ఆలయానికి తీసుకొచ్చారని అన్నారు. దీనిపై నిర్దరణకు వచ్చాక అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు. మరి ఈ విషయం గురించి మీరేమంటారు.శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం మీద సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు గురించి అలాగే గుడిలోకి చొచ్చుకొని వెళ్లిన ఈ మహిళల ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.