బ్రేకింగ్: శబరిమల ఆలయం మూసివేత.. గుడి లోపల పూజారులు ఏం చేస్తున్నారో తెలుసా?

390

శబరిమలలో మళ్లీ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. బుధవారం తెల్లవారుజామున ఇద్దరు మహిళా భక్తులు ఆలయంలోకి ప్రవేశించడం వివాదస్పదమైంది.సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా అయ్యప్ప దర్శనానికి 50 ఏళ్ల లోపు మహిళలు వస్తూనే ఉన్నారు. అయితే అయ్యప్ప భక్తులు అడ్డుకుంటుండటంతో వారు వెనుదిరగాల్సిన పరిస్థితి. ఈక్రమంలో శబరిమల పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అదలావుంటే తాజాగా ఇద్దరు మహిళలు అయ్యప్పను దర్శించుకున్నారనే వీడియో వైరలయింది. కనకదుర్గ, బిందు అనే 40 ఏళ్ల లోపు వయసున్న మహిళలు పోలీస్ ఎస్కార్ట్‌తో తెల్లవారుజామున ఆలయంలోనికి ప్రవేశించారు. ఈమేరకు కేరళ సీఎం పినరాయి విజయన్ కూడా ధృవీకరించారు. పోలీసుల సహాయంతో ఈ మహిళలిద్దరు స్వామిని దర్శించుకున్నట్లు ప్రకటించారు. నల్లటి దుస్తులు ధరించిన కనకదుర్గ, బిందు అర్ధరాత్రి పంబ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరి స్వామి సన్నిధికి చేరుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాలకు స్వామివారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో పెద్దగా భక్తజన సందోహం లేకపోవడంతో వీరికి కలిసొచ్చింది. దర్శనం కూడా క్షణాల్లో అయిపోయింది.

Image result for sabarimala temple

వీరిద్దరు డిసెంబర్ 24వ తేదీన స్వామివారి దర్శనానికి ప్రయత్నించారు. అయితే అయ్యప్ప భక్తులు అడ్డుకోవడంతో పంబ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. ఎట్టకేలకు బుధవారం స్వామివారి సన్నిధికి చేరుకున్న సందర్భంగా బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరు విజయోత్సాహంతో కేరింతలు కొడుతూ నృత్యాలు చేసినట్లు తెలుస్తోంది. 40 ఏళ్ల వయస్సులోపు ఇద్దరు మహిళల ప్రవేశంలో అయ్యప్ప ఆలయం తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు ప్రధాన అర్చకులు. తరతరాలుగా వస్తున్న ఆచారానికి భిన్నంగా బుధవారం నాడు ఇద్దరు మహిళలు స్వామివారి సన్నిధికి చేరుకోవడంతో ఆలయాన్ని సంప్రోక్షణ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆలయాన్ని పూర్తిస్థాయిలో శుద్ధి చేసిన తర్వాత తిరిగి తెరిచే అవకాశముంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించారనే అంశం వివాదస్పదంగా మారడంతో కేరళ పోలీసులు అలర్టయ్యారు. శబరిమలతో పాటు పలు చోట్ల బలగాలను మోహరించారు. అదేక్రమంలో కోయిలండిలోని బిందు ఇంటికి రక్షణ కల్పించినట్లు సమాచారం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆమె ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించినట్లు తెలుస్తోంది. అయితే బిందు ఇంటికి తాళం వేసి ఉంది. అయ్యప్ప భక్తులు అటాక్ చేయొచ్చనే భయంతో ముందస్తు జాగ్రత్తగా ఫ్యామిలీ మొత్తం అక్కడినుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. చూడాలి మరి ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. అయ్యప్ప ఆలయంలోకి మహిళలు చొచ్చుకెళ్లడం గురించి అలాగే ఇప్పుడు శబరిలో ఉన్న పరిస్థితుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.