బ్రహ్మంగారి కాలజ్ఞానం షాకింగ్ నిజాలు

626

పూర్వకాలంలో అనేక సిద్ధపురుషులు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు తమ దివ్యదృష్టితో ముందుగానే ఊహించి చెప్పేవారు. అలాంటి వారిలో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఒకరు. మధ్యయుగంలో తెలుగునాట జీవించిన ఆయన తన మహిమలతో ఎంతోమందితో పూజలు అందుకున్నారు. అన్నింటిలోకి ఆయన కాలజ్ఞానం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. బ్రహ్మంగారు చెప్పిన జోస్యాల్లో నేటికి ఎన్నో విషయాలు రుజువయ్యాయి. దేశానికి స్వాతంత్ర్యం, గాంధీ గారు, ఇందిరాగాంధీ పరిపాలన ఇలా ఆయన చెప్పింది చెప్పినట్లు పొల్లుపోకుండా జరిగింది. మరి ఆయన చెప్పిన కొన్ని తత్వ విషయాలు ఇప్పుడు అందులో ఎన్ని జరిగాయి అనేది తెలుసుకుందాం.

Related image

సొమ్ముల కోసం మతాలు మార్చుకుంటారు…
ఇప్పుడు చాలా మంది పుట్టింది ఓ మతం అయితే, వారు పెరిగేది ఒ మతం జీవించేది ఒ మతం, చనిపోయేది వేరే మతం అలా ఉంది పరిస్దితి. చాలా మంది కొన్ని మతాలలోకి డబ్బుల కోసం వారు చూపించే లాభాల ఆశలకోసం వెంపర్లాడతారు.. మరి ఇలాంటిదే అది కూడా. అందుకే ఇప్పుడు ఇలా మత మార్పిడులు జరుగుతున్నవి చూస్తుంటే ఆనాడు వీరబ్రహ్మం గారు చెప్పిందే నేడు జరుగుతుంది అని చెప్పవచ్చు.సూర్య చంద్రులు ఎలా ఒక్కరుగా ఉన్నారో దేవుడు ఒక్కడే అని ఆయన చెప్పారు. అన్నిమతాల సారం ఒకటే అనేది గుర్తించాలి. ధనకాంక్షతోనే చాలా మంది మతాలు మార్చుకుంటున్నారు. కోటి మంది ఇప్పటి వరకూ ఇలా మతం మారారు అని తెలుస్తోంది.

ఈ క్రింది వీడియో చూడండి

దేవతా విగ్రహాలు దొంగలించడం
చాలా దేవాలయాల్లో రోజుకి పదుల సంఖ్యలో దేవతా విగ్రహాలను దోచేస్తున్నారు. ఆనాడు బ్రహ్మంగారు ఏమైతే చెప్పారో మళ్లీ ఈనాడు నిజంగా రుజువు అవుతున్నాయి.. ఎక్కడికి అక్కడ దేవతా విగ్రహాలు చోరికి గురి అవుతున్నాయి. చాలా దేవాలయాలలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇలా జరుగుతుంది అని ఆనాడు బ్రహ్మంగారు చెప్పారు. అదే ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తోంది. డబ్బు ఆశకోసం ఇలా విగ్రహాలను కూడా చోరీలు చేస్తున్నారు.

Related image

సన్యాసి పుట్టి అన్నం ముట్టుకోడు
నిజమే ఆనాడు సన్యాసులు అన్నం ఆహరం ముట్టుకోకుండా ఉండే ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఇలాంటివి చేద్దాము అన్నా కుదరడం లేదు, ఆరోగ్యాలు సహకరించవు. కాని ఇప్పుడు నిజంగా ఇలాంటి ఓ సన్యాసి దేశంలో అందరిని ఆశ్చర్యపరిచాడు. వీరబ్రహ్మంగారు చెప్పినట్టు ఓ సన్యాసి అన్నం తినకుండా నీళ్లు తాగకుండా 70 ఏళ్లు ఉంటాడు అని చెప్పారు, ఇప్పుడు ఇలాంటి సన్యాసి నిజంగా కనిపించాడు జనాలకు. గుజరాత్ కు చెందిన ప్రహ్లద్ జానీ ఇలా అన్నం ముట్టుకోకుండా 60 ఏళ్లుగా ఉన్నాడు, అతనికి అనేక పరీక్షలు నిర్వహించారు వైద్యులు. ఇందులో అతను ఎలాంటి ఆహారం తీసుకోకపోయినా చాలా ఆరోగ్యంగా బతికాడు అని తెలుసుకున్నారు. ఓ 2 రోజులు మిలటరీ డాక్టర్లు అతనిని పరీక్షించి చూశారు. అతను ఆహారం తీసుకోవడం లేదు అని తేల్చుకున్నారు. చుట్టూ కెమెరాలు పెట్టి అతను చేసే పని ఏమిటి అని అబ్జర్వ్ చేశారు. ఈ సమయంలో అతను ఎలాంటి ఆహారం తీసుకోవడం లేదు అని అతను అయినా ఎలా జీవిస్తున్నాడో తెలియడం లేదు అని అన్నారు డాక్ట్ర్లర్లు. ఇది ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.

Image result for మద్యం సేవించడం

మద్యం సేవించడం
ఆనాడు బ్రహ్మంగా రు చెప్పింది ఇప్పుడు నిజంగా కళ్లకు కనిపిస్తుంది, తాగడానికి మద్యం అన్ని చోట్లా దొరుకుతుంది కాని గ్లాసు నీరు మాత్రం దొరకక పోవచ్చు అన్నారు. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో నీరు దొరకడం లేదు కాని ప్రతీ పల్లెల్లోనూ వైన్ షాపులు కనిపిస్తున్నాయి. మందు మాత్రం అన్నిచోట్లా దొరుకుతోంది.. ఇక ఈ మద్యానికి అమ్మాయిలు అబ్బాయిలు కూడా అలవాటు పడతారు అని చెప్పారు బ్రహ్మంగారు, అలాగే అబ్బాయిలు అమ్మాయిలు కూడా పెద్ద ఎత్తున మద్యం సేవిస్తున్నారు. 24 గంటలు మద్యం అమ్మకాలు కూడా ఈ ప్రపంచంలో జరుగుతున్నాయి.

Related image

ఊరారా శక్తి
1978 1980 కాలంలో ఊరిలో ఏదో ఓశక్తి తిరుగుతోంది అని రాత్రి వేళ్లల్లో వచ్చి తలుపు కొడుతోంది అని చాలా మంది అనేవారు దిల్లీ నొయిడా పంజాబ్ ఇలాంటి ప్రాంతాలలో రోజుకో కథ మీడియాలో వినిపించేది.. ఈ సమయంలో వారు ఇంటి బయట బోర్డుపై ఓ స్తీ రేపు రా అని రాశారు, ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఆ ఇంట కలగలేదు అని చెబుతారు. నిజంగా ఇది ఆనాడు బ్రహ్మంగారి కాలగ్రంధంలో ఎలా రాశారో అలాగే జరిగింది.

సంఘాలు కులాలకు కొమ్ముకాయడం
ప్రతీ కులానికి సంఘాలు ఏర్పడతాయి అని, అప్పటి వరకూ కలిసి మెలిసి ఉన్న అన్ని కులాల వారు తమ కులం అనే ఉన్మాదానికి మారతారు అని కులాల సంఘాలు కులాల కోట్లాటల్లో జనాలు చిక్కుకుంటారు అని ఆనాడు బ్రహ్మంగారు చెప్పారు, చివరకు నేడు ఇలా ప్రతీ కులానికి సంఘం ఏర్పడింది అంతేకాదు ప్రతీ సంఘాలు కూడా తమకులాల వారికి ఆర్దికంగా సపోర్ట్ చేస్తున్నారు, కులాల రొంపిలో జనాలని కూడా దింపేశారు, ఇలా నవీన యుగం మారుతుంది అని ఆనాడే బ్రహ్మంగారు కాలగ్రంధంలో రాశారు.

Image result for సంఘాలు కులాలకు కొమ్ముకాయడం

ఆకులేని తీగలు కరెంట్ వైర్లు
ఆనాడు బ్రహ్మంగారు చెప్పారు ఆకులేని తీగలు ప్రపంచం అంతా వస్తాయి అని నేడు కరెంట్ మొత్తం ఇలా తీగల ద్వారా వెళుతోంది. ఈ కరెంటు తీగల ద్వారా ప్రపంచం అంతా 24 గంటల విద్యుత్ వస్తోంది, ఇక బ్రహ్మంగారి కాలంలో ద్వీపాలు మాత్రమే ఉండేవి. ఆనాడు ఆయన ఏమి చెప్పారో నేడు అదే జరిగింది. అందుకే ఆ కరెంటు తీగలకు ఎలాంటి సపోర్ట్ ఆకులు లేనివి అని ప్రపంచం చుట్టూ ఉంటాయి అనిచెప్పారో అలాగే జరుగుతోంది.

Image result for ఆకులేని తీగలు కరెంట్ వైర్లు

సూర్యకాంతులు ఇంటికి వెలుగులు ఇస్తాయి
ఇక కరెంట్ నుంచి మరింత అడ్వాన్సుడుగా మన ప్రపంచం మారుతుంది అని ఆనాడే బ్రహ్మంగారు చెప్పారు, సోలార్ తో ప్రతీఇంటికి వెలుగులు వస్తున్నాయి, కాలగ్రంధంలో దీని గురించి ఆయన వివరించారు.సూర్యకాంతులు ప్రతీ ఇంటివి వస్తాయి అని సూర్య కాంతి ప్రతీ ఇంటిని వెలిగించి మరింత ప్రకాశవంతం అవుతుంది అన్నారు అలాగే ఇప్పుడు ఎక్కడ చూసినా సోలార్ వెలుగులు జిగేలుమంటున్నాయి.

Image result for lovers

మైనర్లు కన్వత్యం కోల్పోతారు
చాలా మంది అమ్మాయిు పలు వింత పోకడల వల్ల పురుషులతో సాన్నిహిత్యం వల్ల వారి కన్వత్వం కోల్పోతారని, పెళ్లికాకుండానే వారి శీలాన్ని కోల్పోతారు అని, ఇది వారి ఇష్టంతోనే చేస్తారు అని చెప్పారు, ఇప్పుడు మారుతున్న సమాజం టెక్నాలజీతో ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయి, భార్యలు భర్తలను చంపేస్దితికి కూడా ఇలాంటి సంభంధాలు ఉంటున్నాయి, అలాగే చాలా మంది మైనర్లు తమ కన్యత్వం కోల్పోతున్నారు అనేది పలు సర్వేలు కూడా చెబుతున్నవే.

కోత్త కోత్త బాబాలు
దేవుని పేరు చెప్పుకుని పబ్బం గడిపే బాబాలు చాలా మంది పుడతున్నారు, ఇలా కొత్త దేవరూపాలుగా చెప్పుకుని అవతారపురుషులుగా కొత్త బాబాలు, శక్తిరూపాలుగా కొందరు వస్తారు అని ఆనాడు బ్రహ్మంగారు తెలియచేశారు.. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఇలాంటి బురిడీ బాబాలు చాలా మంది కొత్తగా పుట్టుకువస్తున్నారు. కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి అమ్మాయిలతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ పోలీసులుకు చిక్కుతున్నారు. ఇాలాంటి వారు పుట్టుకువస్తారు అని ఆనాడే బ్రహ్మంగారు తెలియచేశారు, మరి చూశారుగా బ్రహ్మంగారు చెప్పిన విషయాలు జరిగిన సంఘటనలు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.